తిమ్మక్క జీవితం - timmakka life


మన సనాతన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి ప్రేమికులే అయితే వారి వారి పరిదిలో వీలున్నప్పుడు ఓ మొక్క నాటుతుంటారు. కొంతమంది పుట్టిన రోజు నాడు మొక్క నాటాలి అనేవారుంటారు ఇంకొక అడుగు ముందుకేసి బహుమతిగా మొక్కను ఇస్తారు ఇలా ఆధునిక భారతదేశం లో కూడా ప్రస్తుతం జరుగుతుంది.

అలా చేసేవారికో కొంతమంది అది ఒక అలవాటు గా మారుతుంది. ఆమె అలవాటు పిల్లలు లేని తనకు మొక్కలే పిల్లలుగా భావించింది ప్రభుత్వం ఆమెను గుర్తించి పద్మశ్రీ ప్రదానం చేసింది 2019 లో ఆమె గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

తిమ్మక్కది కర్ణాటక తుమకూరు జిల్లా గుబ్బి. చిన్నవయసులోనే చిక్కయ్యతో పెళ్లైంది. పిల్లలు కలగకపోవడంతో చాలామంది రకరకాల మాటలు అనేవారు. వాటన్నింటినుంచి బయటపడేందుకు తిమ్మక్క, భర్తతో కలిసి మొక్కలు నాటడం మొదలుపెట్టారు.

ముఖ్యంగా వాళ్లుండే హులికల్‌ గ్రామానికి దగ్గర్లోని కుడూర్‌ రోడ్డు ఇరువైపులా ఒక్క చెట్టూ లేదు. వేసవిలో అటుగా ప్రయాణించేవారు ఇబ్బంది పడటం చూసిన ఆమె, భర్త రోడ్డుకు ఇరువైపులా పది మర్రి మొక్కలు నాటారు. ఏటా ఆ సంఖ్యను పెంచారు. ఆర్థిక సమస్యలున్నా వాటిని సంరక్షించడం మొదలుపెట్టారా దంపతులు. భర్త చనిపోయినా తిమ్మక్క మాత్రం చెట్ల సంరక్షణ ఆపలేదు. 8 దశాబ్దాల కాలంలో మొత్తం ఎనిమిది వేల మొక్కలు నాటారు.
హులికల్‌ నుంచి కుడూరు వరకు నాలుగు కిలోమీటర్లు చెట్లను వరసగా నాటడంతో సాలుమరద తిమ్మక్కగా ఆమె పేరు మారిపోయింది. సాలుమరద అంటే కన్నడలో చెట్ల వరుసలు అని అర్థం. ఈమె సేవలను గుర్తించి 1996లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌర పురస్కారం అందజేసింది. వనమిత్ర, వృక్షప్రేమి, వృక్షశ్రీగా పేరుపొందారు. ఇప్పుడు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


Post a Comment

0 Comments