Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

తేనె వాడకం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు - The health benefits of using honey - honey uses in telugu

తేనె వాడకం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వేల సంవత్సరాలుగా తేనె బాగా రుచికరమైన పాకంగా ఎప్పటికీ ప్రసిద్దమైంది, అలాగే అనేక వ్యాధులకు ఒక...


తేనె వాడకం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఎన్నో వేల సంవత్సరాలుగా తేనె బాగా రుచికరమైన పాకంగా ఎప్పటికీ ప్రసిద్దమైంది, అలాగే అనేక వ్యాధులకు ఒక ముఖ్య వైద్య చికిత్సలా ఉపయోగపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన పూర్వీకులు తేనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై బాగా అవగాహన కల్గిన వారుగా కనపడుతారు. ఇంతకు ముందు తేనెను ఒక ఔషధ మూలికగా ‘సుమేరియన్ మట్టి మాత్రలలో’ సుమారు 4000 సంవత్సరాలుగా ఉపయోగించారు. దాదాపు 30% సుమేరియన్ల వైద్య చికిత్సలో తేనె కలిసి వుంటుంది. భారత దేశంలో పురాతన, సంప్రదాయ వైద్య వ్యవస్థలైన సిద్ధ, ఆయుర్వేదంలో తేనె ప్రధాన మూలికగా ఉపయోగపడుతోంది. పురాతన ఈజిప్ట్ నాగరికతలో, తేనెను చర్మ సంరక్షణకు, నేత్ర సంబంధ వ్యాధుల నివారణకు, అలాగే గాయాలను, కాలిన గాయాలను సహజంగా నయం చేసే మూలికగా ప్రసిద్ది పొందింది. అనేక ఇతర సంస్కృతుల వారు తేనెను వైద్య ప్రయోజనాలకు ముఖ్య మూలికగా ఉపయోగించారు.

నేడు, అనేక వైద్య శాస్త్ర పరిశోధనల్లో తేనె ప్రయోజనాలపై వైద్య లోకం ప్రధానంగా దృష్టి పెట్టింది. కానీ మన పూర్వీకులు ఏనాడో పరిశోధనలు చేసి, తేనె వల్ల అనేక ప్రయోజనాల ఉన్నాయని నిర్థారించారు. ఈ విషయాలలో కొన్నింటిని ఒకసారి చూద్దాం.

తేనెతో ఆరోగ్య ప్రయోజనాలు
1. రక్తానికి తేనె ఎంతో మంచిది

తేనె తీసుకునే విధానం బట్టి వివిధ రకాలుగా మీ శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. తేనెను గోరువెచ్చని నీటితో కలిపి త్రాగితే, అది రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్యను (RBC) పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని వివిధ భాగాలకు రక్తంలో ఆక్సిజన్ అందచేయడంలో ఈ RBCలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తేనెను గోరువెచ్చని నీటితో కలిపి త్రాగడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి, రక్త హీనత నుంచి ఉపశమనం కలుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఐరన్ లోపించడం వల్ల రక్త హీనత ఏర్పడుతుంది. ఇందువల్ల శరీర భాగాలకు ఆక్సిజన్ అందజేసే సామర్థ్యం రక్తంలో తగ్గుతుంది. దీంతో అలసట, శ్వాశ తీసుకోవడంలో ఇబ్బంది, మాంద్యం వంటి సమస్యలు వస్తాయి. తేనె రక్తానికి ఆక్సిజన్ అందజేసే సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పై సమస్యలను నివారిస్తుంది.

రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడం అనేది చాలా ముఖ్యమైంది ఎందుకంటే శరీరం ఎంత ఆరోగ్యంగా వుంది, ఎంత సులభంగా శక్తిని తిరిగి పొందుతోంది అనేవి రక్తంలో ఆక్సిజన్ స్థాయిపై ఆధారపడి వుంటాయి. ప్రాథమిక వైద్య పరిశోధనలో సైతం తేనె వాడకం వల్ల రక్తపోటు (BP), హైపర్టెన్షన్ పై మంచి ప్రభావాన్ని చూపుతాయని తెలుసుకున్నారు. సాధారణంగా, తేనెను త్రాగడం వల్ల హైపర్టెన్షన్ లేదా లో-బిపి యొక్క ప్రభావం గణనీయంగా తగ్గుతాయి.

తేనె వాడకం వల్ల కిమోథెరపి రోగులలో తక్కువగా వున్న తెల్ల రక్త కణాల సంఖ్యను నియంత్రిస్తాయని మరికొన్ని ప్రాథమిక ఆధారాల వల్ల రుజువైంది. చిన్న పాటి ప్రయోగాలలో, కిమోథెరపిలో భాగంగా 40% మంది రోగులు రోజుకు రెండు చెంచాల తేనెను తీసుకోవడం వల్ల ప్రమాదకర స్థాయిలో తక్కువగా ఉన్న తెల్ల రక్త కణాల సంఖ్య నియంత్రించబడి, ఆ సమస్య తిరిగి పునరావృతం కాకుండా నివారించబడింది.

2. చక్కెర కంటే తేనె సురక్షితమైంది

చచక్కెర వాడటం వల్ల శరీరంపై చెడు ప్రభావం కలుగుతుందని చాలా మంది చెబుతారు. ఇందుకు తేనె గొప్ప ప్రత్యామ్నాయం ఎందుకంటే అది తీయగా వుంటుంది అలాగే అది తీసుకోవడం శరీరానికి సురక్షితం. తేనె రసాయన తయారీలో భాగంగా కొంత చక్కెర లక్షణాలు కలిసినప్పటికీ, అది చక్కెర కంటే ఎంతో భిన్నమైంది ఎందుకంటే ఇందులో 30% గ్లూకోస్, 40% ఫ్రక్టోస్ – (రెండు సింపుల్ షుగర్)– అలాగే 20% ఇతర సంక్లిష్టమైన చక్కెర లక్షణాలను కలగలిపి వుంటాయి. తేనెలో ఇంకా dextrin, strachy fiber కూడా వుంటాయి. రక్తంలోని చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచడంలో ఈ మిశ్రమం సహాయపడుతుంది.

౩. యోగ సాధన చేసే వారికి తేనె ఎంతో ఉపయోగమైంది

యోగ సాధన చేసే వారు తేనె వాడటం వల్ల రక్తంలోని రసాయనంలో సమతుల్యత వస్తుంది. తేనెను రోజూ తీసుకోవడం వల్ల శరీర వ్యవస్థ మరింత శక్తివంతం అవుతుంది. ప్రొద్దున యోగ సాధనకు ముందు గోరువెచ్చని నీటితో తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని అన్ని వ్యవస్థలు బాగా తెరుచుకుంటాయి.

4. తేనె ఒక యాంటి బాక్టీరియా, యాంటిసెప్టిక్ ఔషధం

తేనె శరీరంలో యాంటి-ఆక్సిడెంట్ కారకాలను పెంచి ప్రతిరోధకాలను ప్రేరేపించి శరీరానికి హాని చేసే సూక్ష్మ జీవుల చర్యలను నియంత్రిస్తాయి. తేనె ద్వారా గాయాలకు చికిత్స చేయడానికి అనేక అధ్యాయనాలు జరుపుతున్నాయి. ఒక అధ్యయనంలో ప్రత్యేక శుద్దీకరణ ప్రక్రియ ద్వారా చికిత్సగా తీసుకున్న తేనెను గాయాలకు వాడటం వల్ల అన్ని రకాల బాక్టీరియాలను నాశనం చేస్తుందని తేల్చారు. సంప్రదాయ వైద్యంలో తేనె వాడకం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో శ్వాసకోశ వ్యాధి నియంత్రణా చికిత్స ముఖ్యమైంది. రోజూ తేనెను తీసుకోవడం వల్ల అధిక శ్లేష్మం / గళ్ళ, అస్తమా వంటి సమస్యలను నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది.

వైద్య స్థాయిలోని తేనె – మనం తీసుకునే ఆహారంలోని ‘Eschetichia coli, salmonella’ వంటి వ్యాధికారకాలను నాశనం చేస్తుందని క్లినికల్ పరిశోధనలో తేలింది. తేనె శరీరంలోని యాంటి-బయోటిక్ లను నిరోదించే అన్ని రకాల బాక్టీరియాలను నియంత్రిస్తుంది.

మరో పరిశోధనలో తేనె ‘methicillin’ నిరోధకాలు ‘Staphylococcus aureus, Pseudomonas aeruginosa’ లకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. తేనె అంటురోగాలను అనేక స్థాయిలలో నియంత్రించి వ్యాధికారకాల పెరుగుదలను అడ్డుకుంటుంది. బాక్టీరియా శరీరంలోని యాంటి-బయోటిక్స్ లక్ష్యంగా చేసుకొని నిరోధిస్తాయి, తేనె వాటిని కనిపెట్టి నాశనం చేస్తాయి – దానినే ‘quorum sensing’ అని పిలుస్తాం. అంతేగాక తేనె తీవ్రమైన బాక్టీరియా వ్యాధికారకాలను తగ్గించి, రోగ నిరోధక కారకాలు (antibiotics) మరింత ప్రభావితంగా పనిచేసేలా చేస్తాయి.

