Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

స్వాతంత్ర్య వీరుడు రోశన్ సింగ్ ఉరి కి ముందు తన మిత్రుడు కి రాసిన ఉత్తరం

రోశన్ సింగ్ ఠాకూర్             రోశన్ సింగ్ షాజహాన్ పుర్ జిల్లాలోని నవాడా గ్రామ నివాసి ఆయన పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ కు అసలు సిసలైన ...

రోశన్ సింగ్ ఠాకూర్
            రోశన్ సింగ్ షాజహాన్ పుర్ జిల్లాలోని నవాడా గ్రామ నివాసి ఆయన పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ కు అసలు సిసలైన అనుయాయుడు 'బిస్మిల్ లక్నో జైలులో 16 రోజులు నిరాహార దీక్షలో ఉన్నప్పుడు ఈ సింగ్ కూడా 16 రోజులు పూర్తిగా ఉపవాసం ఉండి ఆయనకు తోడు నిలిచాడు. 
           కాకోరీ కేసు విచారణ జరుగుతున్న రోజుల్లో రామ్ ప్రసాద్ 'బిస్మిల్ తో పాటు రోశన్ సింగ్ కు కూడా ఉరిశిక్ష పడుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ 1927 డిసెంబరు 19న చేతిలో భగవద్గీత పట్టుకొని వెనువెంటనే బయలుదేరి 'వందేమాతరం' నినాదాన్ని ప్రతిధ్వనింపజేస్తూ ఆయన ఉరికంబం ఎక్కాడు.
             ఉరి తీయడానికి ఆరు రోజులు ముందు అనగా 1927 డిసెంబరు 13వ తేదీన రోశన్ సింగ్ తన మిత్రునికి ఒక ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం ద్వారా ఆయన మత భావాల గురించే కాకుండా ఆయన ధైర్య సాహసాల గురించి కూడా మనకు తెలుస్తుంది. ఉత్తరం ఇలా ఉంది:
             ఈ వారంలోగానే ఉరి తీయడం అయిపోతుంది. మీరు నా పట్ల కనబరచిన ప్రేమ వృధా కాకుండా ఉండాలని దేవుని ప్రార్ధిస్తున్నాను. మీరు నా కోసం రవ్వంత కూడా విచారపడకండి. నా చావు సంతోషకరం కావాలి. భూమి పైన జన్మనెత్తిన తర్వాత చావు తప్పదు. ప్రపంచంలో మనిషి చెడ్డ పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండాలి. చనిపోయేటప్పుడు భగవంతుని మరువకుండా ఉండాలి. ఈ రెండు విషయాలు ముఖ్యం. దేవుని దయవల్ల ఈ రెండు అంశాలూ నాలో ఉన్నాయి. అందువల్ల నా చావు ఏ విధంగానూ, దుఃఖించ దగినది కాదు. రెండు సంవత్సరాల నుంచి నేను నా భార్యా పిల్లల నుండి దూరంగా ఉన్నాను. ఈ వ్యవధిలో భగవత్ స్మరణకు చాలా అవకాశం దొరికింది. దీంతో నా మోహం తొలగిపోయింది. నాలో ఎలాంటి పిపాసలూ మిగలలేదు. కష్టాలతో నిండిన ప్రపంచయాత్ర ముగించుకుని ఇప్పుడు విశ్రాంత జీవితం గడపడానికి పోతున్నాననే గట్టి నమ్మకం నాకుంది. మన శాస్త్రాల్లో రాశారు కదా - అడవుల్లో ఉంటూ తపస్సు చేసే వాడికి ఎలాంటి గతులు కలుగుతాయో, ధర్మ యుద్దంలో ప్రాణాలర్పించేవాడికి కూడా అవే గతులు కలుగుతాయని!
   జిందగీ జిందాదిలీ కో జాన్ ఐ రోశన్, 

    వర్నా కితనే మరే ఔర్ పైదా హోతే జాతే హైఁ. 
(తుళ్ళుతూ నవ్వుతూ బ్రతకడమే కదా జీవితమంటే! ఓ రోశన్! లేకుంటే ఎందరు పుట్టడం లేదు? ఎందరు గిట్టడం లేదు?)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments