Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆర్ యస్ యస్ గురించి తెలియని  కథ

ఆర్ యస్ యస్ గురించి తెలియని  కథ  1962 స్థలం :  #శ్రీనగర్ (# కాశ్మీర్ ) శత్రువులు అతి వేగంగా  సమీపిస్తున్నారు. కాశ్మీర్ కి సైనిక సహాయ...

ఆర్ యస్ యస్ గురించి తెలియని  కథ 
Image result for rss
1962
స్థలం :  #శ్రీనగర్ (# కాశ్మీర్ )
శత్రువులు అతి వేగంగా  సమీపిస్తున్నారు. కాశ్మీర్ కి సైనిక సహాయం అత్యంత అవసరం.
ఎట్టి పరిస్థితులలోను శ్రీనగర్ విమానాశ్రయం  శత్రువుల చేత చిక్కకూడదని డిల్లీ లోని సైనిక కార్యాలయం నుండి సందేశం  వచ్చింది.  పట్టణం శత్రువుల చేతచిక్కినా పరవాలేదు కానీ, విమానాశ్రయం  ఎట్టి పరిస్థితులలో కూడా శత్రువు  చేత  చిక్కకూడదని సందేశం.
"విమానాశ్రయం పూర్తిగా మంచుతో కప్పబడిఉంది. విమానాలు దిగడం చాలా కష్టం" అని శ్రీనగర్ నుండి ప్రత్యుత్తరం  వచ్చింది.
"అత్యవసరంగా కూలీలను పెట్టి మంచును తొలగించండి, ఎంత మంది కూలీలను నియోగించిన సరే, ఎంత  ఖర్చయినా సరే, "
"కూలీలు దొరకడం లేదు. ముస్లిం కూలీలపై ఇటువంటి సమయంలో భరోసా ఉంచలేము."
ఇటువంటి సమయములో సైన్యాధ్యక్షుడికి సంఘ్ గుర్తు వచ్చింది.
అప్పుడు  రాత్రి 11 గంటలయింది. ఒక సైనిక వాహనం సంఘ కార్యాలయం ముందు వచ్చి నిలిచింది. దానిలో నుండి ఒక అధికారి దిగారు.
కార్యాలయంలో ప్రముఖ స్వయంసేవకుల సమావేశము జరుగుతున్నది. ప్రేమనాథ్ డోగ్రా, అర్జున్ జీ లు  అక్కడే ఉన్నారు..
సైన్యాధికారి పరిస్థితిని వివరించారు. "మీరు విమనాశ్రయము లో పేరుకున్న మంచును తొలగించే పని చేయగలరా?" అని అడిగారు.
"తప్పకుండా! ఎంత మంది సహాయకులు కావాలి?" అని అర్జున్ జీ అడిగారు.
"కనీసం 150 మంది కావాలి, వారితో 3,4 గంటలలో మంచు తొలగించగలం"
"మేము 600 మంది స్వయంసేవకులను సమకూర్చగలం" అని అర్జున్ జీ అన్నారు.
"ఇంత రాత్రి వేళ అంతమందా...." అని సైన్యాధికారి ఆశ్చర్యపోయారు.
"మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వ్యవస్థ చేయండి. 45 నిమిషాలలో మేము తయారుగా వుంటాము."
సంఘ పద్ధతి ప్రకారం అనుకున్న సమయానికి 600 మంది తయారై కలసి వెళ్ళిపోయారు.
"మంచును తొలగించే పని ప్రారంభమయింది. విమానాలు ఎప్పుడయినా రావచ్చును." అని డిల్లీ కి సందేశం పంపబడింది.
"ఇంత తొందరగా కూలీలు దొరికారా"
"అవును, కాని కూలీలు కారు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ సభ్యులు." 
రాత్రి గం.1.30 ని. లకు వారు పనిలో దిగారు. అక్టోబర్ 26 వ తేదీ ఉదయం 1వ  సిఖ్ రెజిమెంటుకు చెందిన 329 మంది సైనికులు విమానం నుండి శ్రీనగర్ లో దిగి అత్యంత ప్రేమతో స్వయంసేవకులను ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ఏముంది, ఒకటి తర్వాత ఒకటి 8 విమానాలు దిగాయి.
వాటన్నిటిలో అస్త శస్త్రాలు ఉన్నాయి. స్వయంసేవకులు వాటిని దించి నిర్దేశించిన స్థలంలో ఉంచడానికి సహాయం  చేశారు.
విమానాశ్రయం శత్రువుల చేతిలో చిక్కకుండా రక్షింపబడింది. దాని వలన మనకు ఎంతో ప్రయోజనం కలిగింది.
విమాన బాట (రన్వే)   ని కూడా వెడల్పు చేయవలసి రావడం  వలన విశ్రమించకుండా స్వయంసేవకులు వెంటనే పనిలోకి దిగారు.
ఆధారం: న ఫూల్ చడే న దీప్ జలే (పుస్తకం)

No comments