Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆ నలుగురు.. లేకుంటే ఈశాన్య రాష్ట్రాలు లేవు ఎవరా నలుగురు? - megamindsindia

  ఆ రోజు గౌహతి లో సంఘ ఉన్నతస్థాయి సమావేశం. ఆనాటి ఆరెస్సెస్ సర్ కార్యవాహ శ్రీ హొ.వె. శేషాద్రి గారు ఆ రోజు సమావేశం నిర్వహించబోతున్నారు. సం...


  ఆ రోజు గౌహతి లో సంఘ ఉన్నతస్థాయి సమావేశం. ఆనాటి ఆరెస్సెస్ సర్ కార్యవాహ శ్రీ హొ.వె. శేషాద్రి గారు ఆ రోజు సమావేశం నిర్వహించబోతున్నారు. సంఘంలో పద్ధతి ప్రకారం సమావేశ ప్రారంభానికి ముందు వైయక్తిక్ గీత్ పాడటానికి ఒక యువకుడు ముందుకొచ్చాడు. అతడు కూడా ప్రచారకే. తన్మయత్వంతో  ' ధనో ధన్యో  పుష్పే బారా... ' అంటూ బెంగాలీ కవి శ్రీ ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన పాటను పాడసాగాడు. సమావేశంలో ఉన్నవాళ్ళంతా సమ్మోహితులైపోయి వింటున్నారు. పాట సా..గు..తూ.. ఉండటంతో సమయపాలనకు, క్రమశిక్షణకు పేరొందిన శ్రీ శేషాద్రిజీ కి  అసహనం మొదలైంది. చూసినంతసేపు చూశారు. పాట ముగియడం లేదు. చివరకు ' ఇక చాలు ,ఆపు ' అనేశారు. అందరికీ రసభంగం అయింది. అయితే ఆ యువ ప్రచారక్ కళ్ళలో నీళ్ళు. ఆ రాత్రంతా అతడు నిద్రపోలేదు కూడా.
   మరునాడు ఉదయం శ్రీ శేషాద్రి గారికి ఆ సంఘటన మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. అస్సాంలో పనిచేస్తున్న న. నాగరాజు అనే కర్ణాటక కు చెందిన ప్రచారక్ ను పిల్చి, ' ఆ యువ ప్రచారక్ ను గీత్  ఆపమని చెప్పాను. అతడికి బాధ కలిగి ఉండవచ్చు గదా? ' అనడిగారు. ఆ ప్రచారక్ ఏడ్చిఏడ్చి రాత్రంతా నిద్రే పోలేదని చెప్పాడు. శ్రీ శేషాద్రిజీ కి బాధ కలిగి ,  అతడిని పిలువు. ఇపుడు పూర్తి పాట వినాలి అన్నారు. ఆ ప్రచారక్ రాగానే పూర్తి పాట పాడమన్నారు శ్రీ శేషాద్రిజీ.
   ఆ ప్రచారక్  ' ధనో ధన్యో పుష్పే బారా... అమాదర్  ఇ  బసుంధరా... ' అంటూ ఆ పాటను తన్మయత్వంతో పాడసాగాడు. చుట్టుపక్కల ఉన్నవారంతా అక్కడికి చేరుకున్నారు. కళ్ళు మూసుకుని పాట పాడుతున్న ఆ ప్రచారక్ పదకొండు నిమిషాల పాటు సాగే పాటను ముగించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న శ్రీ శేషాద్రి జీ కళ్ళలో నీరు నిండి ఉండటం చూసి విస్తుపోయాడు. వెంటనే శ్రీ శేషాద్రిజీ తమ రెండు చేతులతో అతడి భుజాలను పట్టుకుని , ' నిన్న జరిగిన సంఘటనకు బాధ పడకు. స్వయంసేవకుడికి సమయపాలన ముఖ్యం ' అన్నారు.
   ఈ ఘటన జరిగిన అయిదు సంవత్సరాల తర్వాత , అదే శేషాద్రి గారు ఆ యువ ప్రచారక్ గురించి   ' పాంచజన్య ' హిందీ వారపత్రికలో  శ్రద్ధాంజలి వ్యాసం వ్రాయాల్సివచ్చింది. ఆ యువకుడు త్రిపుర జిల్లా ప్రచారక్ శుభంకర చక్రవర్తి. అతడి గురించే కాదు. ఆరోజు శ్రీ శేషాద్రిజీ , పూర్వాంచల క్షేత్ర కార్యవాహ శ్రీ శ్యామల కాంతిసేన్ గుప్తా ( 67 ఏళ్ళు ), దక్షిణ అస్సాం ప్రాంత శారీరక ప్రముఖ్ శ్రీ దినేంద్రనాథ డే (51 ఏళ్ళు ) , అగర్తలా విభాగ్ ప్రచారక్  శ్రీ సుధామయ దత్ ( 51 ఏళ్ళు ) గారల గురించి కూడా ఆ వ్యాసంలో ఎంతో భావపూరితంగా వ్రాశారు. బహుశా శ్రీ శేషాద్రి గారికి ఆరోజు కూడా  ' ధనో ధన్యో పుష్పే బారా...' వినిపించినట్లయిందేమో!
