మలబద్ధకము చికిత్స - మలబద్ధకము నివారణ - MegaMinds

1

మలబద్ధకము చికిత్స
ప్రతి రోగికి ఆహార విహారముల యందు నియమమును పాటింపక పోవుటచే మలబద్దకము వచ్చును. మల బద్ధకము ప్రపంచములోని రోగముల కన్నీటికి మూలము. తమ ఆహార విహారముల యందు సంయమనము పాటించిన ఎప్పుడును ఈ వ్యాధి రాదు. సంయమనము లేమిచే ఎప్పుడైనను ఏదైనను వ్యాధి కలిగినచో ప్రాకృతిక చికిత్సచే ఆ వ్యాధికి గట్టి చికిత్స చేయవలెను. ప్రాకృతిక చికిత్సచే కుదరని రోగమేదియు లోకమున లేదు. ప్రాకృతిక చికిత్స ప్రాణి మాతృలకు వరము కనుక మొదట సంయమనము పాటించి మలబద్దకమును తొలగింపుడు.
మొదటి చికిత్స: ఒకటింబావు లీటర్ల మంచి నీరు నిత్యం ఉదయం సూర్యోదయమునకు పూర్వము పాచి ముఖము త్రాగినచో ఎన్నటికీ మలబద్దకము రాదు. అంతేకాదు అన్యవ్యాధుల నుండియు రక్షణ కలుగును.
రెండవ చికిత్స: ఒకటింబావు లీటర్ల నీటితో పాటు రెండు నుండి ఐదు గ్రాముల త్రిఫలా చూర్ణము పుచ్చుకొనుట వలనను లేక 3 నుండి 4 తులముల (40-50 గ్రాముల) నల్ల ద్రాక్ష పండ్లు రాత్రి చల్లని నీటిలో నాన వేసి ఉదయం వానిని నులిమి వడపోసి కొంతకాలము త్రాగుట వలన మలబద్ధకము పోవును.
మూడవ చికిత్స: ఒక కరక్కాయను తినుట వలనను లేక 2 నుండి 3 గ్రాముల కరక్కాయ పొడిని వేడి నీళ్ళతో పుచ్చుకొనుట వలన మలబద్దకం నశించునని శాస్త్రములు వక్కాణించుచున్నవి.
యస్య మాతా గృహే నీతి తస్యమాతా హారీతకీ
కదాచిత్ కుప్యతే మాతా న చోదరస్థా హరీతకీ

తల్లి లేని వారికి తల్లి కరక్కాయ. తల్లి ఎప్పుడైనను కోపగించుకొనవచ్చును. గర్భం లోకి వెళ్ళిన కరక్కాయ ఎన్నటికి కోపగించుకోదు.
నాలుగవ చికిత్స: తిప్పతీగెను దీర్ఘకాలము పుచ్చుకొనినచో మలబద్ధకం రోగికి మేలు చేకూరును.
అయిదవ చికిత్స: మలము గట్టి పడుట వలనను, గుద వికారము వలన బాధ కలిగిన జాత్యాది తైలము లేదా మలహమ్ పట్టి విరేచనమునకు బోయిన పిమ్మట వ్రేలితో గుదముపై వేయవలెను. దీని వలన 7 రోజులలోనే రోగము నయమగును. అంతేకాదు త్వరగా జీర్ణమగు పదార్దాలే భుజింపవలెను. చిన్న కరక్కాయ ముక్కను నమిలి తినవలెను.
ఆరవ చికిత్స: ఒక గ్లాసు సాధారణ నీటిలో ఒక నిమ్మకాయను పిండి రెండు మూడు చెంచా తేనెను వేసి త్రాగుటచే మలబద్ధకము మటు మాయమగును.
ఏడవ చికిత్స: ఒక చెంచా సోంపు పొడి 2,3 చెంచాలు గులకంద నిత్యము మధ్యాహ్న భోజనం తరువాత కొంచెం సేపు ఆగి తీసుకొనుటచే మలబద్దకము తగ్గును.
జాగ్రత్తలు: మలబద్ధకము సర్వరోగములకును మూలము. కనుక కడుపును సర్వధా శుద్ధముగా నుంచు కొనవలెను. రాత్రి ఆలస్యముగా నేమియు భుజింపరాదు. భోజనానంతరము రెండు గంటల తరువాత కాని నిద్ర పోరాడు. మైదాపిండి తయారు పదార్థాలు, పెరుగు అధికముగా తినరాదు. జల్లెడ పట్టని గోధుమ పిండి ఉపయోగించుట వలన, బాగుగా పండిన బొప్పాయిని తిని వలన, భోజనానంతరము మజ్జిగ త్రాగుటవలన మలబద్ధకము నశించును.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Tags

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. ధన్యవాద్ మెగామైండ్ జైశ్రీరామ్

    ReplyDelete
Post a Comment
To Top