Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పద్మశ్రీ సుధావర్గీస్ జీవితం - sudha varghese biography

సుధావర్గీస్ కేరళలోని కొట్టాయంకు చెందిన మహిళ. ఈమె 1949వ సంవత్సరంలో జన్మించింది. బిహార్ ముషాహర్లు ఎంతగా వెనకబడ్డారంటే. చాలా కాలం వరకు ఎల...


సుధావర్గీస్ కేరళలోని కొట్టాయంకు చెందిన మహిళ. ఈమె 1949వ సంవత్సరంలో జన్మించింది. బిహార్ ముషాహర్లు ఎంతగా వెనకబడ్డారంటే. చాలా కాలం వరకు ఎలుకలను పట్టుకొని వండుకొని తిని జీవనం సాగించేవారు. వీరి జీవన విధానం చూసి సామాన్య ప్రజలు దూరంగా ఉంచేవారు. దాంతో ఊరికి దూరంగా గుడిసెల్లో జీవితం గడిపేవారు. ముషాహర్ల జీవితాల్ని దగ్గరగా చూసిన ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. వారి జీవితాలలో మార్పు తీసుకురావాలనుకుంది. వెంటనే కార్యాచరణకు పూనుకుంది. వారి గుడిసెల వద్దనే తనూ ఒక గుడిసె నిర్మించుకొని నివాసం ఏర్పరచుకుంది.
కష్టపడి ఇంగ్లీష్, హిందీ భాషలు నేర్చుకుంది. డిగ్రీ పూర్తిచేసింది. తను చేస్తున్న పనిలో న్యాయ పోరాటాలుంటాయి. అందుకు ఆమె న్యాయశాస్త్రం కూడా చదువుకుంది. 1987లో నారీగుంజన్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా దళిత స్త్రీలు వారి హక్కులు పొందేలా చేయగలిగింది. 2005లో బాలికల కొరకు ప్రేరణ' అనే ఆవాస విద్యాలయాన్ని పాట్నాలోని దానాపూర్ లో ప్రారంభించింది. ఈ పాఠశాల నడపడంలోని ముఖ్య ఉద్దేశ్యం బాల కార్మికులుగా మారుతున్న బాలికలను చదువు వైపు మళ్లించడమే.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రోత్సాహంతో గయలో ప్రేరణ-2 పాఠశాల ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నారీగుంజన్ ద్వారా నడుపుతున్న పాఠశాలల్లో సుమారు 3 వేల మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. కొంతమంది ఇంటర్మీడియట్ కూడా చదువుతున్నారు. ఈ పాఠశాలలో నర్సింగ్ విద్యను కూడా నేర్పిస్తున్నారు. చదువుతోపాటు బాలికలకు నృత్యం, కరాటేలు కూడా నేర్పించే ఏర్పాట్లు చేశారు. 2011లో గుజరాత్లో నిర్వహించిన ఆటల పోటీలలో ప్రేరణ విద్యార్థినులు 5 బంగారు పతకాలు సాధించి సతా చాటారు. అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ లో పాల్గొనడానికి జపాన్ వెళ్లే అర్హత సంపాదించారు.
యువకులను చెడు అలవాట్ల నుండి దృష్టి మళ్లించడానికి సుధ వారికి క్రికెట్ కిట్లను అందజేసింది. ఈ ప్రక్రియలో ఒక బ్యాంక్ సహకరించింది. ఆమె ప్రయత్నం వలన నేడు ఆ గ్రామంలో 16 క్రికెట్ జట్లు ఏర్పడ్డాయి. వారు ఇతర గ్రామాల క్రికెట్ జట్లతో పోటీపడి విజయాలు సాధిస్తున్నారు. ఆ యువకుల జీవితాల్లో మంచి మార్పు సంభవించింది. ప్రస్తుతం నారీగుంజన్ స్వచ్చంద సేవాసంస్థ బీహార్లోని 5 జిల్లాలలో పనిచేస్తోంది. 850 స్వయం సహాయక గ్రూపులున్నాయి. వీరు అంగన్ఐడీలను పోలిన ఆనంద్ శిక్షా కేంద్రాలను నడిపిస్తున్నారు.
మధ్యలో బడి మానేసిన వారికోసం కిశోరీ శిక్షా కేంద్రాలను నడుపుతున్నారు. అక్షరాంజలి వయోజన విద్య ద్వారా మహిళలను విద్యావంతుల్ని చేస్తున్నారు. సుధ సైకిల్ పై పర్యటిస్తూనే తన కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారం చేస్తుంది. అందుకే ఆమెను అందరూ సైకిల్ దీదీ అని పిలుస్తారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


No comments