డయాబెటిస్ మరియు అన్యరోగములకు అద్భుతమైన జల చికిత్స ఏ ఖర్చూ లేకుండ రోగములనుండి కాపాడుకొని ఆరోగ్యమును పొందవచ్చును. క్రొత్తవియు మరియు పాత వ...
డయాబెటిస్ మరియు అన్యరోగములకు అద్భుతమైన జలచికిత్స
ఏ ఖర్చూ లేకుండ రోగములనుండి కాపాడుకొని ఆరోగ్యమును పొందవచ్చును. క్రొత్తవియు మరియు పాత వియునగు ప్రాణాపాయకరములగు రోగముల తొలగించుటకు ఇది యొక సరళమగు గొప్ప చికిత్స. దీనిని మనము జల చికిత్స యని అంటాము. 'జలచికిత్స' యనునొక లేఖ జాపనీస్ సిక్ నెస్ & అసోసియేషన్ తరపున ప్రకటితమైనది అందు యథాయోగ్యరీతిలో జలచికిత్స చేసినచో దిగువనుదహరించిన పాత నవ్య ప్రాణాపాయ రోగములు తొలగించి వచ్చుమధుమేహం, తల నొప్పి, రక్తపు పోటు, కీళ్లనొప్పులు, పక్ష వాతము, స్టాల్యము, గుండెదడ, శ్లేష్మము, దగ్గు, బ్రాంకైటిస్, టి.బి., మెనింజైటిస్, లివర్ రోగాలు, మూత్ర రోగములు, ఆమ్ల పైత్యము, గ్యాస్వాయిటీస్, (గ్యాసుకు సంబంధించిన బాధలు) కడుపునిస్పీ, మలబద్దకము, నిస్పృహ, నేత్రబాధలు, స్త్రీల క్రమబద్ధంలేని మాసిక స్రావము, ప్రదర (కుసుమ రోగము), గర్భాశయ క్యాన్సర్, ముక్కు, చెవి. గొంతుకు సంబంధించిన రోగములు మొదలైనవి.
నీరు త్రాగు పద్ధతి: వేకువ జామున త్వరగా లేచి ముఖము కడుగకయే, దాదాపు ఒకటి లీటరు (నాలుగు పెద్ద గాసులు) నీరు ఒకేసారి త్రాగవలెను. తదనంతరము 40 నిమిషాల వరకు ఏమియూ తినరాదు, త్రాగరాదు. నీరు త్రాగిన పిమ్మట ముఖము కడుగ వచ్చును. ఈ చికిత్స ప్రారంభించిన తర్వాత ఉదయం అల్పాహారం తర్వాత, మధ్యాహ్నము, రాత్రిపూట భోజనానంతరము రెండు గంటలు గడపిన తర్వాత నీరు తాగవలెను. రాత్రి పూట నిద్ర పోవుటకు పూర్వము ఏమియు తినరాదు.
రోగిష్టివారు, సున్నిత స్వభావులు ఒకే సారి నా గ్లాసులు నీరు త్రాగాజాలనిచో వారు మొదట ఒకటి రెండు గ్లాసుల నుండి ప్రారంభించి తరువాత క్రమక్రమముగా ఒక్కొక్క గ్లాసు పెంచి నాలుగు గ్లాసులవరకు తాగవచ్చును. తరువాత నియమముగా నాలుగు గ్లాసులు త్రాగుచుండవలెను.
రోగులు, ఆరోగ్యవంతులు అను భేదములేక ఎవరైనను ఈ చికిత్సను చేయవచ్చును. రోగులకు ఆరోగ్యము కలుగుటయే దీనివలన ప్రయోజనం. ఆరోగ్యవంతులు రోగగ్రస్తులు కాకుండుటయే దీనివల్ల ప్రయోజనం పాత రోగులును, కీళ్లనొప్పులచే బాధపడువారును ఈ చికిత్సను ఒక వారము వరకు ప్రతిరోజూ రెండు, మూడు సార్లు చేయవలయును. ఒక వారము తర్వాత దినమునకు ఒక్కసారి చేసిన చాలును. ఈ జలచికిత్స సరళమును సులభమును ఇందొక పైసా కూడా ఖర్చు ఉండదు. మన దేశములోని పేదవారు ఖర్చు లేకుండా మందులేకుండ ఆరోగ్యమును పొందుటకు ఇది ఒక విచిత్రమైన పద్దతి.
సోదర సోదరిమణులందరకు ఒక విన్నపము - 'జలచికిత్స' జరుగుటకు సాధ్యమైనంత అధిక ప్రచారము చేసి రోగుల రోగములు తొలిగించే కష్టములందు సహకరింపగలరు.
నాల్గు గ్లాసుల నీరు త్రాగుట వలన ఆరోగ్యం పై ఎట్టి దుష్ప్రభావమును పడదు. అవును, ప్రారంభించిన తరువాత 3,4 రోజులవరకును నీరు త్రాగిన తరువాత రెండు మూడు సార్లు మూత్ర విసర్జన చేయవలసివచ్చును. కాని 3,4 రోజుల తరువాత మూత్రము మామూలుగా వచ్చుచుండును.
కాబట్టి సోదర సోదరీ మణులారా!ఆరోగ్యవంతులగుటకును, ఆరోగ్యమును కాపాడుకొనుటకును నేటి నుండియే ఈ 'జలచికిత్స' ప్రారంభించి రోగములను పారద్రోలుట. నేటి నుండి మనమందరము ఆరోగ్యవంతులమై జీవితము నందు ధయ, మానవత, విశ్వాసములను అలవరుచుకొని పృథ్వీని స్వర్గము చేయుదము.
ప్రాతః కాలమున దంతధావనం చేయుట కు పూర్వం నీరు త్రాగుట వలన ఎన్నో రోగాలు నశించును మనం మన పెద్దల నుండి కథలు రూపమున వినియుంటిమి. కాని ఇపుడు మన దేశమందలి పెద్దలమాటల ప్రచార ప్రసారములు విదేశీయులు ద్వారా చేయబడుచున్నవి. దాని వలన భారతదేశం యొక్క శరీర, విజ్ఞాన, అధ్యాత్మ జ్ఞానం లెంత్ గొప్పవో విదితమగుచున్నది.
No comments