Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

రక్త దానం ప్రాముఖ్యత - Importance of Blood Donation in Telugu - MegaMinds

రక్తదానం అనేది దాదాపుగా ప్రాణదానం లాంటిది. రోగ నివారణకోసం ఒకరి రక్తం మరొకరికి ఇచ్చేపద్ధతిని రక్తదానం అంటారు. అమ్మకం అనకుండా దానం అని ఎం...


రక్తదానం అనేది దాదాపుగా ప్రాణదానం లాంటిది. రోగ నివారణకోసం ఒకరి రక్తం మరొకరికి ఇచ్చేపద్ధతిని రక్తదానం అంటారు. అమ్మకం అనకుండా దానం అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్నఅవయవాలని(ఉ. కంటిపొర, చర్మం, గుండె, మూత్రపిండం, రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడదలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపారదృష్టితో అమ్మకూడదు. కనుక ప్రపంచంలో చాలా మంది రక్తాన్ని దానంచేస్తారు.
ప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉంటుంది. మీ రక్తం ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందికి సహాయపడుతుంది. ప్రమాదానికి గురైనవారికి, అకాల పక్వమైన పిల్లలకి, పెద్ద శస్తచ్రికిత్స రక్తం కావలసిన రోగులకు, మీ రక్తాన్ని పరీక్ష చేసిన తరువాత నేరుగా ఉపయోగిస్తారు. గాయాలకు గురైన రోగులకి, రక్తహీనతతో బాధపడే రోగులకి, ఇతర శస్తచ్రికిత్స ఎర్రరక్తకణాలు మాత్రమే కావలసి వస్తాయి. ఈ ఎర్రరక్తకణాలు మీ రక్తం నుండి వేరు చేయబడతాయి. ఎప్పుడయినాసరే ఒక లీటర్‌ రక్తంలో 100 గ్రాముల కంటే ఎక్కువ రక్త చందురం ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పనిలేదు. ఎవరి రక్తంలో అయినాసరే లీటర్‌ ఒక్కంటికి 60 గ్రాములకంటే తక్కువ రక్త చందురం ఉంటే అది రక్తం ఎక్కించవలసినపరిస్థితి. అంతేకాని ఆపరేషన్‌ చేసినప్పుడల్లా రక్తం ఎక్కించవలసిన పనిలేదు.
ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషన్‌ చేసి ప్రాణం కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషన్‌లో కూడా కొంత రక్తస్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం పది, పన్నెండు యూనిట్లు (ఒకయూనిట్‌=ఆర్ధలీటర్‌) దాకా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే సుమారుగా 12 యూనిట్లు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి శరీరంలో ఉన్న పాతరక్తం అంతాపోయి కొత్త రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి రావచ్చు.
అన్ని జీవులు, రక్తం అనే ద్రవం మీద ఆధారపడి జీవిస్తాయి. రక్తం 60% ద్రవభాగం, 40% ఘనభాగంతో చేయబడింది. 90%నీరు, 10%పోషకాలు, హార్మోన్లు మొదలగు వాటితో తయారుచేయబడే, ద్రవభాగమైన ఈ ప్లాస్మా, ఆహారం, మందులు మొదలగువాటితో సులభంగా తిరిగి నింపబడుతుంది. కాని, ఆర్‌.బి.సి.(ఎర్రరక్తకణాలు), డబ్ల్యు.బి.సి.(తెల్లరక్తకణాలు), ప్లేట్‌లెట్స్‌ కలిగి ఉండే ఘనభాగం పోతే, యధాతథంగా రావడానికి సమయం తీసుకుంటుంది. మీరు ఇక్కడే అవసరపడతారు. దానిని తిరిగి యధాతథంగా రోగుల యొక్క శరీరం నింపడానికి తీసుకునేసమయం, అతని/ఆమె ప్రాణాన్ని తీయవచ్చు. కొన్ని సమయాలలో, శరీరం తిరిగి నింపడానికి వీలైన స్థితిని ఏ మాత్రం కలిగి ఉండకపోవచ్చు. రక్తాన్ని దానం మాత్రమే చేయవచ్చునని దాన్ని ఉత్పత్తి చేయలేమని మీకు తెలుసు. అంటే, రక్తం అవసరమయ్యే జీవితాలని మీరు మాత్రమే రక్షించవచ్చు.
ఆరోగ్యంగా ఉన్న18 నుంచి 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు రక్తదానం చేయ్యొచ్చు. జీవితకాలంలో ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తదానం చెయ్యొచ్చు. మత్తు మందులకు అలవాటు పడినవారు, హెపటైటీస్‌ బి, సి, హెచ్‌ఐవీ, రక్తపోటు అధికంగా ఉన్న వారు రక్తదానానికి అనర్హులు. ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలైతే ఆరుమాసాలు, పురుషులైతే మూడుమాసాలు తర్వాతనే రక్తాన్ని రెండవసారి ఇవ్వడానికి వీలుంటుంది. రక్తం ఇచ్చేవారు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి. ఎటువంటి రుగ్మతలు ఉన్నా రక్తాన్ని స్వీకరించరు. సగటు 45 కేజీల బరువున్న వారు రక్తదానం చేయవచ్చు. 12.5 గ్రాముల హీమోగ్లోబిన్‌ ఉన్నవారు.
మీరిచ్చే ఒక్క పూర్తి యూనిట్‌ రక్తం (300-450) మిల్లీలీటర్‌ రక్తాన్ని మూడు బాగాలుగా ఉపయోగించి ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. ఉదాహరణకు మీ రక్తంలోని ఎర్రరక్తకణాలను ఒక రక్తహీనతతోనున్న వ్యక్తికి లేదా ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి, ప్లాస్మా అనే ద్రవాన్ని హీమోఫిలియా అనే బ్లీడింగ్‌ డిజార్డర్‌ వ్యాధితోనున్న వ్యక్తికి, ప్లేట్‌లెట్స్‌ను డెంగ్యు వంటి ప్రాణాంతక జ్వరంతోనున్న వ్యక్తికి లేదా థ్రోంబోసైటీమియా వంటి వ్యాధితో నున్న వ్యక్తికి ఇవ్వడం ద్వారా మీరు చేసే ఒక్క యూనిట్‌ రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడినట్లవుతుంది.
ఈ రోజుల్లో రక్తదానం చేస్తామని ముందుకొచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. జనాభాలో నూరింట అయిదుగురు మాత్రమే రక్తదానం చేస్తామని ముందుకి వస్తున్నారు. ఇలా సరఫరా ఒకపక్క తగ్గిపోతూ ఉంటే మరొక పక్కనుండి వృద్ధుల జనాభా పెరుగుతోంది. రక్తదానం పుచ్చుకునే వారిలో ఎక్కవభాగం వయసు మళ్ళిన వారే. కనుక రక్తానికి ఎద్దడి రోజులు వస్తున్నాయి.
రక్తందానం చేయడానికి ముందు, దాత యొక్క చరిత్ర తెలుసుకుంటారు. అంతేకాదు, ఆ వ్యక్తి రక్తందానం చేయడానికి అర్హుడా కాడా అన్నివిషయ నిర్ధారణ కోసం డాక్టర్లు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి మీరు రక్తదానం చేయడానికి ముందు డాక్టర్‌ సలహా ప్రకారం చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. దాంతో మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు.
మీరు రక్తదానం చేసినప్పుడు, తిరిగి మీ శరీరంలో ఏర్పడిన రక్త నష్టాన్ని భర్తీ చేయడం కోసం 4-8 రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో ఎర్రరక్తకణాల్లో ఉన్న రక్తం శరీరం మొత్తం పునరుద్దరణ సరిచేస్తుంది. మరి కొన్ని ప్రయోజనాలేంటంటే పురుషులు ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం చేయొచ్చు. మహిళలు ప్రతి నాలుగు నెలలకొకసారి డొనేట్‌ చేయవచ్చు. అయితే మీరు రక్తదానం చేసేటప్పుడు మీ డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.
రక్తాన్ని దానం చేసే కనీసం 3 గంటల ముందు మంచి భోజనాన్నితీసుకోండి. దానం చేసిన తరువాత మీకిచ్చిన ఉపాహారములను తీసుకోండి, మీరు వాటిని తీసుకోవడం ముఖ్యం. తరువాత మంచి భోజనాన్ని తీసుకోవడం మంచిది దానం చేసే రోజు ముందు పొగత్రాగడం మానండి. దానం చేసే 48 గంటల ముందు మీరు ఆల్కహాలు సేవించి ఉంటే, మీరు దానం చేయడానికి అర్హులు కారు.
ఏటా మన దేశంలో 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే, అందుబాటులో ఉన్నది కేవలం 40 లక్షల యూనిట్లు మాత్రమే. మానవ రక్తానికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. రక్తదానం చేయడమంటే ఓ ప్రాణాన్ని కాపాడడమే.
ప్రతీ రెండు సెకన్లకు దేశంలో ఎక్కడోచోట ఒకరికి రక్తం అవసరమవుతుంది. ప్రతి రోజూ కనీసం 38,000 మంది రక్తదాతల అవసరంఉంది. అత్యధికంగా కోరుకునే రక్తం "ఒ" గ్రూప్‌ దేశంలో ఏటా కొత్తగా 10 లక్షల మంది క్యాన్సర్‌ బాధితులుగా తేలుతున్నారు. కీమోథెరపీ చికిత్స సందర్భంగా తరచూ వారికి రక్తం అవసరం ఉంటుంది.
రక్తదానం ఎంతో సురక్షిత ప్రక్రియ. ప్రతీ సారి కూడా స్టెరైల్‌నీడిల్‌ ను ఉపయోగిస్తారు. ఒకసారి ఉపయోగించినదాన్ని మళ్ళీ ఉపయోగించరు. రిజిస్ట్రేషన్‌, మెడికల్‌హిస్టరీ, డొనేషన్‌, రిఫ్రెష్‌మెంట్‌ అనే నాలుగు తేలికపాటి దశల్లో రక్తదానం పూర్తవుతుంది. రక్తదానం చేసే వారికి ముందుగా టెంపరేచర్‌, బీపీ, పల్స్‌, హిమోగ్లోబిన్‌ తదితర పరీక్షలు చేస్తారు. ఇవన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తేలిగ్గా పూర్తయ్యేవే. రక్తదాన ప్రక్రియ పావుగంటలో పూర్తవుతుంది. మన శరీరంలో 10 యూనిట్ల రక్తం ఉంటే, సుమారుగా 1 యూనిట్‌ రక్తాన్ని దానం చేయవచ్చు. దాని వల్ల దాత శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యవంతుడైన దాత ప్రతీ 56 రోజులకు ఒకసారి ఎర్ర రక్తకణాలను డొనేట్‌ చేయవచ్చు. ఆరోగ్యవంతుడైన దాత కనీసం 7 రోజుల విరామంతో సంవత్సరానికి 24 సార్లు ప్లేట్‌లెట్స్‌ దానం చేయవచ్చు. డొనేట్‌ చేసిన ప్లేట్‌లెట్స్‌ను సేకరించిన ఐదు రోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుంది.
ప్రపంచ రక్తదాన దినోత్సవం:
మన ప్రాణాలకు రక్తం అవసరం ఎంతఅవసరమో అందరికీ తెలిసిందే. ఇలాంటి రక్తం కొందరిలో తక్కువగా ఉంటుంది. కొందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాంటి సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. అందుకే రక్తదానం చేయండి-ప్రాణాలను నిలబెట్టండి అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చింది. రక్తందానం చేసే ప్రాణదాతలకు గుర్తింపుగా ఏటా జూన్‌ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రక్తదానం చేసేందుకు ప్రజల్ని చైతన్యపరచడంతోపాటు రక్తదానం చేసే విషయంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. రక్తదాతల సంస్థ అంతర్జాతీయ సమాఖ్య 1995లో ప్రతిఏటా అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2000వ సంవత్సరంలో రక్తం జీవితాన్ని కాపాడుతుంది. మంచిరక్తం నాతోనే ప్రారంభిస్తాను అనే నినాదాలతో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహించింది. అనంతరం 2005 జూన్‌ 14న ప్రతి ఏటా ఈకార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు. రక్తంలో ఎ, బి, ఒ అనే గ్రూపులు ఉన్నాయని కనుగొని నోబెల్‌ బహుమతి పొందిన కార్ల్‌ల్యాండ్‌ స్టెయినర్‌ జన్మదినం సందర్భంగా ప్రతిఏటా జూన్‌ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించి అప్పటినుంచి ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మిత్రులరా ఇప్పుడు అర్దమయ్యిందిగా రక్తదానం ఎంత ప్రాధాన్యం సంతరించుకున్నదో కాబట్టి ప్రతి ఒక్కరూ రక్త దాతలుగా మారాల్సిన సమయం ఆసన్నమైంది  మీ MegaMindsIndia

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..