నిజంగా కమ్యునిష్ట్ లు ఇంత దుర్మార్గులా? - megamindsindia

కమ్యూనిస్టులు గని కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ కార్మికుల్లో అసమర్థుడు, తరచూ తాగి పడుకునే ఒక వృద్ధుడున్నాడు. కమ్యూనిస్టులు అతడిలో  'వర్గ చైతన్యాన్ని' నింపుదామని ఎంత ప్రయత్నించినా ఆ కార్మికుడు మామూలుగా మనందరిలో ఉండే చైతన్యమూ లేకుండా నిద్రిస్తుండేవాడు. అందువల్ల ఆ వృద్ధుడు తమ ఉద్యమానికి ఉపయోగపడే అవకాశం లేదని తీర్మానించుకున్నారు కమ్యూనిస్టులు. ఈలోగా ఆ వృద్ధుడు ఒకరోజున విపరీతంగా తాగి , ఆ మత్తులో ఒక లారీ కింద పడి చనిపోయాడు. కమ్యూనిస్టులు ఈ సంఘటనను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటారు.  ' కాపిటలిస్ట్ రాక్షస యజమానుల కుట్ర మూలానే ఈ మన కార్మికుడు మృతి చెందాడు. ఇతడి త్యాగం ఊరికేపోదు. మన ఉద్యమం మరింత బలపడి తీరుతుంది ' అంటూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ' ఇతడు తన వ్యసనం కొద్దీ  తప్పతాగి మరణించాడు గదా! మధ్యలో ఈ కాపిటలిస్ట్ ప్రసక్తి ఏమిటి? ' అని ఓ బుల్లి కామ్రేడ్ కు అనుమానం  వచ్చి పెద్ద కామ్రేడ్ ను అడగ్గా, ' నీకు తెలీదులే, నువ్వు ఊరుకో! బ్రతికున్న కాలంలో ఈ నిరర్ధకుడు మన ఉద్యమానికి ఎలాంటి సహాయం చేయలేకపోయాడు. ఈ బహిరంగసభ ఏర్పాటుకు , ఆ విధంగా మన మహోద్యమానికి తన మరణం ద్వారా ఇలా తోడ్పడుతున్నందున ఈనాడు అతడి  జీవితం ధన్యమైంది. అదే చాలు' అని తన అనుచరుడి బుర్రను మరింత పాడు చేసి పంపించేశాడు.
మహారాష్ట్రలో రైతులను ప్రభుత్వం మీద రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుందామని ఈమధ్య కమ్మీలు ప్రయత్నం చేసి మహాపాదయాత్ర నిర్వహించారు. (కానీ మహారాష్ట్రలోని బిజెపి  ప్రభుత్వం ఆ పాదయాత్రలో పాల్గొన్న రైతుల కోరికలకు ఆమోదం తెలపడానికి సిద్ధమైంది. అది వేరే సంగతి)  రైతుల చేతులకు తమ ఎర్రజెండాను, తలకు ఎర్రటోపీలు ఇచ్చారుగానీ, పాదయాత్రలో పాల్గొనే రైతుల కాళ్ళకు చెప్పులున్నాయో లేదో  మాత్రం చూసుకోలేదు. ఎండ వేడికి కాళ్ళచర్మం కాలి బొబ్బలెక్కితే, వాళ్ళ పాదాలను ఫోటోలు తీసి ఫేస్ బుక్ కు అప్ లోడ్ చేశారు వాళ్ళ సానుభూతిపరులు. రైతుల కాలిబొబ్బలనూ తమ ఉద్యమానికి మెట్లుగా మార్చుకోవడానికీ కమ్యూనిస్టులు వెనకాడలేదు.
కమ్యూనిస్టులకు తాగుబోతు వృద్ధుడి చావైనా, రైతుల కాలిబొబ్బలైనా తమ ఉద్యమానికి ఉపయోగపడితే చాలు.ఇది కమ్యూనిస్టులు తీరు
అనంత ఆదిత్య

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments