అస్సాం విషయంలో దేశ భద్రతే ముఖ్యం- క్రాంతిదేవ్ మిత్ర

1
అసోంలో భారతీయులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ జాబితా విడుదల కాగానే గగ్గోలు మొదలైంది. ఇదంతా బీజేపీ, ఆరెస్సెస్ ల కుట్ర అని కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, కుహనా లౌకికవాదులు గొంతు చించుకుని అరుస్తున్నారు. వీరిలో అసలు విషయం, చరిత్ర తెలియనివారే ఎక్కువ.. తెలిసినా ఓటు బ్యాంకు రాజకీయాల ప్రభావంతో వారలా మాట్లాడుతున్నారు.
అసోంలోకి దశాబ్దాలుగా చొరబడుతున్న బంగ్లాదేశీయుల కారణంగా అక్కడి జనాభా తారుమారైంది. స్థానికులు మైనారిటీలుగా, చొరబాటుదారుల మెజారిటీ వర్గీయులు అయిపోతున్నారు. తమ భాష, సంస్కృతి, భూమి, ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో అసోంలో 80వ దశాబ్దారంభంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. 1985లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కుదుర్చకున్న ఒప్పందం ఆధారంగానే విదేశీయుల ఏరివేత ప్రారంభమైంది. 1951-61 మధ్య వచ్చిన వారికి ఓటు హక్కుతో కూడిన పౌరసత్వం, 1961-71 మధ్య వచ్చిన వారికి ఓటు హక్కు లేకుండా పౌరసత్వం ఇవ్వాలని.. ఆ తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపాలని ఆ ఒప్పందం.. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎన్నార్సీ జాబితా రూపకల్పన జరిగింది. ఒప్పందం కుదిరిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస, అసోంలో అస్సాం గణ పరిషత్ ప్రభుత్వాలు ఉన్నాయి.. అయితే ఈ జాబితా విడుదలయ్యే సమయానికి కేంద్రంలో, అసోంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడటం యాదృశ్చికం..
అసోంలో అసలైన పౌరుల (భారతీయులు) గుర్తింపు చాలా పారదర్శకంగా జరిగింది. తాము స్థానికులమే అనే రుజువు సమర్పించేందుకు సుదీర్ఘ సమయమే ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న 3,29,91,384 మందిలో 2,89,83,677 మందిని భారతీయులుగా గుర్తించారు. గుర్తింపు పొందనిది 40,07,707 మంది..

Image may contain: 3 people, crowd and text
బంగ్లాదేశ్ దొరబాటు దారులకు ఆశ్రయం ఇవ్వాలని దొంగ ఏడుపులు మొదలు పెట్టినవారు కశ్మీర్ నుంచి తరిమివేయబడిన పండిట్లు, పాకిస్తాన్ నుంచి గెంటివేయబడిన హిందూ మైనారిటీల గురుంచి మాత్రం మాట్లాడరు. ఏం వీరు హిందువులు అనే వివక్షా?.. వీరి ఓట్లకు విలువ లేదా? వీరిని సమర్ధిస్తే మీకు ఓట్లు రావనే భయమా?
ఇప్పటికే అసోం, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో విదేశీయుల చొరబాట్లు కారణంగా విద్రోహ కార్యకలపాలు పెరిగిపోయాయి. సరిహద్దు నియోజకవర్గాల్లో జనాభా తారుమారైపోయింది. కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీలు ఓట్ల కోసం చొరబాటుదార్ల సమస్య రాజకీయం చేసి పబ్బం గడుపుకుంటున్నాయి. ఇప్పటికే బెంగాళీలు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు 1947 విభజన గాయం నుంచి కోలుకోలేదు. దేశ భద్రత విషయంలో ఇలాగే రాజీ పడితే భవిష్యత్తులో మరోసారి భారీ మూల్యం చెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని మరువరాదు..

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. ఈ సారి జీహాదీల చేతిలో భంగపడితే హిందువులు మిగలరు.
    గజవా-ఎ-హింద్ అంటే భారతదేశం మీద జీహాదే తీర్పు రోజు కంటే ముందు ఆఖరి జీహాద్. భారతదేశంలో సమస్త దేవాలయాలు ధ్వంసం అయితే కాని ప్రపంచం అంతం అవదు ,
    తీర్పు రోజు రాదు. ప్రపంచం అంతం అయితే కాని యిప్పటి వరకు పుట్టి చనిపోయిన ముస్లింలు జన్నత్ తో ప్రవేశించరు.జన్నత్ లో ప్రవేశం కోసం, సమస్త ముస్లిం ప్రజానీకం కయామత్ కే దిన్ ( Day of judgement) కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆ రోజుని ముందంకు జరపడం కోసం గజవా-ఎ-హింద్ , హిందుస్థాన్ ని సర్వ నాశనం చేసే ప్రణాళికలలో మునిగి ఉన్నది. ఇస్లాం ఒక డెత్ కల్ట్. జాగ్రత్త.

    ReplyDelete
Post a Comment
To Top