Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

శ్రీ దత్తోపంత్ ఠేంగ్డీ జీవిత చరిత్ర - About dattopant thengadi in Telugu - rss dattopant thengadi

శ్రీ   దత్తోపంత్   ఠేంగ్డీ  1920  సంవత్సరం   నవంబర్  10  దీపావళి   రోజున   భావూరావ్   ఠేంగ్డీ ,  జానకీ   దేవి   దంపతులకు   మహారాష్ట్ర  ...


శ్రీ దత్తోపంత్ ఠేంగ్డీ 1920 సంవత్సరం నవంబర్ 10 దీపావళి రోజున భావూరావ్ ఠేంగ్డీజానకీ దేవి దంపతులకు మహారాష్ట్ర ప్రాంత వార్ధా జిల్లాలోని ఆర్వి గ్రామంలో జన్మించారుతల్లి జానకీ దేవి దత్తాత్రేయుని పూజించింది దేవుడి వర  ప్రసాదంగా దత్తుడి పేరు కొడుకుకి పెట్టిందితండ్రి న్యాయవాదిగా స్థిరపడ్డారు.
బాల్యం నుంచే దత్తోపంత్ దేశభక్తితో స్వాతంత్ర్య ఉధ్యమంలో భాగంగా జరిగే సత్యగ్రహాల్లో పాల్గొనేవారు భారత్ మాతాకీ జయ్వందేమాతరం నినాదాలు ఇచ్చేవాడుతల్లికి శాంత స్వభావం ధార్మికత ఎక్కువ దత్తుకి జ్ఞానేశ్వరిదాసబోధదత్త చరిత్ర వినిపించేదికుమారుడికి మంచి సంస్కారలు అందాలని తల్లితండ్రులు ఆర్ ఎస్ ఎస్ శాఖకు పంపేవారుతండ్రి కూడా సంఘ స్వయంసేవక్చిన్నతనం నుందే కొత్తవారిని పరిచయం చేసుకోవడం వారిని మిత్రునిగా  చేసుకోవడం చేసేవాడు.
1934 డిసెంబరు వార్ధా జిల్లాలో హేమంత శిబిరంలో దత్తు మొదటిసారి పరమ పూజ్య డాక్టర్జీని చూసి ఉపన్యాసం విన్నాడు15 సంవత్సరంల వయసులో కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన వానరసేనకి ఆర్వీ తాలూకా ప్రముఖ్ అయ్యాడుఆర్వీ గ్రామంలో తిలక్ గ్రంధాలయంలో పుస్తకాలన్నీ దత్తోపంత్ చదివేశాడుమరాఠీహిందీఆంగ్లంసంస్కృత  భాషలలో పట్టు సాధించాడు.
తల్లి జానకీ దేవికి గురూజీ అంటే పూజ్య భావన ఉండేదినాగపూర్ లో గురూజీ ఇంట్లోనే ఉండి దత్తు బి.ఎల్.ఎల్.బి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. 1936-38వరకూ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోషియేషన్ అనే విప్లవ సంస్థ లో క్రియాశీలంగా ఉన్నారు. ఇదే సమయంలో సంఘ జ్వేష్ట ప్రచారక్ మోరోపంత్ పింగళేతో  స్నేహం ఏర్పడిందిడాక్టర్జీనీ అనేకసార్లు కలిశారుగురూజీ నుండి సంస్కారాలు పొందారుగుర్రూజీ ప్రేరణతో 1942 లో సంఘ ప్రచారక్ గా వచ్చారు.
కేరళబెంగాల్ లో ప్రచారక్ గా పనిచేశారుకేరళ లో  న్యాయవాది ఇంటి కారుషెడ్ లో ఉండి సంఘ శాఖలు విస్తరించారు. 1947-48 లో అస్సాం సహిత ప్రాంతానికి ప్రచారక్ గా పనిచేశారుమళయాళీబెంగాలీ భాషలలో పట్టు  సాధించారు.
