Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గోవా విముక్తి కై ప్రాణలర్పించిన 18 ఏళ్ళ ఆంధ్రా యువ కిషోరం - సూరి సీతారం - About Suuri Seetaaram - Suri Sitaram Uyyuru

సాదారణంగా మనం ఎవరినైనా భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అని అడిగితే చటుక్కున ఆగష్ట్ 15 1947 అంటారు, కాని నిజంగా భా...

సాదారణంగా మనం ఎవరినైనా భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అని అడిగితే చటుక్కున ఆగష్ట్ 15 1947 అంటారు, కాని నిజంగా భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం ఆరోజు రాలేదు, రాక పోగా మతం పేరుతో రెండు ముక్కలైంది తరువాత మూడూ ముక్కలైంది. ఇకపోతే ఆరోజు భారతదేశంలో అధిక భూభాగానికి స్వాతంత్ర్యం రావడం మూలంగా మనం అంతా ఆగష్ట్ 15 న సంబరాలు జరుపుకుంటాం.

మన హైదరాబద్ ని తీసుకుంటే సెప్టెంబర్ 17 1948 వరకు నిజాం బానిసత్వంలో ఉంది సర్దార్ పటేల్ వలన హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించింది.... ఆ తరువాత 1960 వరకు పాండిచ్చేరి, మాహె, యానం, కరైకాల్, బెంగాల్ లోని చందానగర్ లు ఫ్రెంచి వారి ఆధీనంలో ఉన్నవి కొన్ని ఒప్పందాలతో వాటిని విలీనం చేసుకోవడం జరిగింది, అలాగే గోవా, డయ్యు డామన్, దాద్రానగర్ హవేలీ ఈ ప్రాంతాలు పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండేవి. డిసెంబర్ 19 1961 లో వీటికి పోర్చుగీస్ వారి నుండి విముక్తి లభించింది.

ప్రెంచి వారు ఎదోరకంగా విలీనం చేసినప్పటికీ పోర్చుగీసు వారు మాత్రం  గోవా ప్రజలను బానిసత్వం లో ఉంచి నరక యాతనలు పెట్టేవారు అలాంటి సమయంలో ఒక సత్యాగ్రహం మొదలయ్యింది. 1954 జూన్ నెలలో కొంత మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అలాగే అనేక మంది దేశ భక్తులు ఎలాగైనా సరే గోవాని భారతమాత దాస్య శృంకలాల నుండి విముక్తి సాధించడానికి ఒక కవాతు నిర్వహించాలి అని నిర్ణయించారు ఆ కవాతు ఆగష్ట్ 15 1955 నాటికి పూర్తయి గోవా విముక్తి సాధించడం దాని లక్ష్యం.

ఈ విషయం తెలిసిన అనేకమంది దేశ భక్తులు గోవాకి పయనమయ్యారు, అదే సమయంలో మన తెలుగు వాడు ఆంధ్రుడు కృష్ణాజిల్లా ఉయ్యూరు కి చెందిన సూరి సీతారం అనే నవ యవ్వన యువ కిషోరం గోవాకి తన మిత్రులు పదిహేను మందితో కలిసి బయలుదేరాడు ఆనాడు విజయవాడ నుండి గోవాకి ఒక రైలు ఉండేది ఆ రైలులో దేశ భక్తి గీతాలు పాడుకుంటూ తన మిత్రులందరినీ మన సూరి సీతారం ఒక నాయకుడిగా ఉత్తేజ పరుస్తూ వెళ్ళారు, కనీసం ఆ 15 మంది యువకులు ఏ ఒక్కరూ కూడా తమ తల్లితండులకు మేమూ గోవా విముక్తికై వెళ్తున్నాం అనే సమాచారం కూడా ఇవ్వకుండా బయలుదేరారు.

గోవాలో సత్యా గ్రహం మొదలయ్యింది అప్పటికే ఎక్కడికక్కడ పోర్చూగీస్ సైన్యం దేశ భక్తులను చల్లా చెదురు చేసే పనిలో బస్సులను రైళ్ళను గోవా వైపు రాకుండా ఆపేశారు, అలాగే గోవా ప్రజలను భయ బ్రాంతులకు గురిచేశారు, ఆ దుర్మార్గానికి దడిసి కొంతమంది మద్యలోనే ఆగిపోయారు కానీ మన సూరి సీతారం తన మిత్రులు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు మధ్యలో కొంత మంది దేశ భక్తులు జతయ్యారు కానీ రైళ్ళు ఆపడం వలన రైలు పట్టాలనే మార్గంగా ఎంచుకుని ఒక నూటయాబై మంది పైబడి యువకులు పట్టాల మీద వేగంగా నడుస్తూ ఆగష్ట్ 15 కి గోవా దగ్గరకు చేరుకున్నారు.  

రైళ్ళ పట్టాల వెంట నడిచి కాళ్ళు పగిలి అలగే అలసటకు గురైన సూరి సీతారం మిత్ర బృందం ఒకచోట పోర్చుగీస్ సైన్యం కంటపడ్డారు వాళ్ళు వెంటనే తుపాకులతో కాల్చడం మొదలు పెట్టారు అప్పటి వరకు ఉన్న చాలా మంది మిత్రులు భయ భ్రాంతికి గురై పక్కకు వెళ్ళిపోయారు దాక్కుకున్నారు కానీ వారి కాల్పులను నిరసిస్తూ చాతీని చూపిస్తూ మన సూరి ముందుకెళ్ళాడు కాని ఆ దుర్మార్గులు తూటా మీద తూటా ఎక్కుపెట్టి సీతారాం గుండెల్లో పదుల్లో బుల్లెట్లు కాల్చారు తల్లితండ్రులకు చెప్పకుండా పయనమైన మన యువకిషోరం నేల కొరిగాడు, అప్పటికే గోవాలో 150 మంది కనీసం పోర్చుగీస్ వాళ్ళ చేత చంపబడ్డారు, జలియన్ వాలా భాగ్ మారణాకాండ తరువాత స్వాతంత్ర్యం కోసం అత్యధిక మంది చనిపోవడం ఇదే కానీ పోర్చుగీస్ వాళ్ళు కేవలం 20 మంది మాత్రమే చనిపోయారు అని చెబుతుంది లెక్కల ప్రకారం.

నేల కొరిగిన మన సూరి సీతారం ని చనిపోయిన తరువాత తన శవం దొరికితే పెద్ద దావాళంలా ఉధ్యమం పెరిగిపోతుంది అని కిరోసిన తో కాల్చి కనీసం శరీరం కూడా దొరకకుండా చేశారు ఇది కళ్ళారా చూసిన సీతారం మిత్రులు తండ్రి సూరి శోభనా చలపతికి అలాగే గోవా స్వాతంత్ర్య విముక్తి సమితికి వెల్లడించారు, అలాగే మిత్రులు ఉయ్యూరు లో సూరి జ్ఞాపకార్దం ఒక ట్రస్టు ఎర్ఫాటు చేశారు సూరి ట్రస్టు అలాగే విగ్రహం కట్టించారు ఉయ్యూరు వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి, అదే విదంగా గోవా స్వాతంత్ర్య వీరుల మ్యుజియంలో మరియు ఎర్రకొటలో కూడా సూరి చిత్రపటం ఉంది అని తెలిసింది.

సీతారం ఉయ్యురులో జులై 10 1937 లో జన్మించాడు, 1955 ఆగష్ట్ 15 న గోవాలో అమరుడయ్యాడు. కేవలం 18 సంవత్సరాల వయస్సులో దేశం కోసం అమరులయ్యిన అతికొద్ది మందిలో ఒకరు సూరి సీతారం. ఇలాంటి గొప్ప వీరులు భారతదేశ స్వాతంత్ర్య విముక్తి కోసం పోరాడారు అలాంటి పోరాటాల వలన 16 డిసెంబర్ 1961 లో మొత్తం భారతదేశానికి విముక్తి లభించింది. ఇలాంటి అజ్ఞాత స్వాతంత్ర్య వీరుల గురించి తెలుసుకోవడం గర్వంగా ఉంది వారిని స్మరించుకుందాం దేశం కోసం ఎంతో కొంత మనం కూడా  సమయం ఇచ్చి ఎదో ఒక సేవ చేద్దాం భారత్ మాతా కీ జై. రాజశేఖర్ నన్నపనేని. 

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments