Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సహచరుల విజయానికి బాటలు వేసిన పేరూ సింగ్ షెకావత్

సాహసోపేత పోరాటంతో మేజర్ సోమనాథ్ శర్మ 1947లో పాక్ మూకల చేజిక్కకుండా శ్రీనగర్ ను రక్షించారు. కానీ, స్థానిక ప్రజలతో కలిసి పాక్ సైన్యం మన ...సాహసోపేత పోరాటంతో మేజర్ సోమనాథ్ శర్మ 1947లో పాక్ మూకల చేజిక్కకుండా శ్రీనగర్ ను రక్షించారు. కానీ, స్థానిక ప్రజలతో కలిసి పాక్ సైన్యం మన సరిహద్దు గ్రామాలను ఆక్రమించింది. కిషన్ గంగా నదీ తీరాన ఉన్న తిత్వాల్ పై పాక్ ఆక్రమణకారులు పట్టు బిగించి ఉ న్నారు. 6 రాజ్ పుతానా రైఫిల్స్ ని యురి నుండి తిత్వాలకు పంపారు భారత సైన్యాధికారులు. బారాపారీ పర్వతంపై మాటువేసిన శతృవులు భారత్ వైర్లెస్ సమాచారాన్ని వింటున్నారని, తద్వారా భారత్ను నష్టపరిచే వ్యూహ రచనలు చేస్తున్నారనీ తెలుసుకుని, శతృవును నిర్వీర్యం చేసే బాధ్యతను 6 రాజ్ పుతానా రైఫిల్స్ కు అప్పగించారు.

బారాపారీ పర్వతం 11 వేల అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ శిఖరాన్ని చేరుకోవాలంటే సన్నని దారిపై నడవాలి. ఇరువైపులా వేల మీటర్ల లోతు లోయ. భూమి రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది. ఏ మాత్రం తప్పటడుగు వేసినా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అలాంటి పరిస్థితిలో దాడికి దిగింది పీరూసింగ్ దళం.
పీరూసింగ్ షెకావత్ 1918, మే 18న జన్మించారు. ఆయనది రాజ్ పుట్ వంశం, ఆయన డోగ్రా రెజిమెంట్లో అత్యున్నత స్థాయి జనరల్ గా సేవలు అందించారు.
తాము దాడి చేసే శిఖరంపై శతఘ్ని దాడి చేయాలని పెరూసింగ్ కోరితే అధికారులు సరే అన్నారు. 30 మైళ్ళు నడచి 10 వేల అడుగుల వద్దకి చేరింది పెరూసింగ్ బృందం. తెల్లవారింది. శతఘ్నుల కోసం వేచి చూస్తే మధ్యాహ్నం కావస్తున్నా సహాయం అందలేదు. రేడియో ద్వారా సంప్రదిస్తే శతఘ్నులు ఆలస్యం అవుతాయని, అవి లేకుండానే దాడికి దిగాలని ఆదేశాలు వచ్చాయి.
అర్థరాత్రి దాటాక దాడి చేయాలని, చీకట్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించుకున్నాక అర్ధరాత్రి ఒంటి గంటకు బయల్దేరింది బృందం. సన్నటి దారి పైకి చేరుకుని కొద్దిగా ముందుకు, సాగేసరికి ప్రారంభమైంది పాక్ బులెట్ల వర్షం, ఆ దాడి 30 నిమిషాల పాటు సాగింది. పెరూ బృందంలో 50 మందికి పైగా నేలకొరిగారు. భయానక వాతావరణం నెలకొంది. ఒకసారి పరిస్థితిని సమీక్షించాడు పీరూ, తాము నడవాల్సింది సన్నటి దారీ. దారి చూసుకుంటూ నడుస్తుంటే శతృవులు బులెట్లు తాకుతున్నాయి. బులెట్లను తప్పుకుంటూ నడవాలని ప్రయత్నిస్తే కాలుజారి లోయలో పడిపోవడం ఖాయం. దీన్ని అధిగమించాలంటే తమపైకి వస్తున్న బులెట్ల వర్షాన్ని ఆపాలి. కానీ ఎలా ! ఎలా! ఎలా!
ఇక లాభం లేదు. ఏదైతే అది జరుగుతుంది అనుకుని రాజా రామచంద్రకీ జై! అని గర్జిస్తూ స్టేన్గన్తో కాల్పులు జరుపుతూ ఉరికాడు పిరూ సింగ్, శతృ సైనికులు ఉలిక్కిపడ్డారు. వారు తేరుకునే సరికల్లా సైన్గన్ పాలిటపడి ముగ్గురు మరణించారు. మరో ముగ్గురిని రైఫిల్ బోయినెటితో పొడిచి చంపేశాడు పిరూ. అయితే తాను తప్ప తన వాళ్ళెవరూ మిగలలేదు. ఇంకా రెండు బంకర్లున్నాయి. చేతిలో ఉన్న గ్రెనేడ్లు శతృవుల పోస్ పైకి విసిరాడు. ఇంతలో అటునుండి వచ్చి పది పేలింది ఒక గ్రెనేడ్. ముఖమంతా గాయాలై కళ్ళమీడకు కారుతున్న రకాన్ని తుడుచుకుని ఒకదాని తరువాత ఒకటిగా గ్రెనేడ్లను విసరసాగాడు. ఆ పోస్ట్లో ఇద్దరే మిగిలారు. తెగించి రాజా రామచంద్రకీ జై! అంటూ ఆ ఇద్దరినీ బాయినేటితో హతమార్చాడు. ఇక మూడో ఇంకర్ పైకి విసరడానికి గ్రెనేడ్ పిన్ లాగుతుండగా శతృవు బుల్లెట్ వచ్చి తలలోకి దూసుకుపోయింది. జారిపోతున్న వ శక్తిని కూడదీసుకుని గ్రెనేడ్ విసిరాడు. గ్రెనేడ్ పేలడం, శతృ సైనికులు హతం కావడం మూతబడుతున్న కళ్ళతో కళ్లారా చూసిన పిరూపింగ్ కరవ్యం నెరవేరిందన్న తృప్తితో కన్ను మూశాడు. వెనుకగా వచ్చిన ఓ కంపెనీ శిఖరాన్ని కైవసం చేసుకుంది. అత్యంత కీలకమైన ఈ పోస్ట్ భారతికు ఇప్పటికీ ప్యూహాత్మకమైనదే, భారత ప్రభుత్వం ఆయనకు పరమవీర చక్ర ప్రదానం చేసింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments