Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

చంద్రశేఖర్ ఆజాద్ విప్లవ వీరుడు ఓ సందర్బంలో రాసిన ఉత్తరం

చంద్రశేఖర్ ఆజాద్ విప్లవకారుడు చంద్ర శేఖర్ ఆజాద్ పరారయ్యాడు. బ్రిటిష్ ప్రభుతము ఆయనను పట్టుకోవడానికి అయిదువేల రూపాయల బహుమతి ప్రకటించింది ...

చంద్రశేఖర్ ఆజాద్ విప్లవకారుడు
చంద్ర శేఖర్ ఆజాద్ పరారయ్యాడు. బ్రిటిష్ ప్రభుతము ఆయనను పట్టుకోవడానికి అయిదువేల రూపాయల బహుమతి ప్రకటించింది కాని, ఆజాద్ పోలీసుల వలలో చిక్కకుండానే తిరుగుతూ వచ్చాడు. ఏ విధంగా దాగుతూ - నక్కుతూ ఒక రోజు ఆయన ఒక ఇంటి ముందుకు వచ్చి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఒక ముసలావిడ తన కూతురుతో పాటు అంటూ ఉండేది. ఆజాద్ ఆమెతో ఇలా అన్నాడు. “నేను చంద్ర శేఖర్ అజాద్ ను. ఈ రాత్రి ఎలాగైనా సరే మీ ఇంట్లో తల దాచుకోవా లనుకుంటున్నాను.
ఆజాద్ పేరు వినగానే ముసలామె సంతోషపడింది. ఆమె ఆజాద్ ను కౌగలించుకొని తన పుత్రుని పై కనపరిచే ప్రేమను కనపరచి ఆశీర్వదించింది. కూతురుతో అన్నం వడ్డించమని చెప్పింది. ఆ అమ్మాయి పళ్ళెంలో అన్నం వడ్డించి తెచ్చిన తర్వాత మాటల మధ్యలో ఆజాద్ "అమ్మా! మా బావగారు ఏ ఊళ్ళో ఉంటారు? ఎప్పుడైనా అవకాశం దొరికితే ఆయనను కూడా కలుసుకుంటాన్నేను" అని అన్నాడు. ముసలామె ఆ మాటవిని చిరునవ్వు నవ్వింది. కాని, మరుక్షణమే నిరాశతో ఆమె ముఖం వివర్ణమయింది. 
ఆమె ఇలా చెప్పింది: “నాయనా, పేదలకు దిక్కు ఆ దేవుడే. వరకట్నం డబ్బు సేకరిస్తున్నాను. ఆ డబ్బు పూర్తిగా చేతికందిన తర్వాతనే నీ చెల్లిలి పెళ్ళి చేయగలుగుతాను. ఆఁ, నేను బ్రతికి ఉంటే ఎప్పుడో ఒకసారి మీ బావను నీకు తప్పక చూపిస్తాను. కొంత సేపు ఆలోచించి ఆజాద్ ఇలా అన్నాడు: “అమ్మా, ప్రభుత్వం నన్ను పట్టి ఇచ్చినందుకు అయిదు వేల రూపాయల బహుమతి ప్రకటించింది. రేపు మీరు నాదగ్గర ఉన్న రొక్కం విప్లవకారులైన నా మిత్రుల్లో ఎవరి వద్దకైనా చేర్చి నన్ను పోలీసులకు అప్పగించండి. మీకు బహుమ లభించే డబ్బుతో చెల్లిలి పెళ్ళి ఎంతో అట్టహాసంగా జరిగిపోతుంది తల పైన ఉన్న బరువు తేలిక పడుతుంది. 

ఈ అన్న కూడా సంతోషం అందుకు ముసలావిడ “అదేం మాట నాయనా! అయిదు వేల మాట ఎందుకు? నాకు అయిదు లక్షల రూపాయలు ఇచ్చినా ఇలాంట విశ్వాసఘాతం చేయలేను. పైగా నిన్ను కుమారునిగా భావించి అక్కున చేర్చుకున్నాను. దేవుడు అందరి ప్రార్ధనా వింటాడు. ఎప్పుడో ఒకసారి మా ప్రార్ధన కూడా వింటాడు” అంది. ఆమె ఆజాద్ కోసం పడక సిద్ధం చేసి తన కూతురుతో పాటు మరో గదిలోకి వెళ్లి పడుకుంది. మరుసటి రోజు ఉదయం ముసలావిడ, ఆమె కూతురు లేచి చూసేసరికి మంచం మీద ఆజాద్ లేడు. అక్కడ రూపాయల కట్టలు పేర్చి ఉండటం వాళ్ళకు కనిపించింది. వాటి సమీపంలోనే ముసలావిడ పేరుతో ఒక చిన్న ఉత్తరం కూడా ఉంచబడి ఉంది. చంద్ర శేఖర్ ఆజాద్ రాసిన ఆ ఉత్తరం ఇలా ఉంది.
గౌరవనీయులు అమ్మగారికీ,
                 అదరపూర్వకమైన చరణస్పర్శ. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన అవినయానికి క్షమించమని , కోరుతున్నాను. మీరు నా ప్రతిపాదనకు అంగీకరించలేదు. మీ ఇష్టం. కానీ, ఇప్పుడు మాత్రం మీ ఇష్టం కాదు, మీ పుత్రుని ఇష్ట మే నెరవేరుతుంది. ఈ ఉతరంతో పాటు ఉంచిన డబ్బుతో వీలయినంత త్వరలో నా చెల్లెలి పెళ్ళి జరిపించండి. ఆ సమయంలో చెల్లెలికి దగ్గరగా ఉండాలనే కోరిక నాకూ ఉంది. కానీ, నేనెక్కడుంటానో, ఎవరికి తెలుసు? కానీ, అమ్మా! పరారీ అయిన ఒక అన్న తన చెల్లెలికోసం ఇంతకంటే ఏమి చేయగలుగుతాడు? అదృష్టం ఉంటే ఎప్పుడో ఒకసారి బావగారినీ కలుసుకుంటాను, చెల్లెలికి ఆశీస్సులు ఇచ్చీ వస్తాను. ఇప్పుడు మాత్రం వెళ్ళిపోతున్నాను. చెల్లెలికి నా శుభాశీస్సులు తెలపండి.
                                                                                                                                             మీ పుత్రుడు
                                                                                                                                              చంద్ర శేఖర్

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments