Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బి జె పి కొంప‌ముంచిన‌ నోట

కీలకమైన మూడు హిందీ రాస్త్రాలలో బీజేపీ ప్రభుత్వాలు పడిపోవడం దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలలో నిరాశ కలిగిస్తున్నది. ముఖ్యంగా రాజస్థాన్, మధ...


కీలకమైన మూడు హిందీ రాస్త్రాలలో బీజేపీ ప్రభుత్వాలు పడిపోవడం దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలలో నిరాశ కలిగిస్తున్నది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోవలసి వచ్చినా ఛత్తీస్‌గఢ్ లో మాత్రం బీజేపీ మంచి ఆధిక్యతతో ఉన్నదని అందరూ భావించారు. రాజస్థాన్ లోనే తీవ్ర పరాభవం ఎదురు కావచ్చని అంచనా వేశారు. 

అయితే అందరికి ఆశ్చర్యకరంగా ఛత్తీస్‌గఢ్ కోలుకోలేని నష్టం జరిగింది. 90 మంది సభ్యులలో కేవలం 15 మంది మాత్రమే బీజేపీ నుండి గెలిచారు. ప్రతిపక్ష ఓట్లలో భారీ చీలిక ఏర్పడినా బీజేపీ కోలుకోలేక పోయింది. 

ఇక మధ్య  ప్రదేశ్ లో దాదాపు విజయం వరకు వచ్చిఆగింది. కర్ణాటకలో వలే మరో ఏడెనిమిది సీట్లు గెలిచి ఉంటె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండెడిది. ఇక రాజస్థాన్ లో కూడా 73 సీట్లు తెచ్చుకోవడం  గౌరవనీయమే. కాంగ్రెస్ కన్నా 16 సీట్లు మాత్రమే తక్కువ. ఒక పరిశీలన ప్రకారం ఈ రెండు రాష్ట్రాలలో `నోటా' ఓట్లు బిజెపి పరాజయానికి దారితీశాయా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటె కాంగ్రెస్ - బిజెపిల మధ్య ఉన్న ఓట్ల తేడాకన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. 

రాజస్థాన్ లో కాంగ్రెస్ కన్నా కేవలం 0.5 శాతం తక్కువగా 38.8 శాతం ఓట్లు బిజేపికి లభించాయి. ఇక్కడ నోటాకు 1.3 శాతం ఓట్లు వచ్చాయి. అవన్నీ బిజెపికి వచ్చి ఉంటె కాంగ్రెస్ ఓట్ల శాతం 0.8 శాతం తక్కువ అయి ఉండెడిది. 18 సీట్లలో గెలుపోటముల మధ్య మూడు వేల కన్నా తక్కువ ఓట్లు ఉన్నాయి. వీటిల్లో బిజెపి 8 చోట్ల, కాంగ్రెస్ 10 చోట్ల ఓటమి చెందింది. బిజెపి ఓడిన 8 సీట్లలో 7 చోట్ల నోటా కన్నా తక్కువ ఓట్ల తేడాతో బిజెపి ఓటమి చెందింది. 

నోటా ఓట్లతో బిజెపి మరో 8 సీట్లు గెలిచి ఉంటె సీట్ల సంఖ్యా 81కు పెరిగెడిది. అప్పుడు పరిస్థితి మరో విధంగా ఉండెడిది. కాంగ్రెస్ సీట్లు 90కు తగ్గేడివి. 10 చోట్ల ఓట్ల తేడాకన్నా ఎక్కువగా నోటా ఓట్లు ఉన్నాయి. 

మధ్యప్రదేశ్ లో పోటీ మరింత తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ కు 41 శాతం ఓట్లు రాగా, బిజెపికి 40.9 శాతం ఓట్లు వచ్చాయి. ఒక నోటాకు 1.4 శాతం ఓట్లు వచ్చాయి. నోటా ఓట్లు బిజెపికి వచ్చి ఉంటె పరిస్థితి మరోవిధంగా ఉండెడిది. 

31 సీట్లలో గెలుపోటముల మధ్య తేడా 3,000 కన్నా తక్కువ ఓట్లతో ఉంది. వీటిల్లో బిజెపి 16 చోట్ల గెలుపొందగా, 15 చోట్ల ఓటమి చెందింది. 10 సీట్లలో బిజెపి ఓటమి చెందిన ఓట్లకన్నా నోటా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. నోటా ఓట్లు బిజెపికి బదిలీ అయి ఉంటె బిజెపి బలం 119 సీట్లకు పెరిగెడిది. కాంగ్రెస్ సీట్లు 104కు తగ్గిపోయెడివి. కనీసం నోటా ఓట్లలో సగం బిజెపికి వచ్చినా బిజెపికి మరో ఆరు సీట్లు వచ్చెడివి. అప్పుడు బిజెపి బలం 115 సీట్లకు చేరుకొనెడిది. కాంగ్రెస్ బలం 108కి పడిపోయెడిది.  బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం ఏర్పడిడేది. 

నోటా ఓట్లలో కనీసం మూడోవంతు బిజెపికి వచ్చినా బిజెపి సీట్ల సంఖ్యా 112కు పెరిగి, కాంగ్రెస్ సీట్లు 111కు తగ్గి, బీజేపీ అతిపెద్ద  పార్టీగా ఏర్పడిడేది. నోటా ఓట్ల వల్లన బిజెపితో పాటు అన్ని పార్టీలు ఎంతో కొంత నష్ట పడిపోయినా, బిజెపి ఓటమికి ఇదే ప్రధాన కారణం అని చెప్పలేము. ప్రధాన కారణాలను బిజెపి అధిష్టానం అధ్యయనం చేసి 2019 ఎన్నికల సమయంలో ఈ పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త పడాలి.

No comments