5. తేనె ఒక శక్తివంతమైన ఆహారం

సంప్రదాయ వైద్యంలో తేనె శరీరానికి తక్షణం శక్తినిచ్చే కారకంగా ఉపయోగపడుతుంది. పైన చెప్పిన విధంగా, తేనె వివధ రకాల చక్కర అణువులు - ముఖ్యంగా గ్లూకోస్, ఫ్రక్టోస్ వంటివి కలిగి వుంటాయి. అయితే గ్లూకోస్, ఫ్రక్టోస్ కలిసి సుక్రోస్ ఉన్న వైట్ షుగర్ వలే కాకుండా, తేనెలో ఇవి వేరుగా వుంటాయి. ఇందువలన జీర్ణ ప్రక్రియ సులభంగా జరుగుతుంది. ఈ విధంగా తేనెలో విడిగా వున్నా గ్లూకోస్ శరీరానికి తక్షణం శక్తినిచ్చే కారకంగా ఉపయోగపడుతుంది.

‘యునైటెడ్ స్టేట్స్ నేషనల్ హనీ బోర్డు’ వారు తేనె వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే తేనె అనేక విటమిన్లను, మినరల్స్ ను చిన్న మోతాదులో కలిగి వుంటుంది. దీంతో పాటు – నియాసిన్, రిబోఫ్లావిన్, పాంతోతేనిక్ యాసిడ్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటివి తేనెలో కలిగి వుంటాయి.

6. జీర్ణ ప్రక్రియకు తేనె మంచి ఉపయోగాకారిణి

మలబద్దకం, ఉబ్బరం, గ్యాస్ వంటి వాటిని నియంత్రించడంలో తేనె తేలికపాటి బేధి మందుగా ఉపయోగపడుతుంది. bifido bacteria, lactobacilli వంటి సహాయ బాక్టీరియా వలే తేనె జీర్ణ వ్యవస్థకు సహాయకారిగా, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆరోగ్య సంరక్షనిగా, ఎలర్జీని తగ్గించే మందుగా ఎంతో ఉన్నతంగా ఉపయోగపడుతోంది. టేబుల్ షుగర్ కు బదులుగా తేనెను వాడటం వల్ల శరీరంలో fungi ఉత్పత్తి చేసే మైకోటాక్సిన్ గటుల్లోని విషపూరిత ప్రభావాన్ని నియంత్రిస్తుందని గుర్తించారు.

7. చర్మ, తలపై మాడుకు సోకే రోగాలకు తేనెతో నియంత్రణ

తేనెతో గల అనేక ఆరోగ్య ప్రయోజనాలలో చర్మ, మాడు సంరక్షణ ప్రధానమైనవి. 30 మంది రోగులతో చేసిన చిన్నపాటి అధ్యయనంలో అధిక చెమట వల్ల వచ్చే చర్మ రోగాలను (seborrheic dermatitis), చుండ్రును తేనెతో నియంత్రించవచ్చని తేలింది. అధ్యయనంలో పాల్గొన్న వారు రోజు మార్చి రోజు ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతంలో పలచబరచిన ముడి తేనెను 2-3 సార్లు మృదువుగా రుద్ది, అది ఇంకేంత వరకు సుమారు మూడు గంటల సేపు ఆరబెట్టి తరువాత వేడి నీళ్ళతో స్నానం చేశారు. ఈ చికిత్స వల్ల అందరి రోగులలో మంచి మెరుగుదల కనబడింది. అంతేకాక వారం రోజుల్లో వారిలో చుండ్రు పోయి, దురద నుంచి ఉపశమనం పొందారు. రోగులలో వెంట్రుకలు రాలిపోయే పరిస్థితి నుంచి మెరుగుదల కనబడింది. వారానికి ఒక సారి చొప్పున ఆరు నెలల పాటు ఈ చికిత్సను ఎవరైతే కొనసాగించారో ఆ రోగులలో మళ్ళీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనబడలేదు.

8. పిల్లలు ఉపశమనం పొంది బాగా నిద్ర పోవటానికి తేనె ఉపయోగపడుట

తేనె వాడకం వల్ల పిల్లలు బాగా నిద్రపోతారని అనేక అధ్యయనాల నుంచి తీసుకున్న ప్రాథమిక ఫలితాలు సూచిస్తున్నాయి. తల్లిదండ్రుల అభిప్రాయాల ప్రకారం, తేనె వాడకం వల్ల పిల్లలు దగ్గు, కఫం / గళ్ళ నుంచి బాగా ఉపశమనం పొంది రాత్రి పూట బాగా నిద్ర పోతున్నారని అధ్యనాలు తేల్చాయి.

ముఖ్య విషయాలు

నల్లగా ఉన్న తేనెలో అనామ్లజనకాలు (antioxidants) ఎక్కువగా ఉంటాయి. తేనెను సరైన క్రమంలో మూసిపెట్టి భద్రపరిస్తే ఎంత కాలమైనా చెడకుండా ఉంటుంది. పురాతన ఈజిప్ట్ నగరాలైన తేబెస్, తుతాన్ఖమన్ లోని ఫారోస్ సమాధుల వద్ద ఆర్కియాలజిస్టులు భద్రపరచిన తేనె డబ్బాలను కనుగొన్నారు. అయితే ఆ తేనెను ఆర్కియాలజిస్టులు ఏమి చేశారనే సమాచారం లేదు.

12 నెలలలోపు పిల్లలకు తేనేను ఇవ్వరాదు, ఎందుకంటే బోటులిసం (botulism) అనే బాక్టీరియా బీజ కణాలు తేనెలో వుంటాయి. దీనివల్ల పసిపిల్లలకు విషాహారం చేరుతుంది. ఈ బాక్టీరియా బీజ కణాలు చెత్త, మట్టిలో వుంటూ తేనెలో దానంతట అవి చేరుతాయి. పసిపిల్లల శరీర వ్యవస్థ ఈ బాక్టీరియా బీజ కణాలను ఎదుర్కొనేలా వుండదు.

మరో ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే డయాబెటిక్ రోగులకు వైట్ షుగర్ వలే తేనె ప్రమాదకరం. ఈ రెండు పదార్థాలు రక్తంలో షుగర్ స్థాయిని పెంచుతాయి కాబట్టి రోగులు జాగ్రత్త తీసుకోవాలి.
సిద్ధ, ఆయుర్వేడంలో తేనెను ఉపయోగించుట

తేనె ప్రయోజనాలు భారతీయులకు తెలిసినంతగా బహుశా మరెవరికీ తెలీదు. తేనెను ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప పదార్థంగా భావించడమే కాక ప్రతి వంట గదిలో తేనె నిల్వ వుంటుంది. తేనెను ఒక ముఖ్య ఆహార పదార్థంగా 12 నెలల పిల్లవాడు మొదలుకొని తీసుకుంటారు. తేనెను సులభంగా జీర్ణమయ్యే పదార్థంగా పరిగణిస్తారు. తేనె వల్ల కలిగే ప్రయోజనాలలో ముఖ్యమైంది - దానిని సిద్ధ, ఆయుర్వేదంలో ఔషధ మూలికలతో కలిపి ఉపయోగిస్తారు. మందులు తేనెతో కలిసి తీసుకున్నపుడు శరీరంలో త్వరగా వెళ్లి రక్త ప్రసరణ ద్వారా శరీరం అంతటా మందు వ్యాపిస్తుంది. మందు యొక్క సామర్థ్యాన్ని తేనె ప్రభావితంగా వుంచడమే కాక దాని ప్రభావం శరీరంలో ఎక్కువ కాలం వుండేలా చేస్తుంది.

సిద్ద వైద్యంలో తేనెను ఉష్ణ సంబంధిత రోగాలు అనగా – ఎక్కువ శ్లేష్మం / గళ్ళ, వాంతి, గ్యాస్ సమస్య, శరీరంలోని మలినాలను తొలగించేందుకు చికిత్సగా ఉపయోగిస్తారు. సిద్ద వైద్యంలో ఏడు రకాల తేనెను గుర్తించారు, వాటిలో అటవీ పర్వత ప్రాంతాల నుంచి సేకరించిన ‘మలైతేన్’ అనే పేరు గల తేనె ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠమైంది. తేనెటీగలు అనేక ఔషధ మొక్కల నుంచి పదార్థాలు సేకరించి తేనెను నిల్వ చేయడం వల్ల ఈ రకమైన తేనెలో అత్యధిక ఔషధ విలువలు వుంటాయి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


No comments