Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశం మంతా మనది ఆనుకుంటే ఎక్కడికైనా వెళ్తాము, విజయం సాధిస్తాము. - megaminds

స్వర్గీయ శ్రీరామ్ సాఠేజి, మాననీయ సురేంద్ర రెడ్డి గారు భాగ్యనగర్ ప్రచారకులు గా ఉన్న సమయం లో మన పోచంపల్లి నుండి ఒక సామాన్య కుటుంబం లో పుట్టి...

స్వర్గీయ శ్రీరామ్ సాఠేజి, మాననీయ సురేంద్ర రెడ్డి గారు భాగ్యనగర్ ప్రచారకులు గా ఉన్న సమయం లో మన పోచంపల్లి నుండి ఒక సామాన్య కుటుంబం లో పుట్టి భాగ్యనగర్ లో టీచర్ గా పని చేస్తున్న శ్రీ కొయ్యడ శ్రీధర్ అనే యువకుడు ప్రచారక్ గా వచ్చారు. వారు కరీంనగర్, వరంగల్ లో పని చేసాక మాననీయ సోమయ్య గారు వారిని కొండ కోనల్లో వనవాసుల పనికోసం పంపించారు. వారు బ్యాగ్ ఎత్తుకొని విశాఖ్ జిల్లా పాడేరు లో పని చేయడానికి వెళ్లారు.
అక్కడ వారికి ఎవ్వరూ తెలియదు. అప్పట్లో సంఘం కూడా ఆ కొండల్ని చేరలేదు. కొత్త క్షేత్రం, కొత్త పని, పరిచయాలు అంతగా లేవు. పాడేరు లాంటి తాలూకా కేంద్రం కాకుండా దగ్గరలో మఠం అనే గ్రామం ఎంచుకున్నారు. ముందే మన హైదరాబాద్ తెలుగు, కొంచం హిందీ, కొంచం తెలుగు కలిపి ముద్ద ముద్ద గా మాట్లాడే శ్రీదర్జీ కొండల్లో ఉండే వారితో పనికి వెళ్లారు. వీరి తెల్ల పంచె, లాల్చీ ఎవ్వరూ దగ్గరికి రాలేదు. వారు మాట్లాడటం మొదలెడితే ఉర్దూ సామెతలు, అక్కడెవ్వరికీ అర్థం కావు.
వూర్లో దంపతులు పనికి పోతే బట్టలు సరిగా లేని పిల్లలు, చింపిరి జుట్టుతో, చీమిడి ముక్కు తో పిల్లలని దగ్గర తీసుకున్నారు. వెంట తీసుకెళ్లిన బిస్కట్లు ఇచ్చారు. వారి జుట్టు దువ్వి, తీసుకెళ్లిన బొమ్మలతోఆడిస్తూ కూర్చున్నారు. సాయంత్రం అయ్యి దంపతులు వచ్చి వారి పిల్లల్ని తీసుకెళ్తే చెట్టు కింద ఒక దుప్పటి పరుచుకొని పడుకున్నారు.
మరుసటి రోజు పిల్లలు వారు పిలవ కుండానే వచ్చేసారు. ఆ చెట్టు నీడన వారితో కబుర్లు, ఆటలు. తీసుకెళ్లిన బ్రెడ్ అయిపోయింది. భగవంతుడా నీవే రాత్రికి తిండిపెట్టాలి అనుకుని, ఆనందం గా వారితో కబడ్డీ ఆడుతున్నారు. సాయంత్రం చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్య పడ్డారు. ఆ పిల్లలితో ఈ పెద్దయనకు ఏమి పని? అదే అడిగారు.
ఏమి చెయ్యను? మీరెవరూ మాట్లాడారు, వాళ్ళే ఆడుకుంటున్నారు అంటూ నవ్వుతో చెప్పారు. మరి తిండి ఎక్కడ తింటున్నారు? అడిగారు.
మీరు పెడితే కదా అన్నారు. వారు రాగి రొట్టెలు, తేనె ఇచ్చారు. ఈ తిండి వారికి తెలియదు. వాళ్ళు తింటుంటే తనూ చూసి నేర్చుకున్నారు. మచ్య గుండం అనే ఏరు దగ్గరలో పారుతుంది. అందులో స్నానం , బట్టలుతుక్కోవడం. ఒక గుడిసె పంచ లో పడుకొనిచ్చారు. ఆ చెట్టు కంటే ఇది సేఫ్. పాములు, తేళ్ళు తిరుగుతుండే నేల.
మీరెలా ఉన్నారు ? అని మేము వారిని తర్వాత అడిగితే వాళ్ళ లాగే అని నవ్వుతూ సమాధానం ఇచ్చే వారి ప్రసన్న వదనం చూస్తే ఈ భాగ్యనగర్ వాసి ఆ కొండ కోనల్లో వారితో కలిసిపోయి జీవితాంతం ఉన్నారంటే తల్లి భారతిని ఏంత గొప్పగా ఆరాధించారో అర్థం అవుతుంది. నాకళ్ళు కారుతున్నాయి. నేను రేపు వ్రాస్తాను.
నమస్సులతో మీ నరసింహ మూర్తి. వారితో మీ పరిచయం, అనుభవాలు కామెంట్లో వ్రాయండి. అందరికీ తెలుస్తాయి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments