Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గులాబ్ రావ్ మహారాజ్ జీవిత చరిత్ర-Gulabrao Maharaj Life Story

గులాబ్ రావ్ జీ అత్యంత పేద పరివారానికి చెందిన గోండొజి మొహద్ కుటుంబానికి చెందిన వాడు.. 1881 జూలై 6 న మదన్ గ్రామం అమరావతి జిల్లా మహ...



గులాబ్ రావ్ జీ అత్యంత పేద పరివారానికి చెందిన గోండొజి మొహద్ కుటుంబానికి చెందిన వాడు..

1881 జూలై 6 న మదన్ గ్రామం అమరావతి జిల్లా మహారాష్ట్ర లో జన్మించారు...
పుట్టిన 9 నెలలకే ఓ వైద్యుడు సరైన మందులు ఇవ్వని కారణంగా వారు నెలల శిశువు గా ఉండగానే శాశ్వత అందులైనారు..తరువాత నాలుగు సంవత్సరాలకే తల్లి అనారోగ్యం తో మరణించింది.. ఇంక తరువాత అమ్మమ్మ దగ్గర 'లోనిటక్లి' గ్రామం లొ పెరిగారు.
Related image
గులాబ్ చిన్నతనం లోనే అంధుడైనప్పటికీ 6 ఎళ్ళ వయస్సునుండే వారి ఇంటి ఎదుట ఉన్న బావి దగ్గరకు వచ్చి పోయేవారిని పేరుతో పిలిచేవారు విన్నవారందరూ ఆశ్చర్యపోయేవారు..
చిన్నవాడిగా ఉన్నప్పుడే ధ్యాన స్తితిలో కూర్చోని ఊపిరిబందించి సమాధిలోకి వెళ్ళేవారు.. అదిచూసి అమ్మమ్మ కొంతమంది కంగారుపడేవారు..ఇంకొంతమంది అభ్యాసం చేస్తున్నాడు ఆటంకంకలిగించవద్దు అనేవారు.
గులాబ్ 16 వ ఏటనే ఆధ్యాత్మిక చింతనతో ఉండి.. కవిత్వాలు.. వ్యాసాలు రచించి మిత్రులతో కలిసి భజనలు చేసి అందరికీ మంచి అనుభూతిని కలిగించేవారు
తన 19 ఏళ్ళ వయస్సులో సంత్ శ్రీ జ్ఞ్యానేశ్వర్ జీ ని కలిసి మంత్రోపదేశం స్వీకరించారు.. తరువాత ఒక చిత్రకారుడిని పిలిచి గులాబ్ రావ్ జీ జ్ఞ్యానేశ్వర్ జీ ని వర్ణిస్తే ఆ చిత్రకారుడు జ్ఞ్యానేస్వర్ చిత్రం ను అలాగేవేసారు... అది ఇప్పటికీ మహరాష్ట్రలొ ఉన్న ఆలండి లో సమాధి ఆలయం వద్ద ఉంది.
గులాబ్ రావ్ జీ తరువాత రోజుల్లో ప్రజ్ఞాచక్షూ మధురాద్వైతాచార్య గులాబ్ రావ్ మహారజ్ గా ప్రసిద్ది చెందారు..ప్రజ్ఞాచక్షు అంటే ప్రజ్ఞ అనగా జ్ఞానము అలాగే చక్షు అనగా నేత్రము కాబట్టి వారు జ్ఞాన నేత్రములు కలవారిగా పేర్కొనబడినారు..
మొత్తం వేదాల సారాన్ని, ఉపనిషత్తులను, మార్మిక, భౌతిక శాస్త్రాల మీద భోదించడం లో ఆరితేరిన వారితో పోటీపడి ఓడించారు మన ప్రజ్ఞాచక్షు
ప్రపంచం లోని ఏ పుస్తకాన్ని అయినా ఆయన చదవాలి అనుకుంటే ఆ పుస్తకానీ ఒక్కసారి తడిమితే దానిలోని సారమంతా గ్రహించే అటువంటి జ్ఞానము కలిగినవారు
సముపార్జించిన జ్ఞానం తో డార్విన్ మరియు స్పెన్సర్ ల సిద్ధంతాలకు వ్యాక్యానం రాశారు.. అంతేకాకుండా ధ్యానం, యోగా, పురాణాలపైన రక రకాల పుస్తకాలు రచన చేసారు.
ఇవేకాకుండా ఆయుర్వేదం లో మానసిక రోగాలకు సంబందించి మానస ఆయుర్వేదం ను రచించారు
గులాబ్ రావ్ జీ ఏం రాసినా, చెప్పినా సొంత బాణి లో గంభీరమైన వాటినికూడా సరళంగా ప్రజలకు అర్దమయ్యేరీతిలో వివరించేవారు
ఒకవైపు అంతజ్ఞానాన్ని సంపాదించి కూడా తనకు వేదాలు చదివే అర్హతలేదంటూనే ఆత్మజ్ఞానం ద్వారా వేదం చదవగలిగారు ప్రజ్ఞాచక్షు..
చాలా తక్కువ సమయం లోనే 6000 పేజీలపైబడి వివిధ అంశాలపై 139 పుస్తకాలు, 130 వ్యాక్యానాలు 25000 వాక్యాలతొ కూడిన కవితాసంపుటి ని రాశారు.
జ్ఞ్యానేశ్వర్ మహారాజ్ రచించిన భావార్ధ దీపిక అను పుస్తకంకు చేసిన వ్యాక్యానం ను గీతా ప్రెస్ గోరఖ్ పూర్ వారు ప్రచురించారు
వారు 34 సంవత్సరాలకే 20 సెప్టెంబర్ 1915 న స్వర్గస్తులైనారు
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments