Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

నేత్ర దానం ఎందుకు చేయాలి? ఎవరు చేయొచ్చు? - Eye Donation Importance - MegaMindsIndia

నేత్ర దానం గురించి: శరీరంలో అన్ని అవయవాలూ ఆక్సిజన్ (ప్రాణవాయువు)ను రక్తం ద్వారా స్వీకరిస్తాయి. కానీ, కంటిలో కార్నియా ఒక్కటే నేరుగా గాలి ...

నేత్ర దానం గురించి:
శరీరంలో అన్ని అవయవాలూ ఆక్సిజన్ (ప్రాణవాయువు)ను రక్తం ద్వారా స్వీకరిస్తాయి. కానీ, కంటిలో కార్నియా ఒక్కటే నేరుగా గాలి నుంచే ఆక్సిజన్‌ను తీసుకుంటుంది. అందుకే మరణించాక అన్ని అవయవాలూ చలనం కోల్పోయినా, కళ్లు మాత్రం 6గంటల వరకు గాలిలో ఆక్సీజన్ తీసుకుంటూ బతికేఉంటాయి. ఈ సమయంలోనే నేత్రాలను దానం చేస్తే మరొకరికే కాదు.. ఇద్దరికి చూపునిస్తాయి.. అందుకే నేత్రదానంపై అవగాహన కలించుకుందాం.. ఇతరులకు చూపునిద్దాం..

  • ఏడాది వయసు నుంచి వందేళ్ల పైబడినవారు కూడా నేత్రదానం చేయొచ్చు.
  • నేత్రదానం అంటే కళ్లను మొత్తంగా సేకరించరు. కేవలం కంటిపైన పొరను మాత్రమే తీసుకుంటారు. నేత్రదానం తర్వాత కూడా కళ్లు ఎప్పటిలాగే ఉన్నట్లు ఇతరులకు కనిపిస్తాయి.
  • నేత్రదానం చేసేందుకు ప్రత్యేక అర్హతలంటూ ఏమీ ఉండవు. ఏడాది వయసు నుంచి వందేళ్లు దాటినవారు కూడా చేయొచ్చు. ఇదివరకే ఆపరేషన్ అయిన వారు, శుక్లాలు ఉన్న వారు కూడా నేత్రదానం చేయవచ్చు.
  • సంబధిత వ్యక్తి మరణించిన తర్వాత దగ్గరలోని నేత్రనిధికి ఫోన్ చేస్తే చాలు. వాళ్లు వచ్చి నేత్రాలను సేకరించి, ఇద్దరు అంధులకు అమర్చి చూపునిస్తారు.
  • మరణించిన 4గంటల నుంచి 6 గంటల్లోపు మాత్రమే నేత్రాలను సేకరించాలి. అందుకోసం బంధువులు వెంటనే దగ్గర్లోని ఐబ్యాంక్‌కు సమచారం అందించాలి
  • ఎయిడ్స్, పచ్చకామెర్లు, రేబిస్ (కుక్కకాటు) తో చనిపోయినప్పుడు తప్ప కారణాలు ఏవైనా, ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయినా నేత్రదానం చేయవచ్చు.
  • ప్రమాదంలో చనిపోయిన సందర్భాల్లో పోలీసు సమక్షంలో మాత్రమే నేత్రాలను దానం చేయాలి.
  • మరణించిన తర్వాత శరీరాన్ని ఎక్కడికీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గర్లోని నేత్రనిధికి ఫోన్ చేస్తే వాళ్లు వచ్చి నేత్రాలను సేకరిస్తారు.
  • నేత్రదాత మరణిస్తే శరీరం నుంచి 5ఎంఎల్ రక్తాన్ని సేకరిస్తారు. ఈ రక్తాన్ని పరిక్షించి ఏవైనా జబ్బులు ఉన్నదీ లేనిదీ నిర్ధారించిన తర్వాతే కళ్లను వేరొకరికి అమరుస్తారు.
  • నేత్రాలను సేకరించే ముందు నేత్రదాత ఇం టివద్ద కుటుంబసభ్యుల నుంచి (ఇష్టపూర్వకమైతేనే) సంతకం తీసుకుంటారు.

నేత్రదానం చేయాలనుకుంటే..
నేత్రదానం చేయాలనుకుంటే దగ్గరల్లో ఉన్న నేత్రనిధికి వెళ్లి పేరు నమోదు చేసుకుంటే గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ కార్డు ఎప్పుడూ దగ్గర ఉంచు కుంటే మంచిది. ఎందుకంటే దూర ప్రాంతాల్లో (ఉదాహరణకు మీరు హైదరాబాద్‌లో ఉంటూ మీ ఇల్లు కరీంనగర్‌లో ఉంటే) ఉన్నప్పుడు కుటుంబీకులు వచ్చి సంతకం (6గంటల్లోనే నేత్రాలను స్వీకరించాలి) చేయడం కుదరదు. కాబట్టి ఈ కార్డు ఉంటే స్థానికంగానే కుటుంబసభ్యుల అనుమతి లేకున్నా సమయం మించిపోకుండా నేత్రాలను స్వీకరిస్తారు.
కార్నియా
కంటి మీద ఉండే పొరని కార్నియా అంటారు. కంటిలోనికి కాంతి కిరణాలు వెళ్లాలంటే ఈ పొరే ప్రధానం. శరీరంలో ఏ అవయవం చెడిపోయినా ఆపరేషన్ చేసి బాగు చేయవచ్చు కానీ కేవలం కాలేయం, కార్నియా చెడిపోతే ఏమీ చేయలేం. వేరొకరు దానం చేస్తేనే తిరిగి అమర్చే వీలుంటుంది. కంటిలో సహజ అద్దం చెడిపోతే ఆపరేషన్ చేసి కృత్రిమ అద్దాన్ని అమరుస్తారు. కానీ, ఈ కార్నియా చెడిపోతే కచ్చితంగా మరొకరి కార్నియా సేకరించే అమర్చాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి ఇతరులకు చూపునివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ..మీరు కూడా నేత్రదానo, ఉచిత కంటి ఆపరేషన్స్ కొరకు సంప్రదించవచ్చు -నందనం కరుణాకర్.. రాష్ట్ర కార్యదర్శి..సక్షమ్ తెలంగాణ..9908817904

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments