Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

2019 ఎన్నికలు - megamindsindia

""Am not saying Vote for BJP,Am saying only Vote for Future India""   2019 సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రం : ...

""Am not saying Vote for BJP,Am saying only Vote for Future India""
 Image result for elections 2019

2019 సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రం :
బీజేపీ ఒకవైపు.. కాంగ్రెస్, లెఫ్ట్, బీఎస్పీ, ఎస్పీ, టీడీపీ, ఆర్జేడీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ, జేడీయూ, ఎన్డీటీవీ, ఏబీపీ న్యూస్, స్క్రోల్ , ది వైర్, ది ప్రింట్, అవార్డు వాపసీ గ్యాంగ్, జేఎన్యూ, ఏఎంయూ, పాకిస్థాన్, చైనా.. ఇవన్నీ మరోవైపు.
ముస్లిములు ఎలాగూ బీజేపీని గద్దె దించాలనే కోరుకుంటారు.. విచిత్రంగా కొందరు హిందువులుగా చెప్పుకునేవారు కూడా ఇదేరకమైన కోరిక వ్యక్తం చేస్తుంటారు. ఇద్దరి కోరిక వెనుక ఉన్న కారణాల మధ్య వైరుధ్యం మాత్రం కాస్త ఓపికగా పరిశీలించి తెసులుకోవాల్సిందే. 
- పెట్రోల్ రేట్లు పెరిగిపోయినందుకు హిందువు బాధపడితే రోహింగ్యాలకు దేశంలో స్థిరనివాసం ఏర్పాటు చేయకపోవడం వల్ల ముస్లిం మోడీపై కోపంగా ఉన్నాడు.
- ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించే అవకాశం, హక్కు నీకు ఈ  ప్రజాస్వామ్యం కల్పిస్తోంది. దాన్ని ఉపయోగించుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ ఈరకమైన వ్యతిరేకత వ్యక్తం చేయడం ద్వారా నీవు ఎటువంటి రాజకీయ నాయకులకు, పార్టీలకు లబ్ది చేకూర్చుతున్నావో కాస్త విచక్షణతో ఆలోచించు.
ములాయం, లాలూ, మాయావతి, రాహుల్, కేజ్రీవాల్, మమతా, మరియు లెఫ్ట్ పార్టీలు మోడీ ప్రభుత్వం కన్నా భేషుగ్గా పనిచేస్తాయని నమ్ముతున్నావా? నీ గుండెలమీద చేయి వేసుకుని చెప్పగలవా?
మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, సిద్ధరామయ్య, చంద్రబాబు వంటివారు ముఖ్యమంత్రులుగా  మోడీ గుజరాత్ రాష్ట్రానికి అందించిన పాలన కంటే గొప్ప పాలన అందించగలరు అని నిజంగా భావిస్తున్నావా? నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో!
లాలూ, ములాయం సింగ్.. వీరిద్దరూ రాజకీయాల్లో అడుగుపెట్టే సమయానికి ఇల్లుగడవని దుఃస్థితి వారిది. సైకిల్ కానీ, లాంతరు కానీ కొనడానికి వీలులేని ఆర్ధికపరమైన గడ్డు పరిస్థితి. కుల రాజకీయాల ద్వారా నేను కోట్లాది రూపాయలు పోగుచేసుకున్నారు. రాంగోపాల్ యాదవ్ ఇప్పుడు తన సొంత చార్టర్డ్ విమానంలో విహరిస్తున్నాడు. శివపాల్ యాదవ్ ఆడి కారు లేనిదే కాలు బయటపెట్టడు. ఈ ధనం ఎక్కడిది? వారు నరేంద్ర మోడీ కన్నా ఉత్తములా? అడుగు ఒకసారి నీ మనసాక్షిని!