1948లో గాంధీజీ హత్యని సంఘంపై మోపి సంఘాన్ని నిషేదించారుదత్తోపంత్ అజ్ఞాతవాసంలో ఉంటూ బెంగాల్ లో సత్యాగ్రహ ఉధ్యమాన్ని నిర్వహించారుసంఘ నిషేదం ఎత్తివేసిన తరువాత శ్రీ గురూజి సామాజిక క్షేత్రాల్లో సంఘ ప్రభావం ఉండాలని భావించారు 1949 జులై  9  ఎబివిపి ప్రారంభమయ్యింది.
దత్తోపంత్ జీ ఎబివిపి స్థాపక సదస్సులయ్యారు విద్యార్థులలో యోగ్యమైన కార్యకర్తల నిర్మాణం జరిగింది1949 లోనే  కార్మిక క్షేత్రం  ఎన్ టి యు సి లో చేరి కార్మిక రంగాన్ని అధ్యయనం చేశారు అనుభవంతో మనదేశంలోని జాతీయ సాంస్కృతిక  సమాజ జీవన రచనకు అనుకూలమైన కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ ను స్థాపించారు. 1955 జులై 25  ఇది ప్రారంభమయ్యింది.
35 మందితో ప్రరంభమై నేదు 2 కోట్ల మంది సభ్యలతో అతిపెద్ద కార్మిక సంస్థగా బి.ఎం.ఎస్అవతరించింది. 1965  లోబెంగాల్ సమావేశాల్లో కమ్యునిష్ట్ లను ఆయన బెదిరించారు నిర్భయతపోరాటపటిమతో బి.ఎం.ఎస్.ను  పెంచారు.
1964 నుండి 1976 వరకు 2 సార్లు ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఉండి రాజకీయ క్షేత్రాన్ని అధ్యయనం  చేశారు. సిద్ధాంత చర్చలు చేస్తూ అనేకమందితో వ్యక్తిగత స్నేహం చేసేవారు. 1975 అత్యవసర పరిస్థితిని ఆయన  ముందుగానే ఊహించి దేశ ప్రజలను హెచ్చరించారు1979 మార్చి 4 రాజస్థాన్ లోని కోటాలో రైతుల సమ్మేళనం  ఏర్పరిచి భారతీయ కిసాన్ సంఘ్ ప్రారంభించారు.
అంబేద్కర్ తో ఆయనకు దగ్గర సంబంధం ఉండేదిసాంఘీక అసమానతలనుఅంటరానితనం మొదలైన విషయాలను ఆయనతో చర్చించేవారుఅంబేద్కర్ జన్మశతాబ్ది తిధి 1983 ఏప్రిల్ 14 సామాజిక సమరసతా మంచ్ ప్రారంభించారు. 1993లో సర్వ పంథ్ సమాదర్ మంచ్ ప్రారంభించారు.
1990 దశకంలొ పశ్చిమదేశాలు అభివృద్ధి చెందుతున్నా భారత్ వంటి దేశాలను ఆర్ధిక సంక్షోభంలో నెట్టేందుకు ప్రయత్నించాయి ప్రమాదం నుండి దేశాన్ని రక్షించేందుకు 1991 నవంబరు 22న దత్తోపంత్ జీ  స్వదేశీ జాగరణ్  మంచ్ ప్రారంభించారుఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిదార్శనికుడు.1980లో కమ్యునిజం పది సంవత్సారాలలో అంతమవుతుంది అని  చెప్పారు  అదే జరిగింది.
1989 లో డాక్టర్జీ శత జయంతి ఉత్సవాలలో మాట్లాడుతూ 21 శతాబ్దపు సూర్యోదయం తరువాత విశ్వవ్యాప్తంగా హిందూధర్మ పునరుద్ధానం జరుగుతుందన్నారుఅమెరికారష్యాచైనా దేశాలు పర్యటించి కార్మిక  ఉధ్యమాలను  అధ్యయనం చేశారు. 200 పైగా గ్రంధాలు వ్రాశారుపద్మ భూషన్ పురస్కారాన్ని తిరస్కరించారు. 2004 అక్టోబర్ 14  అనారోగ్యంతో పూణేలో స్వర్గస్తులయ్యారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments