Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

జలచికిత్స గురించి మీకు తెలుసా? - Hydrotherapy Jala Chikitsa - health tips in telugu

జలచికిత్స మన దేశ ఆరోగ్యమునకును, చికిత్సకును ఆయుర్వేద విధానము వలనను ఋషి ప్రోక్తములైన చికిత్సల వలనను కలుగుచున్నంత ప్రయోజనము అధిక ధరలు కలి...

జలచికిత్స
మన దేశ ఆరోగ్యమునకును, చికిత్సకును ఆయుర్వేద విధానము వలనను ఋషి ప్రోక్తములైన చికిత్సల వలనను కలుగుచున్నంత ప్రయోజనము అధిక ధరలు కలిగిన ఇంగ్లీషు మందులు వలన కలుగుటలేదు. నేడు విదేశీయులును ఆయుర్వేద చికిత్సల వైపు ఆకర్షితులగుచున్నారు. మనము కూడా 'సైడ్ఎఫెక్ట్స కలిగించు, విపరీత ధరలు గలిగిన ఇంగ్లీషు మందులజోలికి బోక ప్రాకృతిక ఆయుర్వేద చికిత్సను మన జీవితము ప్రవేశ పెట్టుట ఉచితము మేమిచట మా పాఠకులకు విభిన్న రోగములకు చికిత్సారూపమున నాలుగు విధములైన జలనిర్మాణపద్ధతులను సూచించుచున్నాము. ఇవి అద్భుతమైన చిట్కాలు.
శోంఠి జలము: ఒక నీటి పాత్రలో కొద్దిగా శొంఠి వేసి నీటిని వేడి చేయవలెను పాత్ర లో సగం నీరు మిగులు వరకు సలసల మరగబెట్టి చల్లార్చి రెండు సార్లు వడపోయవలెను. మరిగించిన నీటి యడుగున నున్న క్షారము వడపోసిన నీటిలోనికి రాకుండా జాగ్రత్త పడవలెను. కనుక మొద్దుగుడ్డతో రెండు సార్లు వడపోయవలెను. ఈ నీరు త్రాగుట వలన పాత శైత్యము (చలి), దమ్ము, టీ.బి., శ్వాస రోగములు, రొప్పు, ఎక్కిళ్ళు ఊపిరితిత్తుల లో నీరు నిలుచుట, అజీర్ణము, అగ్ని మాంద్యము క్రిములు, విరేచనములు, జిగట విరేచనాలు, బంక విరేచనములు, బహు
మూత్రము, మధుమేహం, Low B.P, శరీరం చల్లగా నుండుట, తలనొప్పి శ్లేష్యజనితములైన సర్వరోగములందు ఈ జలము తప్పక పనిచేయును. డబ్బు ఖర్చులేనిమందు, ఈ జలము పై రోగములకు ఉత్తమ ఔషధము. ఈ జలమును దినమంతయు త్రాగుట యందుపయోగించవలెను. రోగము తగ్గిన తర్వాత ను కొంతకాలము వరకును ఈ చికిత్సను కొనసాగించ వలెను.
ధనియాల - నీరు: ఒక లీటరు నీళ్లలో ఒకటి నుండి ఒకటిన్నర చెంచా ఎండిన పాత ధనియాలు వేసి నీరు మరిగించవలెను. 750 గ్రాముల నీరు మిగిలియున్నపుడు చల్లార్చి వడపోయవలెను. ఈ సారు అత్యధిక శీతల 135 స్వభావముకలదియై పైత్య దోషము, వేడి వలన గలుగు రోగములందును పైత్య ప్రకృతి గల వారికి ఎంతో లాభం చేకూర్చును. వేడి, పైత్య జ్వరం, కడుపు మంట, పైత్య వాంతి, పులి తేన్పులు, ఆమ్ల పైత్యము కడుపులో పుండ్లు, కంటి మంటలు, ముక్కు నుండి రక్తం కారుట, రక్తస్రావం, వేడి వలన వచ్చే పలుచని పసుపు పచ్చ విరోచనములు, వేడి వలన వచ్చే పొడి దగ్గు, అతి దాహం, రక్తపు మొలలు లేక మంట - వాపు మొల వంటి రోగాలకు ఈ జలం మిక్కిలి లాభదాయకము. అత్యధిక లాభమునకై నీటి యందు పటిక బెల్లం కలిపి తాగవలెను కాఫీ మరియు అన్యమాదకద్రవ్యముల వ్యసనములు శరీరం నాశనం చేసుకునే వారికి జలపానము లాభప్రదము మరియు విషనాశకమును.
వాము - నీరు: ఒక లీటరు నీటి లో తాజా క్రొత్త వాము ఒక చెంచా(దాదాపు 8.5 గ్రా) ప్రమాణములో వేసి మరిగించవలెను. సగం నీరు మిగిలియున్నపుడు చల్లార్చి వడపోసి తాగవలెను. ఈ నీరు వాత శ్లేష్మ దోషాల వలన నుత్పన్నమగు అన్ని రోగాలకు అత్యధిక లాభ ప్రదమగు చికిత్స. దీనిని క్రమబద్దముగా తీసికొని గుండె శూల, కడుపులో వాత బాధ, ఆఫరా, ఎక్కిళ్ళు, అరుచి, మందాగ్ని, కడుపులో క్రిములు, వెన్ను నొప్పి, అజీర్ణ విరేచనాలు, కలరా, చలి, బహు మూత్రం, మధుమేహం వంటి అనేక రోగాలకీ జలము అత్యధిక లాభ పదము. ఈ జలం ఉష్ణ స్వభావము గలది.
జీలకర్ర నీరు: ఒక లీటరు నీళ్ళలో 1 నుండి ఒకటిన్నర చెంచా జీలకర్ర వేసి మరిగించవలెను. 750 గ్రా.లో నీరు మిగిలి యున్నపుడు దింపి చల్లార్చి వడపోయవలెను. ఈ నీరు, ధనియాల నీరు వలె శీతల గుణం గలది.
పాత పైత్య దోషాల వలన వచ్చే రోగాలు ఇది అత్యధిక హితకారి. గర్భవతులకు, ప్రసవించిన స్త్రీ లకు ఇది ఒక వరము. రక్త కుసుమ రోగమున్న స్త్రీలకు, గర్భాశయంలోని వేడి వలన మాటిమాటికి గర్భం పడిపోవుటయో
05 మృత శిశువు ప్రసవించుటయో లేక పుట్టగానే శిశువు మృతి చెందిన స్త్రీలకు గర్భ కాలము 2వ నెల నుండి 8వ నెల వరకు నియమిత కళి నీరు త్రాగించవలెను. రోజు విడిచి రోజు వచ్చు చలితోగూడిన మలేరియా
జ్వరములకును, కన్నులలో వేడి వలన ఎఱపెక్కుట, చేతులు, కాళ్లు మండుట, వాత లేక పైత్యవాంతి, వేడి లేక వాత విరేచనములు, రక్త వికారము, శ్వేతకుసుమ, క్రమబద్దంలేని మాసిక స్రావము, గర్భాశయము వాయుట, క్రిములు, అల్పమూత్రము ఇత్యాది రోగములకు ఈ జలము నియమితముగా పుచుని వలన ఆశించిన దాని కంటెను ఎక్కువ లాభము కలుగును. ఈ నీటిచే విభిన్న రోగములకు అద్భుతమైన లాభము చేకూరును.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..