                   1999 ఆగష్ట్  6.  పై నలుగురు కార్యకర్తలు  త్రిపుర లోని కాంచన్ బేడా వనవాసీ క్షేత్రానికి పర్యటనకు బయల్దేరారు. కాంచన్ బేడా లో ఆరెస్సెస్ సేవా ప్రకల్పం ఒకటి ప్రారంభమై , వనవాసీ పిల్లల విద్య , వైద్యం కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తుండేది. దాంతో కాంచన్ బేడా లో క్రైస్తవ మిషనరీల ప్రభావం తగ్గింది. అందువల్ల కార్యకర్తలు కాంచన్ బేడా కు పదేపదే వెళ్ళాల్సి వస్తుండేది. అలా ఆరోజు అగర్తలా నుండి బయల్దేరిన వీళ్ళు అటు వనవాసీ క్షేత్రానికీ చేరలేదు.ఇటు వెనక్కూ తిరిగి రాలేదు.నాలుగు రోజులు గడిచాయి. అయిదవ రోజు అంటే ఆగష్ట్ 11 న త్రిపుర కు చెందిన తీవ్రవాద సంస్థ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ( NLFT ), నలుగురు  ఆరెస్సెస్ కార్యకర్తలను తాను అపహరించినట్లు ప్రకటించుకుంది. భారత్ - బంగ్లా సరిహద్దులోని చిట్టగాంగ్ కొండలను తన స్థావరంగా మార్చుకున్న ఈ NLFT  ప్రత్యేక త్రిపుర రాష్ట్రం కోసం తీవ్రవాద కార్యకలాపాలను జరిపేది. వాళ్ళ డిమాండ్ కు బంగ్లాదేశ్ కు చెందిన తీవ్రవాద సంస్థలు, క్రైస్తవ మిషనరీలు అండదండలను, ప్రోత్సాహాన్ని అందించేవి. తమ బందీలను విడుదల చేయాలంటే వెంటనే త్రిపుర రైఫిల్స్ ను రద్దు చేయాలని ఆ తీవ్రవాద సంస్థ షరతును ప్రకటించింది.
   కేంద్రంలో ఆనాడు వాజ్ పాయి ప్రభుత్వం ఉండింది. త్రిపుర లో ఆనాడు కూడా నిరాడంబర ముఖ్యమంత్రి అని పేరొందిన మాణిక్ సర్కార్ నాయకత్వంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండేది. ఆ కమ్యూనిస్టు ప్రభుత్వానికి బందీలు ఆరెస్సెస్ వారనే ఉదాసీనత ఉండిందో ఏమో? ఏమీ జరగలేదన్నట్లు మౌనానికి జారుకుంది. దేశమంతటా ఆరెస్సెస్ కార్యకర్తలు బందీలను విడుదల చేయాలని ధర్నాలు చేశారు. కమ్యూనిస్టులేమో  'అపహరణ ' మంచిదే అనుకున్నారు. ఇలా ధర్నాలు, ప్రదర్శనలతో ఒక సంవత్సరం గడిచిపోయింది.
    సరిగ్గా2000 ఆగష్ట్ 6 న బాప్టిస్ట్ చర్చి అండదండలు, ప్రోత్సాహం ఉన్న NLFT తీవ్రవాదులు బందీల విడుదలకు  ఆరెస్సెస్  2 కోట్ల రూపాయలను ఇవ్వాలని షరతును పెట్టారు.  హో.వె. శేషాద్రి జీ స్వయంగా ఢిల్లి లోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో కూర్చున్నారు. దేశమంతటా వేలాది మంది , తాము 2 కోట్ల రూపాయలను ఇస్తామని ముందుకొచ్చారు. అయితే అప్పటి సర్ సంఘచాలకులు శ్రీ కు.సి. సుదర్శన్ జీ  ' దుష్టులకు డబ్బు అందించే దుష్ట పరంపరను మేము ప్రోత్సహించలేము ' అని ప్రకటించారు.  బందీలు కూడా తమ ప్రాణాలకోసం సంఘం తీవ్రవాదులకు డబ్బులివ్వడానికి ఇష్టపడకపోగా తమ ప్రాణాలను బలిదానం చేయడానికే మొగ్గు చూపారు.అప్పటికి అపహరణకారులకు (NLFTతీవ్రవాదులు) ఆరెస్సెస్ వాళ్ళు ఎలాంటివారో అర్థమైపోయింది. దేశమంతటా ఆరెస్సెస్ కార్యకర్తలు తమ గుండెలను రాయి చేసుకున్నారు. చివరకు వాళ్ళంతా నిరీక్షించిన సమాచారం 2001 జులై 28 న వెలువడింది. ఆ నలుగురు ( శ్యామలకాంతిసేన్ గుప్తా, దినేంద్రనాథ డే ,  సుధామయ దత్, శుభంకర చక్రవర్తి ) కార్యకర్తల కుళ్ళిపోయిన శరీరాలు అడవిలో దొరికాయి. వైద్యపరీక్షలు ఆ శరీరాలను ఆరు నెలల ముందే  అంటే 2000 డిశంబర్ లోనే హత్య  జరిగింది అని నిర్ధారించాయి. అలా ఆ నలుగురు స్వయంసేవకుల బలిదానం జరిగింది.

 మీ అనంత ఆదిత్య

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments