Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

చైనా పేరుకు మాత్రమే కమ్యూనిస్టు దేశం-China JinPing

నేతి బీరకాయలో నెయ్యి ఎంతో చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రజాస్వామ్యం అంతే.. దేశాధ్యక్షుడు ఎవరు కావాలి అనేది పొలిట్ బ్యూరో అనే ఓ ముఠా నిర్ణయిస...


నేతి బీరకాయలో నెయ్యి ఎంతో చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రజాస్వామ్యం అంతే.. దేశాధ్యక్షుడు ఎవరు కావాలి అనేది పొలిట్ బ్యూరో అనే ఓ ముఠా నిర్ణయిస్తుంది. ఈ ముఠాను బాగా చూసుకునేవాడు ఉత్తుత్తి ఓటింగ్ ద్వారా దేశాధినేత అవుతాడు.. ఈ ముఠాపై మంచి పట్టు సంపాదించిన షీ జిన్ పింగ్ ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు శాశ్వతంగా దేశాధినేతగా ఉండేందుకు ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేశాడు. 
చైనా పేరుకు మాత్రమే కమ్యూనిస్టు దేశం.. ఆచరణ అంతా పెట్టుబడిదారి విధానమే.. ఇప్పుడు ఈ పెట్టుబడిదారి కమ్యూనిస్టు దేశానికి జీవితాంత (శాశ్వత) అధ్యక్షుడు జిన్ పింగ్.. పార్టీ, సైన్యంపై ఇప్పటికే పట్టు సాధించి, అవినీతిపై యుద్దం పేరిట ఎంతో మంది ప్రత్యర్థులను జైలుకు పంపి భయోత్పాతం సృష్టంచిన జిన్ పింగ్ నియంతృత్వానికి తెర తీశాడు. మళ్లీ మావో కాలంనాటి భయోత్పాత దినాలు దాపురించాయని చైనీయులు ఆందోళనతో ఉన్నారు. వీరికి ఉన్న ఏకైన గొంతుక సోషల్ మీడియాను కూడా చైనా కమ్యూనిస్టు పార్టీయే నియంత్రిస్తోంది..
జిన్ పింగ్ చైనాకు శాశ్వత అధినేతగా ఉండటం భారత్ ప్రయోజనాలకు ఇబ్బందికమే.. ఇప్పటికే చైనా అడుగడుగునా మనకు వ్యతిరేకంగా పని చేస్తోంది. పాకిస్తాన్ లో ఎకనామిక్ కారిడార్ నిర్మించడంతో పాటు ఆ దేశ ఉగ్రవాద చర్యలను గుడ్డి సమర్ధిస్తోంది చైనా.. నేపాల్, శ్రీలంక, మాల్దీవులను ఆర్థిక సాయం పేరిట స్థావరాలు ఏర్పాటు చేసుకొని మన దేశాన్ని దిగ్భందించే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల డోక్లామ్ లో భారత సైన్యం నిలువరించడంతో భంగపడ్డ చైనా, అదను కోసం ఎదురు చూస్తోంది. ఇప్పడు నియంతగా మారుతున్న జిన్ పింగ్ పట్ల మన దేశం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

No comments