Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బందాసింగ్ బైరాగి బలిదానం - banda singh bahadur life story

బందాసింగ్ బైరాగి బలిదానం: నాందేడ్లో గోదావరి తీరంలో సంత్ మాధవదాసు అను యువ సన్యాసి ఆశ్రమం ఉంది. అతని కీర్తి అమోఘం. అదివిని గురుగోవిందుడు ...


బందాసింగ్ బైరాగి బలిదానం:
నాందేడ్లో గోదావరి తీరంలో సంత్ మాధవదాసు అను యువ సన్యాసి ఆశ్రమం ఉంది. అతని కీర్తి అమోఘం. అదివిని గురుగోవిందుడు అతన్ని కలువడానికి తరచు ఆశ్రమానికి వెళ్లేవాడు. ఇద్దరి మధ్య దేశ-ధర్మ సంరక్షణ విషయమై చర్చలు జరిగేవి. గురుగోవిందుని మాటలనుండి సంత్ మాధవదాసు ఎంతగానో ప్రభావితుడైనాడు. దేశ-ధర్మ సంరక్షణ కోసం సంఘర్షణ జరుపుటకు ప్రేరణ పొంది నాడు ఢిల్లీ మరియు పంజాబు ప్రాంతాలకు వెళ్లి సిక్కులకు నాయకత్వం వహించి సంఘర్షణ సాగించుమన్నాడు గురూజీ. సిక్కు నాయకులు నుద్దేశించి ఉత్తరం వ్రాశాడు. గురు గోవిందుని హత్యతో మాధవదాసు ఎంతగానో వ్యధ చెందినాడు. ముస్లిములపై ప్రతీకారానికి ప్రతినబూనినాడు. సాయుధ సంఘర్షణకు సంకల్పించాడు.

గురూజీ ఉత్తరాన్ని తీసుకొని ఉత్తరాదికి పయన మయ్యాడు. ఢిల్లీ చేరుకొని సిక్కునాయకులకు గురువుగారి మరణవార్త తెలిపారు, ఉత్తరాన్ని చూపించాడు. దిల్లీలోని సిక్కులంతా ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తూ జయజయ కారాలు చేశారు. అక్కడినుండి పంజాబుకు వెళ్లినాడు. అక్కడి సిక్కునాయకులకు కూడా ఉత్తరం చూపి విషయం వివరించాడు. అక్కడ కూడా సిక్కులంతా జయకారాలు పలికి మాధవదాసు నాయకత్వంలో సాయుధ సంఘర్షణకు సంకల్పించారు. కత్తులు దూసి వాహెగురూ !! అంటూ గురువు హత్యకు ప్రతీకారానికి సిద్ధపడ్డారు. సంత్ మాధవదాసు తన వేషాన్ని మార్చి ఖాల్సాదీక్షను స్వీకరించి సిక్కువేషాన్ని ధరించాడు. తన పేరును బందా సింగ్ బైరాగిగా మార్చుకొన్నాడు.

పంజాబులో 40వేల సైన్యాన్ని యుద్ధసన్నద్ధత గావించాడు. ప్రపథమంగా ప్రతీకారంతో బందాసింహుడు (బందాబైరాగి) గురుగోవిందున్ని చంపించిన సర్ హింద్ నవాబుపై దాడికి వెళ్లినాడు. ప్రతీకారవాంఛతో సిక్కులు పౌరుషం పరాకాష్ఠనందుకున్నది. సర్ హిందు ను ముట్టడించి స్వాధీనం చేసుకున్నారు. నవాబు వజీర్ ఖాన్ ను నిర్బంధించి తల తెగనరికి గురూజీ హత్యకు, గురుపుత్రుల పాశవిక హత్యకు ప్రతీకారం తీర్చుకొన్నారు. బాద్ సింహ అను వీరున్ని సర్ హింద్ పాలకునిగా నియమించి బందా బైరాగి ముందుకు సాగిపోయినాడు. ముస్లింల స్వాధీనంలోనున్న లోహగఢ్ (సాధురా) ప్రాంతాన్ని వశం చేసుకున్నాడు. లోహ గఢ్ కోట యుద్ధవ్యూహరీత్యా చాలా కీలకమయినది. పంజాబు ప్రాంతానికంతకూ కేంద్రంగా ఉంది. దాన్ని సుదృఢపరిచి బందాసింహుడు తన రాజధానిని చేసుకున్నాడు. తర్వాత సిక్కులు విజృంభించి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుని ముస్లిములను తరిమికొట్టినారు. యమునా-సట్లెజ్ నదుల మధ్యభాగమంతా సిక్కుల రాజ్యం విస్తరించింది. గురుగోవిందసింహుని తర్వాతకూడా సిక్కుల రాజ్యం విస్తరించడం, పటిష్టమవడం ముస్లిం (ఢిల్లీ) పాలకులకు నచ్చలేదు. బందాబైరాగిని అంతం చేయుటకు పూనుకున్నారు.

1715లో మొగలు సేనాని దిలేర్ జంగ్ పూర్తి సంసిద్ధతతో బందాబైరాగిపై దాడి చేశాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. ముస్లింల భారీ సైన్యం ముందు సీమితమైన సిక్కు సైన్యం నిలువలేకపోయింది. సిక్కు సైన్యం పరాజయం పాలయింది. బందాబైరాగిని నిర్బంధించి అత్యంత పాశవికంగా హత్య చేశారు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. బందాబైరాగి తర్వాత సిక్కుల లో నాయకత్వ శూన్యత ఏర్పడింది. అయినా రాజ్యం నిలదొక్కుకున్నది. వారి రాజ్యం పూర్తిగా ఎప్పుడూ ముస్లింల వశం కాలేదు. మహారాజా రణజీత్ సింహ (రంజిత్ సింహ) నాయకత్వం (1780-1839)లో సిక్కుల రాజ్యం బాగా విస్తరించింది. పంజాబ్ ప్రాంతం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌ వరకు సిక్కు సామ్రాజ్యం విస్తరించింది. ఆంగ్లేయులకుకూడా లొంగకుండా స్వతంత్ర రాజ్యంగా విలసిల్లింది. సుమారు రెండువందల ఏళ్లపాటు సిక్కులు ముస్లిములతో నిరంతర సంఘర్షణ సాగించారు. హిందూ (సిక్కు) ధర్మరక్షణగావించి ఇస్లాం అత్యాచారాలను నిరోధించారు. పంజాబు ఇస్లాం రాజ్యంగా మారకుండా కాపాడబడింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

సేకరణ: హిందూ దేశం పై ముస్లింల దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటనా పరంపర. పుస్తకం నుండి సేకరణ పుస్తకం దొరుకు నిలయం.
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236,

సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

No comments