Page Nav

HIDE
GRID_STYLE

Classic Header

{fbt_classic_header}

Popular Posts

Latest Posts

latest

ఏ.పి.జే అబ్దుల్ కలాం జీవితం - apj abdul kalam life story in telugu

ఏ.పి.జే అబ్దుల్ కలాం: తపస్యులు, జ్ఞానులు, పండితులు, కర్మాచరణ తత్పరులు - వీరందరికంటే 'కర్మయోగి' గొప్పవాడు అని శ్రీకృష్ణ పరమాత్...ఏ.పి.జే అబ్దుల్ కలాం: తపస్యులు, జ్ఞానులు, పండితులు, కర్మాచరణ తత్పరులు - వీరందరికంటే 'కర్మయోగి' గొప్పవాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు. బహుశా ఈ ముక్క కలాంలో కూడా అని ఉంటాడేమో.
అవుల్ పకీర్ జైనులాబిద్దీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబరు 15న ఒక తమిళ ముస్లిం పరివారంలో జన్మించాడు. ఆయన తండ్రి జైనులాబిద్దీన్ ఒక నావికుడు. రామేశ్వరం నుంచి సాంబమ్ ద్వీపం వరకు తీర్థయాత్రికులను చేరవేయడం ఆయన వృత్తి. ఆయన రామేశ్వరంలో ఒక మసీదులో ఇమాం. వీరు మొదట్లో సంపన్నులే పెద్దగా భూములు కూడా ఉండేవి. కానీ కాలం కలిసిరాక కలాం చిన్ననాటికి వారి కుటుంబం బీదరికంలో ఉంది. తండ్రికి కొంత ఆర్ధిక సహాయం చేయాలన్న తలంపుతో ఇంటింటికి న్యూస్ పేపర్లు పంచేవాడు కలాం. స్కూలు చదువులో అత్తెసరు మార్కులతో నెట్టుకు వస్తున్నా కలాం విజగీషు ప్రవృత్తి, పట్టుదల చూసి మేధావి బాలుడని, బాగా పరిశ్రమిస్తాడని అందరు అనుకునేవారు. రామేశ్వరం స్కూల్లో హైస్కూలు చదువు పూర్తిచేశాడు.
ఆ తరువాత చదువుకోసం తిరుచారపల్లి వెళ్ళీ సెంటిజోసఫ్ కాలేజీలో చేరాడు. మద్రాసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్, ఎయిర్ స్పేస్ విషయాలతో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాడు. ఒక పర్యాయం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో చేయనందుకు డీన్ మండిపడ్డారు. మూడురోజుల్లో పూర్తిచేసి చూపించకపోతే నీకు ఉద్వాసన ఖాయం అని హెచ్చరించాడు. కలాం ఆ నిర్ణీత సమయంలో పూర్తిచేసి చూపించగా “నిన్ను అనవసరంగా బాధపెట్టాను. అయితే ఒకటి గుర్తుంచుకో. ఏ పనినైనా సమయ సీమలో చేయాలన్న విషయం జీవితాంతం గుర్తుంచుకో" అన్నాడు.
కలాంకు భారతీయ వాయుసేనలో పైలట్ గా ఉద్యోగం చేయాలని ఉండేది. కానీ ఆ అవకాశం చేజారిపోయింది. కలాంకు తొమ్మిదవ ర్యాంకు వచ్చింది. ఉన్నవి ఎనిమిదే పోస్టులు. బహుశా విధాత బెత్తెడు దూరంలో తప్పించాడేమో. ఏందుకంటే కలాంకు మరో రంగంలో ఉన్నత శిఖరాలను అధిగమించవలసి ఉంది కాబట్టి, ఆ తరువాత నాలుగు దశాబ్దాలపాటు ఆయన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలపమెంట్ (డిఆర్డిఓ)లోను, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లలో పనిచేశాడు. సాగరిక అంతరిక్ష ప్రోగ్రాములోను మిలిటరీ మిసైల్ డెవలప్మెంట్ లోను పనిచేశాడు. అతను 'మిసైలమేన్'గా ఖ్యాతిగాంచాడు. పోఖ్రణ్ అణువిస్ఫోటనం ఆయన పనిచేసిన సమయంలోనే జరిగింది. చిన్న హోవర్ క్రాఫ్ట్తో అతని పని మొదలైంది.

ప్రసిద్ధ అంతరిక్ష విజ్ఞానవేత్త విక్రమ్ సారాభాయి వద్ద పనిచేసే సువర్ణావకాశం లభించింది. ఇస్రోకు ఆయనను బదిలీ చేశారు. ఒక ప్రాజక్టుకి డైరెక్టరుగా పనిచేశాడు. ఆయన పర్యవేక్షణలో ఎసి, ఎల్.వి-3 రాకెట్ ప్రయోగం విజయవంతమై అంతరిక్షంలోనికి దూసుకుపోయింది. 1980లో రోహిణీ రాకెట్ ను భూమి కక్షకు దగ్గరగా పంపారు. ఈ ప్రాజక్టును మరింత విస్తారం చేయమని ప్రభుత్వం ఆదేశించింది. రాజా రామన్న భారతి మొదటి న్యూక్లియర్ టెస్ట్ నవ్వుతున్న బుద్ధాను చూడడానికి రమ్మనీ కలాంను ఆహ్వానించాడు. అప్పటికి కలాం టిబిఆర్ఎల్ ప్రతినిధి మాత్రమే. 1970లలో ఆయన ఆ ప్రాజెక్టుతో పనిచేయలేదు. కలాం కూడా ప్రాజక్టు డెవిల్, ప్రాజక్టు విలియంట్లను నిర్దేశించారు. బాలిస్టిక్, మిసైలుల నిర్మాణానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరగా ప్రభుత్వం నిరాకరించింది.
కాని అప్పటి ప్రధాని అనుమతినిస్తూ తన శక్తులను ఉపయోగించి రహస్యంగా ధనము ఇచ్చారు. ఆనాటి రక్షణ మంత్రి కలుగజేసుకొని 'మణిరం' మిస్సైల్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించారు. ఆ తర్వాత 'పృధ్వి' మిసైల్ నిర్మాణం జరిగింది, కలాం ప్రధానమంత్రికి చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గాను, సెక్రటరి డిఆర్డిఓగాను పనిచేశాడు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం అయనకు అతి విశిష్టమైన భారతరత్న బిరుదును ప్రదానం చేసింది. 2002లో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, ప్రతిపక్షంలోని కాంగ్రెసు సంయుక్తంగా ఆయనను రాష్ట్రపతి పదవికి నిలబెట్టి గెలిపించారు. ఆయన ఆ పదవిలో అయిదేళ్ళు పూర్తికాలం పనిచేసి దేశసేవకు తన జీవితం అంకితం చేసారు.
అన్ని విధాలా విజయవంతమైన, పరిపూర్ణ జీవితాన్ని గడిపిన కలాంకు భగవద్గీత అన్నా, అందునా రెండవ అధ్యాయం అన్నా చాలా శ్రద్ధ ఉండేది. 2015 జూలై 27న 'ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్'లో ఉపన్యసిస్తూ ఆయన తుదిశ్వాస విడిచారు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..