Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

యుద్ధ ట్యాంకుల క్రింద పాకి విజయం చేకూర్చిన రాణే - param veer chakra rane life

స్థానిక గిరిజనులను రెచ్చగొట్టి జమ్ము కశ్మీర్ ను కైవసం చేసుకోవాలనే తలంపుతో పాకిస్తాన్ 1948లో కశ్మీర్లోని నౌషెరా రాజోరి మధ్య ప్రాంతంలోక...స్థానిక గిరిజనులను రెచ్చగొట్టి జమ్ము కశ్మీర్ ను కైవసం చేసుకోవాలనే తలంపుతో పాకిస్తాన్ 1948లో కశ్మీర్లోని నౌషెరా రాజోరి మధ్య ప్రాంతంలోకి ఏప్రిల్లో తన సైన్యాన్ని దింపింది. 21న భారత యుద్ధ టాంకుల దళం రాజౌరి పై దాడి చేసి పాక్ సైనికులను రాషాది నుండి తరిమి కొట్టాలని నిర్ణయమైంది. అనుకున్న ప్రకారం పయనం సాగుతూండగా అకస్మాత్తుగా పాకిస్తాన్ సైనికులు మెషిన్గ దాడి ప్రారంభించారు. మెషిన్గన్ వల్ల యుద్ధ టాంక్ లో ఉన్న వారికి ఎలాంటి అపాయం లేదు. టాంకు చెక్కు చెదరదు. కనుక దేగుల్లేదు. కాని, పాక్ ఈ దాడిని ఎందుకు ప్రారంభించింది. భారత టాంకుల దళ ఇంజనీర్ విభాగంలో ఉన్న కమాండింగ్ ఆఫీసర్ రామ్ రహో రాణే మనసు తీడు శంకించింది.

కర్నాటక రాష్ట్రంలోని చెందియా గ్రామంలో 1918 జూన్ 28న జన్మించిన రామ్ రహో రాణి తండ్రి పోలీసు కానిస్టేబిల్ రాజే 22 ఏళ్ళ వయసులో సైన్యంలో చేరి బ్రిటీష్ తరపున రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని అనుభపము, యుద్ద పాటవానికి ప్రశంశలతో పాటు పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయన ఇంజనీర్ విభాగంలో ఉన్నారు. ట్యాంకులకు దారి కల్పించడం, మధ్యలో వచ్చే అవరోధాలను తొలగించడం ఆయన విధులు.
పాక్ సైనికులు మెషిన్గన్ కాల్పులతో మన దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నారంటే తప్పకుండా మరో వ్యూహం ఉండాలి, అదేమిటో కని పెట్టాలని నిశ్చయించుకున్న రాజే వైర్లెస్ సెట్లో మిగతా సహచర టాంకు డ్రైవర్లను హెచ్చరించి, ఎక్కడి వారిని అక్కడ ఆపేసి తాను తన టాంకర్ నుండి క్రిందకు దిగారు. వెంటనే కాల్చులు ప్రారంభించారు శత్రువులు. రానే వెంటనే నేలపై బొక్కబోర్లా పడుకుని పాకుతూ ఆ ప్రదేశాన్ని పరిశీలించాడు. మొత్తం అంతటా ముందు పాతరలు అమర్చి ఉన్నాయి.
అధిగమించడానికి తగిన ఉపాయం తట్టగానే తన టాలలోకి చేరి సహచరులకు వివరించాడు. రాణే ఉపాయం ప్రకారం తను టాంకు క్రింద పాకుతూ దారిలో ఉన్న మందు పాతరలను తొలగించాలి. మిగిలిన ఈ టాంకులన్నీ ఒకే వరుసలో ఒకరి వెనుక ఒకరు రావాలి. మతిపోయిందా నువ్వు మందు పాతర తొలగించేలోగా నిన్ను మెషిన్గన్తో కాల్చేస్తారు వదు అన్నాడు కమాండర్. మీకు దారి ఏర్పాటు చేయడం నా కర్తవ్యం. కంగారు వద్దు. నేను బొక్కబోల్లా నేలపై పడుకుని పని పూర్తి చేస్తాను. ఆ కోణంలో నన్ను కాల్చడం కష్టం అన్నాడు రాజే, నువ్వు మందుపాతర తొలగించినట్లు మాకెలా తెలుస్తుంది ? అన్నాడు కమాండర్, మొదటి టాంక్ డ్రైవరు సీటు వద్ద నుండి కుడి, ఎడమల్లో రెండు కాళ్ళు కడతాను, అవి బయట నా దగ్గరగా వేలాడుతుంటాయి. నేను వెళ్ళి టాంక్ ఎదురుగా నేలపై బొక్కటిలా పడుకుని పాకుతుంటాను. టాంక్ దారిలో మందు పాతర ఉంటే కుడివైపు డు లాగుతాను. అంటే అగమని సంకేతం. మందుపాతరను నిర్వీర్యం చేశాక ఎడమవైపు తాడు లాగుతాను. అంటే ముందుకు కదలమని సంకేతం. చెప్పడానికి, వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో చాలా కష్టం. ట్యాంక్ క్రింద పాకుతూ ముందుకు సాగేప్పుడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా, లేదా టాంక్ కదిలే చేశానికి రాలే కదిలే వేగానికి సమన్వయం కుదరకపోయినా, ట్యాంక్ ఇనుప బెల్టుల మధ్యగా కాకుండా బెల్ట్ క్రిందికి వచ్చేసినా రాణేరి ప్రాణాపాయం తప్పదు. రోమాంచితమైన ఈ సాహస యాత్రను దిగ్విజయంగా పూర్తిచేశాడు రాణే.
ట్యాంకుల క్రింద పాకుతూ దారిలోని మందు పాతరలను నిర్వీర్యం చేస్తూ, కదలమని ఒక్కో టాంకుకు సంకేతమిస్తూండగా భారత యుధ టాంకులన్నీ ఒకదాని వెంట ఒకటి మందు పాతరల ప్రదేశం దాటుకుని క్షేమంగా గమ్యాన్ని చేరుకున్నాయి. టాంకులు తమ మీదికి రావడం చూసిన పాక్ సైనికులు మెషినగన్స్ వదిలేసి పారిపోయారు. ఈ ఆపరేషన్ కోసం పనిచేసిన ఇంజనీర్లకు 'బ్యాటల్ ఆనర్ ఆఫ్ రాజౌరి' పురస్కారాన్ని రామ రఘాణ రాడేకు పరమ వీర చక్ర బహూకరించారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..