Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేవాలయాల విధ్వంసం‌ - మతమార్పిడులు - పర్యవసానం - megaminds

మూడు ముఖ్యమైన దేవాలయాలు విదెశీయుల తో దోచుకోబడి ‌ విధ్వంసం అయ్యాయి . ప్రతిఘటనలు జరుగు తూనే ఉన్నాయి . మధురలో ‌ మసీదు ప్రక్కన...


మూడు ముఖ్యమైన దేవాలయాలు విదెశీయుల తో దోచుకోబడివిధ్వంసం అయ్యాయి. ప్రతిఘటనలు జరుగు తూనే ఉన్నాయి. మధురలోమసీదు ప్రక్కనే కృష్ణాలయం నిర్మాణం జరిగింది

కాశీ లో మూడవ వంతు మసీదు వదిలి ఒక‌వంతు దేవాలయం‌నిర్మాణం అయ్యింది. అయోధ్య ఊరంతా రామా లయాలు ఉన్నా జన్మస్థానం‌లో‌ మరో కట్టడం‌వచ్చింది. వివేకానందుడు కూడా అక్కడ కన్నీరు‌పెట్టినట్లుగా చరిత్ర చెప్పింది.

మత మార్పిడులు ప్రారంభం‌లో భయపెట్టి, ప్రలోభపెట్టి చేసారు. ఏ దేవుడికి నమస్కరించినా ఒకే దేవుడే కదా అనే హిందూ ఆలోచనతో ప్రారంభము లో మారారు. మనవారు అసహ్యించుకొని దూరం గా చూసారు. విదేశీ రాజులు ఈ మతం‌మారిన భారతీయులకు రాయితీలు ఇవ్వడమే కాకుండా హిందువుల పట్ల ద్వేషం కూడా పెంచారు. తరువాత విదేశీ దురాక్రమణ దారులు అనేక ఊర్లలో ధ్వంసం చేసారు. అరుణ్ శౌరి రాసిన పుస్తకం లో 5000 దేవాలయాలను గుర్తించారు.
ఈ విరోధి భావం ఇంగ్లీషువాడు పెంచి ఇస్లాం లోకి మతం మారిన భారతీయులను మిగిలిన‌ భారతీయులకు మధ్య విద్వేషం పెంచి వారిని‌ మొఘలుల, లోడీల‌ మొదలైన వారి వారసులుగా నమ్మబలికారు. నిజానికి‌ వారు ఇక్కడి వారి సంతతి.‌ విదేశీ రాజులు వారికి కూడా శత్రువులే. వారికి మిగిలిన ‌భారతీయులకు శత్రుత్వం‌‌ కల్పిస్తే వారి పరిపాలన సులువు అవుతుందని‌ వారిని భారతీయత(హిందుత్వం) నుండి విడగొట్టడమే కాకుండా వేరు దేశం కొరకు రెచ్చగొట్టారు. స్వతంత్ర భారత దేశం లో కూడా వారి వేరు కుంపటిని కాంగ్రెస్ పెంచి పోషింంచింది.
స్వతంత్ర జాతి లో అవమాన చిహ్నాలు తొలగించాలనే ప్రయత్నం సర్దార్ పటేల్ ద్వారా నెహ్రు వ్యతిరేకతల మధ్య‌కూడా సోమనాథ్ లో‌ పూర్తి చేసాడే తప్ప‌ ఉత్తరప్రదేశ్ లో చేయలేదు.
అయోధ్య విషయం స్థానికంగా ఉద్యమాలు జరుగుతున్నా దేశమంతా ఉద్యమం విశ్వహిందూ పరిషత్ చేపట్టాకనే ప్రారంభం అయ్యింది.అయోధ్య రామజన్మభూమి దేవాలయం దేశంమొత్తానికి చెందిన విషయం.
మన జాతికి కళంకం కలిగించిన విదేశీ దురాక్రమణ దారుడు బాబర్అయోధ్య ఆలయం భగ్నం చేసాడు. ఇది మన ఈ రాష్ట్రీయ అవమానచిహ్నం. అక్కడ తరాల తరబడి పోరాటం సాగుతూంది. ఆ కట్టడం లోరామలల్లా ను పూజారిమాత్రమే వెళ్ళి పూజలు చేస్తున్నాడు. ఉద్యమ ఫలితంగా అందరు దర్శించుకోవడానికి‌తలుపులు తెరిచారు. ఈ దేశ అవమాన చిహ్నం తొలగించాలనే ఉద్యమాన్ని విహింప దేశవ్యాప్తం చేసింది.
కులాల కుంపటులను ఆర్పివేయడా నికి, దేశం ఏకం కావడానికీ ఈ ఉద్యమాన్ని జాగరణ చేసి తలపెట్టిన పరిక్రమను రాజకీయాల కొరకు ములాయిం సింగ్ కరసేవకుల రక్తం కళ్ళచూసాడు. అనేకమంది తూటాలకు ఆహుతి అయ్యారు.
ఉత్తర, దక్షిణాలు, వేరు ప్రాంతాలు, వేరు భాషలు, కులాల కుమ్ములాటలు అన్నీ మరచిపోయి దేశం‌ఒక్క‌తాటిపై వచ్చింది. బాబరీ యాక్షన్ కమిటి మాత్రం ఏళ్ళతరబడి నమాజ్ చేయని, రాముడి పూజలు జరిగే దేవాలయాన్ని బాబరీ మసీదు అని వ్యతిరేక ప్రచారం మొదలెట్టింది.
పరిషత్ నాయకులు, ఆలయకమిటి, మహంత్లు కలిసి రామాలయ నిర్మాణం కొరకు జిల్లా కి ఒక‌ఇటుక చొప్పున అన్ని జిల్లాలలో అన్ని ముఖ్య కేంద్రాలలో యావత్ జాతీయ సమాజం ‌పూజించిన రామ శిలలు అయోధ్యకు చేరాయి. జాతికి‌ ఆదర్శమూర్తి శ్రీరామ చంద్రుడి భవ్యాలయనిర్మాణం కొరకు, తరతరాల విదేశీ దురాక్రమణ దారుడి అవమాన చిహ్నం‌ చెరిపేయ డానికి, జాతీయ ఏకాత్మతను సాధించడానికి పరషత్, సంఘం‌ పంచ భూతాలలొ ఒకటి అయిన మట్టి ఇటుకలను రామ శిల పేరుతో దేశాన్నంతా కదలించారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments