Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

విప్లవవీరుడు భగత్ సింగ్-Freedom Fighter Bhagath Singh-bhagath singh photos

       జననం: సెప్టెంబర్ 27, 1907, మరణం: మార్చి 23, 1931                                                   ఊగరా,,,ఊగరా ఉరికంబమందుకొ...


       జననం: సెప్టెంబర్ 27, 1907, మరణం: మార్చి 23, 1931
                                                  ఊగరా,,,ఊగరా ఉరికంబమందుకొని ఊగరా ... ఊగితే శత్రువుకు దడదడ అంటూ నినదించిన విప్లవవీరుడు, దేశం కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఉరికంబమెక్కిన భగత్ సింగ్ వర్ధంతి నేడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. భారత విప్లవోధ్యమ నిర్మాత, భారతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ ఉరికంబన్ని ముద్దాడి దేశానికి ఆదర్శంగా నిలిచారు. మనిషిని వేరొక మనిషి దోపిడి చేయనటువంటి రాజ్యం రావాలని నవ సమాజం కోసం ఎదురు చూసిన మహనీయుడు. అమెరికా సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు భగత్ సింగ్. లాహోర్ జైలులో 114రోజులు దీక్షచేసి ఖైదీల డిమాండ్లను పరిష్కరించి రాజకీయ ఖైదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలితరం విప్లవ వీరుడిగా పేరుగాంచిన భగత్ సింగ్ ను 1931, మార్చి 23న ఆనాటి తెల్లదొరలు ఉరితీశారు. ఈరోజు దేశం కన్నీరు పెట్టిన రోజు. చరిత్ర మరిచిపోని రోజే ఇదే. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల నినాదం ప్రపంచమంత వినిపించింది. భగత్ సింగ్ త్యాగం వసంత మేఘం లాంటిది. భారత దేశానికి ఆయన ఆదర్శంగా నిలిచారు. పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్ లోని సాందా గ్రామంలో సెప్టెంబర్ 27న, 1907సంవత్సరంలో జన్మించిన భగత్ సింగ్ చిన్న వయస్సులోనే దేశభక్తిని అలవర్చకున్నారు. కరడుగట్టిన దేశభక్తుడిగా ముద్రపడ్డారు. 1929లో అమెరికా సామ్రాజ్యవాదుల కళ్లుతెరిపించాలని, భారతజాతి గొంతువినిపించాలని పార్లమెంటుపై బాంబులు విసిరి నిరసన తెలిపారు. ఒకచేతితో బాంబు, మరో చేతిలో కరపత్రాలు విసిరి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, విప్లవం వర్ధిల్లాలని నినదించారు. వేలమంది ప్రాణాలుతీసిన జనరల్ డయ్యార్ పై ఎలాంటి కేసు పెట్టలేదని, విచారణ కూడా చేయలేదని ప్రశ్నించారు. దేశం కోసం ఉరికొయ్యలు, చెరసాలలు లెక్కచేయకుండా దేశం కోసం ప్రాణాలర్పించి చరిత్రలో నిలిచిపోయిన భగత్ సింగ్ ను స్మరించుకోవడం మన కర్తవ్యం.
                                             భగత్‌సింగ్‌ లాంటివారి జీవితం నుంచి నేటి యువత నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. "షహీద్‌ భగత్‌సింగ్" ఆదర్శప్రాయుడు. నా నెత్తురు వృధాపోదు. . . (భగత్‌ రచించిన వ్యాసాల సంకలనం - తెలుగు అనువాదం పేరు) అన్న భగత్‌సింగ్‌ హక్కులు అక్షరసత్యాలు. భగత్‌సింగ్‌ వంటి ఎందరో దేశభక్తుల జీవితాల త్యాగాల ఫలితమే మనమనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఉరికంబం ఎక్కుతూ, ఉరిత్రాడు మెడకు చుట్టుకున్నపుడు కూడా దేశం పట్ల అభిమానంతో, స్వాతంత్ర్యసాధనపట్ల నిబద్ధతతో 'వందేమాతరం'. 'భారత్‌ మాతాకీ జై' , 'ఇంక్విలాబ్‌ జిందాబాద్‌' అంటూ నినాదించిన ఆ వీరుల దేశభక్తిని తలుచుకుంటే ఆ ఒళ్ళు జలదరిస్తుంది, మన స్వాతంత్ర్యం కోసం వారు చేసిన ప్రాణత్యాగం మనసులను కదిలిస్తుంది.