ఈరోజు ధనవంతులుగా ఉన్న సోనియా గాంధీ సంతానం, అల్లుడు.. పాలనలో మోడీ కన్నా గొప్పవారు? ప్రశ్నించు నీ మనస్సాక్షిని!
35 ఏళ్ల నుండి కొన్ని రాష్ట్రాలను ఏకచత్రాధిపత్యంగా నిరంకుశంగా నియంతృత్వంగా పాలిస్తున్న కమ్యూనిస్టుల పాలన మోడీ పాలన కంటే గొప్పదా? బదులివ్వమను నీ మనస్సాక్షిని!
150 కళాశాలలకు మరియు 500 పాఠశాలలకు ఉచిత వైఫై, సీసీటీవీ సౌకర్యం  అంటూ అడ్వార్టైజ్మెంట్ల ద్వారా 5 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీది మోడీ పాలన కంటే గొప్పదా? ప్రశ్నించు నీ మనస్సాక్షిని!
కాన్షీరాంతో పాటు రాజకీయాల్లో ప్రవేశించిన మాయావతి.. అప్పట్లో సైకిల్ మీద రాజకీయ ప్రచారం చేసేవారు. ఇంట్లో లాంతరులో కిరోసిన్ కొనడానికి కూడా గతిలేని పరిస్థితి నాడు. కానీ ఇప్పుడు? వేసుకునే చెప్పులు కూడా విదేశాల నుండి విమానాల ద్వారా వస్తున్నాయి. మాయావతి తమ్ముడు ఇప్పుడు 497 కంపెనీలకు అధిపతి. పాలనలో మోడీ కన్నా వారే గొప్పవారిగా కనిపిస్తున్నారా నీ మనస్సాక్షికి?
ప్రజలుగా మీరు మోడీని నిర్ధ్వంద్వముగా వ్యతిరేకించవచ్చు.. కానీ మీకు ఇంతకన్నా ఇతర మంచి అవకాశం నిజంగా ఉందా? నిజంగా ఉంది అని మీరు భావిస్తే.. ఆ ప్రత్నామ్నాయం ఏమిటో ఈ దేశానికి తెలియజేయండి. మీరు మోడీకి ప్రత్యామ్నాయంగా భావించిన వారు దేశాన్ని ఎంతవరకు లూటీ చేయవచ్చో అనేది తెలియజేయండి. వారి ద్వారా విదేశీయులు ఈ దేశాన్ని ఎంతవరకు లూటీ చేయొచ్చో తెలపండి.
కులమతాల వైరుధ్యాలు పక్కనే నెట్టి దేశం కోసం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఈ కులమతాల సెంటిమెంట్ల ఆధారం చేసుకునే దోపిడీదారులు మన ద్వారా దేశాన్ని దోచుకుంటున్నారు.
- నేను మోడీ పాలనను ఎందుకు ఇష్టపడుతున్నానో చెప్పలేను కానీ కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీలను ఎందుకు వ్యతిరేకిస్తాను అనేదానికి నాదగ్గర స్పష్టమైన సమాధానము ఉంది.
- దేశ పాలనలో మంచి రోజులు (అచ్చే దిన్) వస్తాయో రావో నాకు తెలియదు. కానీ మోడీ పాలనకు కనీసం దరిదాపుల్లోకి వచ్చే ఇతర పాలకుడు లేడు అని మాత్రం ధృడంగా చెప్పగలను.
- మోడీ దేశాన్ని హైందవ దేశంగా మార్చడంలో విజయం సాధిస్తాడో లేదో చెప్పలేను.. కానీ అతడు భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలుపుతాడు అని మాత్రం చెప్పగలను.
చివరిగా ఒక్క మాట!
ఈ సందేశాన్ని పంపిన వ్యక్తి మోదీకి వీరాభిమాని, ఆరాధకుడు అని అనుకోండి పర్వాలేదు. కానీ ఇందులో పేర్కొన్న అంశాల పట్ల ఒకసారి దీర్ఘంగా ఆలోచించండి. దేవుడు మీకు ఆలోచనా శక్తిని ప్రసాదించాడు గనుక.
మన గురించి, మన మాతృభూమి గురించి కూడా ఆలోచించాల్సిన తరుణం ఇది.
జై హింద్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia 

No comments