తేజోపుంజము-ఆజాద్ - megamindsindia

Unknown
0
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని  ఏర్పరుచుకున్న  ఆంగ్లేయ దుర్మార్గపు రీతులను మీసం తిప్పి  సవాల్ విసిరిన  తేజోపుంజం అగ్నిశిఖ  "చంద్రశేఖర్ ఆజాద్" జన్మదినం సందర్భమున ... ఆయనను స్మరించుకుందాం.
ఆజాద్ జీవితం...
చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్)
మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారికి, అగరాణీదేవికి చంద్రశేఖర అజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాసిలో చదివించాలను పట్టుదల వుండేది. కాని ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోడానికి తల్లి తండ్రులు చేసిన ఒత్తిడిని భరించ లేక తన పదమూడవ ఏట ఇల్లొదిలి ముంబయి పారి పోయాడు. ముంబయిలో ఒక మురికి వాడలో నివసించాడు. బ్రతకడానికి కూలి పనిచేశాడు. అనేక కష్టాలు పడ్డాడు. అయినా ఇంటికి వెళ్ళాలనిపించ లేదు. ఇంతటి కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది. రెండేళ్ళ ఆ మురికి వాడలో నికృష్టమైన జీవనం తర్వాత 1921 లో వారణాసికి వెళ్ళిపోయి అకడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు.
అదే సమయంలో భారత స్వాతంత్ర్యం కొరకు మహాత్మా గాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం యావత్తు అట్టుడికినట్టున్నది. అప్పుడే చంద్ర శేఖర్ తాను కూడా భారత స్వాతంత్ర్యం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించు కున్నాడు. అప్పుడతని వయస్సు పదిహేనేళ్ళు మాత్రమే. ఉత్సాహంగా తాను చదువుతున సంస్కృత పాఠశాలముందే ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయ మూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తల తిక్క సమాదానాలు చెప్పాడు. నీపేరేంటని అడిగితే ఆజాద్అని, తండ్రి పేరడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లెక్కడ అని అడిగితే జైలు అని తల తిక్క సమాదానాలు చెప్పాడు. న్యాయమూర్తి అతనికి 15 రోజులు జైలు శిక్ష విధించాడు.
ఇతని తలతిక్క సమాదానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో ఏమోగాని తాను విధించిన 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్వ బోధ చేసింది. ఆ విధంగా చంద్రశేఖర్ .... చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు.
విప్లవము ... ఉద్యమాలుసవరించు
తన స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్ లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. మిత్రుడైన బిస్మిల్, అఘ్నూల్ల ఖాన్, రోషన్ సింగ్ లు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు. 1924 ఆగస్టు 9 వ తారీఖున ఈ విప్లవకారులంతా కలిసి ఆకోరి అనే వూరు వద్ద ప్రభుత్వ ధనం వున్న రైలును ఆపి దోపిడి చేశారు. కొంత కాలానికి ఆ విప్లవ కారులంతా పోలీసుల చేతికి చిక్కారు ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ తప్ప. చంద్ర శేఖర్ అజ్ఞాత వాసంలోకి వెళ్ళి పోయాడు.
రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ ఉత్తరప్రదేశ్ లోని ఓర్చా అరణ్యంలో సతార్ నది ఒడ్డున వున్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రక్కన ఓ కుటీరము నిర్మించుకుని మరిశంకర బ్రహ్మచారీ అనే సాధువుగా మారాడు. ఆ తర్వాత ప్రభుత్వం పై తాము చేసిన అన్ని కుట్రలకు ప్రణాలికలకు ఆ కుటీరమే స్థావరం అయింది. కానీ రైలు దోపిడి కేసులో పోలీసులు చంద్రశేఖర్ కొరకు గాలిస్తూనే ఉన్నారు.
చంద్రశేఖర్ ఆజాద్ 1928 సెప్టెంబరులో భగత్ సింగ్, సుఖ్ దేవ్ మొదలగు వారితో కలిసి హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. వీరందరూ కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాలనుకున్నారు. ఆ కుట్రలో భాగంగా పొరబాటున తాము గురిపెట్టిన వ్వక్తి స్కాట్ అనుకొను సాండర్స్ అనే పోలీసును కాల్చారు. కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్, రాజ్ గురు లను చనన్ సింగ్అనే పోలీసు వారిని వెంబడించి పట్టుకో గలిగాడు. ఆ ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో చంద్ర శేఖర్ ఆజాద్ కు తమ మిత్రులను కాపాడుకోడానికి చనన్ సింగ్ను కాల్చక తప్పలేదు.
తమ రహస్యజీవనంలో భాగంలో ఝాన్సీ పట్టణంలో సహ విప్లవ కారులతో కలిసి ఒక ఇంట్లో ఉన్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఝాన్సీ పట్టణానంతా గాలిస్తున్నారు. అలా నగరాన్నంతా గాలించి చివరికి ఆజాద్ ఒక గదిలో వుంటాడన్న పూర్తి నమ్మకంతో ఆ గది చుట్టు పోలీసులను మొహరించి ఒక ఉదుటున తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. కాని ఖాలీగా వున్న ఆ గది వారిని వెక్కిరించింది. ఇది జరిగింది 1929 మే నెల 2వ తారీఖున.
పార్లమెంటు పై దాడి కేసుసవరించు
Image result for chandra sekhar azad
చంద్ర శేఖర్ ఆజాద్ పార్క్, వద్ద ఆజాద్ విగ్రహం అలహాబాద్, భారతదేశం.
ఈలోపు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంటు పై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడము, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడము జరిగి పోయాయి. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కాని నెహ్రూ అజాద్ కు ఏ సమాదానము చెప్పలేదు.
దాంతో కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్పారుకులో తమ ఇతర విప్లవ మిత్రులత భగత్ సింగ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో రహస్య పోలీసులున్నారని అనుమానమొచ్చింది ఆజాద్ కి. వెంటనే తన రివ్వార్ కి పని చెప్పాడు. ముగ్గురు పోలీసులు అతని తూటాలకు బలైపోయారు. ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు అజాద్ ని వెంబడిస్తూనె ఉన్నారు. ఆజాద్ వారిని తన రివ్వాల్వర్తో నిలవరిస్తూనే ఉన్నాడు.తన తుపాకీలో ఇంకో తూటానె మిగిలి ఉంది. అది మరొకని ప్రాణం మాత్రమే తీయ గలదు. ఆ తర్వాత తాను పట్టుబడటం ఖాయం అని తెలిసిపోయింది. చీ బ్రిటిష్ వారికి తాను పట్టుబడటమఅంతే మరో క్షణం ఆలోసించ లేదు ఆజాద్ పోలీసుల వైపు గురిపెట్టబడిన తన తుపాకి తన తలవైపు మళ్ళింది. అంత 25 ఏండ్ల యువకుడు చంద్రశేఖర ఆజాద్ అమరుడయ్యాడు.. ఇది జరిగిన రోజుకి సరిగ్గా 25 రోజుల తర్వాత భగత్ సింగ్ ను ఉరి తీశారు.
చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) 1906 జూలై 23 బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో జన్మించారు . ఈయన భారతీయ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమర యోధుడు - చంద్రశేఖర్‌ అజాద్. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు...చంద్రశేఖర్ అజాద్.కా.షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన కా.చంద్రశేఖర్ అజాద్ ను మరొకమారు గుర్తుచేసుకొని ఆయన ఆశయాల సాధనలో భాగమవుదాం .
సీతారాం తివారీ, జగరాణి దేవీల ఐదో సంతానంగా జన్మించిన చంద్రశేఖర్‌ అజాద్‌ పేదరికంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుంచి ధైర్యసాహసాలు చూపేవారు. ప్రజల నుంచి మహాత్మాగాంధీ వరకు నీరాజనాలు అందుకుంటున్న రోజులవి. 1921లో గాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్‌ కూడా జనంతో కలిసి వందేమాతరం విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాల చేస్తుంటే పోలీసులు కొట్టారు. ఇది సహించలేక రాయిని గురి చూసి పోలీసులను కొట్టి అదృశ్యమయ్యాడు. బ్రిటిష్ దురాక్రమణకు వ్యతిరేకంగా 1857లో స్వాతంత్ర్య సమరజ్వాలలు ఎగసిపడినాయ. భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం సిద్ధించేవరకూ గడచిన 90 ఏళ్లలో దేశ స్వాతంత్య్రం కోసం అనేక ఉద్యమాలు సాగాయి. పంజాబ్‌లో రామసింగ్ కూకా (నాంధారీ ఉద్యమం), మహారాష్టల్రో వాసుదేవ బల్వంత్‌ఫడ్‌కే, ఛపేకర్ సోదరులు, భగత్‌సింగ్, యస్ఫతుల్లాఖాన్, రాజగురు, రాంప్రసాద్, బిస్మిల్, భగవతీచరణ్, అల్లూరి సీతారామరాజు, కుమరంభీం, చంద్రశేఖర్ అజాద్.. ఇంకా అనేకమంది వీరుల బలిదానాలు కొనసాగాయి. 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని బావరా గ్రామంలో జగరాణిదేవి, సీతారాం తివారీల కడుపుపంటగా చంద్రశేఖర్ తివారీ జన్మించాడు. ఆయనే చంద్రశేఖర్ అజాద్. 24 ఏళ్ల ప్రాయంలో స్వాతంత్య్ర సమర యజ్ఞంలో ఆహుతయ్యేవరకూ అనితర సాధ్యమైన ధైర్య సాహసాలతో పోరాటం సాగించి చిరస్మరణీయుడైనాడు ఆజాద్.15 ఏళ్లు కూడా నిండని అతి పిన్న వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం సర్వ సమర్పణకు సంసిద్ధమైనవాడు చంద్రశేఖర్ అజాద్......

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top