                                             అవిభాజ్య భారతదేశంలోని బంగాగ్రామం (లైలాపూర్‌ జిల్లా, ప్రస్తుతం పాకిస్థాన్‌లో వున్నది) లో 1907వ సంవత్సరంలో భగత్‌సింగ్‌ జన్మించాడు. ప్రాధమిక విద్యను గ్రామంలోనే పూర్తిచేసిన భగత్‌సింగ్‌, ఉన్నత విద్యాభ్యాసం కొరకు లాహోర్‌ చేరారు. 'అక్కడ పంజాబ్‌కేసర', 'లాలాలజపతిరాయ్‌', భాయ్‌ ప్రేమానంద్‌ వంటి అగ్రశ్రేణి స్వాతంత్ర్యసమరయోధులు బోధన చేస్తున్న 'నేషనల్‌ కాలేజ్‌' లో చదవడం భగత్‌సింగ్‌లోని విప్లవకారుడిని తీర్చిదిద్దాయి. ఆ గాంధీజి పిలుపుకు ప్రభావితులైన అనేక మంది విద్యార్ధులు 'కాలేజీ' ని వదిలి ఉద్యమంలో చేరడం వంటివి జరిగాయి.
                                             తనకు పెళ్ళి చేయాలన్న తల్లిదండ్రుల నిర్ణయం తెలుసుకున్న భగత్‌, 'తనకు పెళ్ళి వద్దని' ఉత్తరం వ్రాసి ఢిల్లీ చేరారు. 'దైనిక్‌ అర్జున్‌' , 'ప్రతాప్‌' వంటి పత్రికల్లో కొంతకాలం పనిచేసిన భగత్‌సింగ్‌కు, ఆ సమయంలోనే గణేష్‌ విద్యార్థి, బటుకేశ్వరదత్‌ వంటి విప్లవకారుల సహచర్యం లభించింది. విప్లవం ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధించగలదని భావించిన భగత్‌సింగ్‌ "నౌ జవాన్‌ భారత్‌ సభ" స్థాపించాడు (1924).
                                             భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, భగవతీచరణ్‌లు ఆ సమయంలో తమ రక్తంతో ప్రమాణపత్రంపై సంతకం చేశారు. ఆ సమయంలో కాన్పూర్‌లో వరదలు రావడంతో, సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న భగత్‌సింగ్‌కు చంద్రశేఖర ఆజాద్‌ వంటి విప్లవవీరుడు పరిచయం కావడం తరువాతి కాలంలో వారు ప్రాణస్నేహితులుగా మారి, 'హిందూస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ ఆర్మీ' ని స్థాపించడం జరిగింది. 'పంజాబ్‌ కేసరి' లాలా లజపతిరాయ్‌ మృతికి కారణమైన పోలీసు అధికారి సాండర్స్‌ను ఆజాద్‌, భగత్‌సింగ్‌, రాజగురు సుఖదేవ్‌లు హతమార్చారు.
                                             1929వ సంవత్సరంలో ఢిల్లీ అసెంబ్లీలో 'పబ్లిక్‌ సేప్టీ బిల్‌' ప్రవేశ పెట్టే సమయంలో భగత్‌సింగ్‌, బటుకేశ్వరదత్తాలు బాంబు వేయడం, జరిగింది. ఆసమయంలో వారు తప్పించుకుపోయే అవకాశం వున్నప్పటీకీ, పోలీసులకు లొంగిపోవడం జరిగింది. చంద్రశేఖర ఆజాద్‌ భగత్‌సింగ్‌ తదితరులను జైలు నుంచి తప్పించడానికి ప్రయత్నించినప్పటికీ, భగత్‌సింగ్‌ అందుకు నిరాకరించడం జరిగింది.
                                               భగత్‌సింగ్‌ తదితరులపై వివిధ అభియోగాలు మోపబడ్డాయి, ప్రధానంగా, 'ఢిల్లీ అసెంబ్లీలో బాబు సంఘటన' వంటి అభియోగుల ఆధారంగా భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజగురులకు మరణశిక్ష (ఉరి) విధించబడింది. జైలులో సరైన సదుపాయాలు లేకపోవడంతో, అందుకోసం భగత్‌సింగ్‌ తదితరుల నిరాహారదీక్ష ప్రారంభించారు. భగత్‌సింగ్‌ 115 రోజులు నిరాహారదీక్ష (దీక్ష 63 వ రోజున యతీత్రదాస్‌ మరణించారు) ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి, జైలులో సరైన కనీస సదుపాయాలు కల్పించింది.
                                                31 మార్చి 1931న భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజగురులు భారతదేశ స్వాతంత్ర్య సముపార్జనా యజ్ఞంలో సమిధలుగా 'ఇంక్విలాబ్‌ జిందాబాద్‌', 'వందేమాతరం', 'భారత్‌మాతాకీ జై' అని నినదిస్తూ ఉరికంబం ఎక్కి, ప్రాణత్యాగం చేశారు. కన్నకొడుకు శవాన్ని కూడా చూసుకోలేకపోయిన భగత్‌సింగ్‌ తల్లి ఎందుకు దు:ఖించిందో తెలిస్తే మాత్రం 'ఇటువంటి తల్లులను కన్నదికదా నా భారతదేశం' అని గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి. "స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకునే యిటువంటి వారిని యింకొంతమందిని కనలేకపోయా" నని ఆ తల్లి దు:ఖించిందట.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

2 comments

  1. వర్ధంతి అని పెట్టారు పోస్ట్ లో కాస్త చూడండి 5th line

    ReplyDelete