Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కాశ్మీర్ కిస్కా హై ..హమారా హై.

కాశ్మీర్ కిస్కా హై ..హమారా హై. 1947లో రాజా హరిసింగ్ భారత యూనియన్లో (భారతదేశంలో) విలీనం చేస్తూ నోట్ రాసి పరమపూజ్య శ్రీ గురూజీ తో పంపినట...

కాశ్మీర్ కిస్కా హై ..హమారా హై.
1947లో రాజా హరిసింగ్ భారత యూనియన్లో (భారతదేశంలో) విలీనం చేస్తూ నోట్ రాసి పరమపూజ్య శ్రీ గురూజీ తో పంపినటువంటి విలీన పత్రం..,
దానికి విలువ లేకుండా... చిత్తు కాగితంగా మార్చి , ఎక్కడో లండన్ లో ఉన్న షేక్ అబ్దుల్లాను పిలిచి 370 మరియు 371 ఆర్టికల్ తయారుచేసి  కాశ్మీర్ లో అధికారాన్ని కట్టబెట్టి , అక్కడి హిందువులను నానా హింసలు పెట్టి , ఊచకోతలు కోసి,  ముస్లిములుగా మార్చి,  హత్యలు చేసి,  హిందువులను తరిమికొట్టి ఆనందాన్ని పొందే రాక్షసులకు నిలయంగా మార్చారు  సుందరకాశ్మీరాన్ని ...,
దేశభక్తులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆనాటి నెహ్రూ ప్రధానిగా ఉన్న కేంద్ర ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండేవారు... వారు ఈ దుర్మార్గపు స్థితి చూసి తన పదవిని వదిలి పెట్టి రాజీనామా చేసి...,
"ఏక్ దేశమే దో విధాన్ ,
ఏక్ దేశమే దో నిషాన్,
ఏక్ దేశమే దోప్రధాన్,.,
నహీచలేగీ..,నహీచలేగీ...,
అంటూ కాశ్మీర్ మా దేశంలో భాగమేనంటూ ..,
అక్కడికి వెళ్ళిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారిని అరెస్ట్ చేసి, జైల్లో పెట్టి ,విషమిచ్చి హత్య చేశారు.., ఆనాటి కాశ్మీరు మరియు  కేంద్ర ప్రభుత్వాలు ...,ప్రజలకు  జవాబు చెప్పవలసిందిపోయి ఎవరు కూడా కాశ్మీర్ కి వెళ్లవద్దంటూ ఆంక్షలు విధించారు...
కశ్యప మహర్షి పేరుతో నెలకొల్పబడిన కాశ్మీర్ ...
అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు అన్నింటిని నాశనం చేసి...,
ముస్లిములుగా మార్చి.., పాకిస్తాన్ నుండి వేలాది, లక్షలాది ముస్లింలను పిలిచి అందాల కాశ్మీర్ను అల్లకల్లోలం చేశారు ...
ఏమైనా మాట్లాడితే .., ఎవరైనా స్పందిస్తే 370 ఆర్టికల్ 371 ఆర్టికల్ 35A ఉందంటూ బెదిరించేవారు ..,
దుర్మార్గానికి ఒడిగట్టేవారు ...
అటువంటి  రాక్షస ఆలోచనలకు చరమగీతం పాడింది ఇప్పటి మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం...
దేశభక్తులకు ఆనందము ...
ఈ విషయాన్ని దేశ భక్తులు అందరూ స్వాగతిస్తున్నారు.
దేశం హర్షోల్లాసాల మధ్య... స్వాగతిస్తున్నది...
కాశ్మీర్ నుండి తరిమి వేయబడిన లక్షల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతూ నానా కష్టాలు పడుతూ బాధలు అనుభవిస్తున్న వారి జీవితాల్లో చీకటి తొలగి పోయింది ...సూర్యుడు ఉదయించాడు ....వెలుగు రాబోతున్నది .
ఆనందంతో తమ స్వస్థలాలకు వెళ్లడానికి అందరికీ అవకాశం కల్పించే 370 ఆర్టికల్ 35A రద్దును దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు
బతుకుజీవుడా అంటూ తరలివచ్చిన ,పాకిస్తాన్ నుండి తరిమివేయబడి...శరణార్థులుగా వచ్చిన మన భారతీయులే ...,అయినప్పటికీ.., హిందువులైనందున వేలాది మంది ప్రజలకు కనీసం పౌరసత్వం కూడా ఇవ్వని కాశ్మీర్ ప్రభుత్వం...,
లక్షల మంది హిందువులను ఓటర్లుగా ...ఓటు హక్కు కూడా లేకుండా చేసిన కాశ్మీర్ ప్రభుత్వం ...,
370 మరియు35A ఆర్టికల్ రద్దుతో అక్కడి పరిస్థితి ...,
సామాన్య పేద శరణార్థులుగా వచ్చిన వారికి సహకారంగా మారుతుంది అనడంలో సందేహం లేదు ...
దేశంలోని ఎవరు కూడా కాశ్మీర్లో కనీసం అంగుళం భూమి కూడా కొనడానికి వీళ్లేనటువంటి స్థితిని 370 / 35A ఆర్టికల్ రద్దు పరిస్థితి మార్చి వేయడం జరిగింది...
అక్కడ కూడా అతి వేగంగా దేశ ప్రజలందరికీ నివాసయోగ్యమైన విధంగా భూముల క్రయ విక్రయాలు ...ఇళ్ల నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారం .., అక్కడి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగవడానికి దోహదం చేస్తాయి ...
కాశ్మీర్కు దేశంతో ఎటువంటి సంబంధం లేని విధంగా ..., అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల కాలావది ఐదు సంవత్సరాలే..., కానీ కాశ్మీర్ లో మాత్రం ఆరు సంవత్సరాలు ఇటువంటి విచిత్రమైన స్థితి సమాప్తం అయిపోతుంది..అనాలోచిత నెహ్రూ ప్రభుత్వం యొక్క చర్యల కారణంగా ఇప్పటికీ వేలాది మంది సైనికులు బలి దానం చేశారు లక్షల మంది ప్రజానీకం హతులయ్యారు అటువంటి దుర్మార్గానికి చరమగీతం మరియు 35 ఆర్టికల్ రద్దు..
హిందువులు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేల సంఖ్య బహుతక్కువ ..,
ముస్లింలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ అక్కడి ఎమ్మెల్యేల సంఖ్య అత్యధికం ...
ఈ రకంగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ విచిత్రమైన అరాచకం నెలకొని ఉన్నది దానికి చరమగీతం 370 మరియు 35 ఆర్టికల్ రద్దు..
దేశ రక్షణ కోసం బలిదానం ఐన అమరవీరుల ఆశయాలు నెరవేరినరోజు ...
ఇది పండుగ రోజు ...
ఇది చారిత్రాత్మకమైన రోజు...
స్వర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ....
అని తెలియజేస్తున్నాము..
నేటి కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ మరియు 35A రద్దు చేసినటువంటి శుభవేళ...
ప్రజానీకమంతా ఆశిస్తున్నారు పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు  సమస్య అంతా పాక్ ఆక్రమించిన భూభాగం...
అక్క్యూపైడ్ కశ్మీర్ (పి ఓ కే )ను సాధించడం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఆభూభాగాన్ని భారత్ లో విలీనం చేసుకోవాల్సిందే ...అని పార్లమెంట్ సాక్షిగా తీర్మానించారు ...
ఆ తీర్మానాన్ని అమలు పరచాల్సిన బాధ్యత కూడా ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాము ...
యాదిరెడ్డి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments