దేశం లో యువకులు మారుతున్నారు- 2 - megaminds

0

నిన్నటి వ్యాసం లో సంకుచిత రాజకీయ, మత, వర్గ నాయకులనుండి యువకులుఁ దూరం అవ్వడం హర్షించాము. యువకులు సంపాదనకు, గౌరవ జీవనానికి అలవాటు పడుతుండడం ఆనంద పడ్డాము.
కాని జీవితం అందుకొరకు మాత్రమె కాదు. చెడుకు దూరంగా ఉండమంటే చెడు సంఘాలకు దూరం ఉండటం మాత్రమె కాదు. చెడు జీవనానికి కూడా దూరంగా ఉండాలి. జీవితం లో ఆత్మబలం నింపేది పవిత్రంగా జీవించడం లొనే ఉంటుంది.
డబ్బు సంపాదన కేవలం సుఖ జీవనం కోసమే కాదు. సరియైన ఆనందం పొందడం కోసం. అది దూర్వ్యసనాల వల్ల, వ్యక్తి గతంగా సుఖం అంటే జల్సాలకు, చెడు అలవాట్లకు, చెడు జీవనానికి అలవాటు పడటం కాదు. ఇంతవరకు వీటికి దూరంగా ఉండే ఈ దేశపు ఆడవారు కూడా సుఖం అందులో ఉందేమో అనే భ్రమకు లోనవుతున్నారు.
నిజమైన ఆత్మా బలం ఉన్నవాడు ఏదయినా సాధించగలడు. నిస్వార్థంగా నీవు వేసే ప్రతి అడుగు నీలో వేయి ఏనుగుల బలాన్ని ఇస్తుంది అంటారు శ్రీ వివేకానంద. ఎవరో టికెట్ కొనిస్తే ఓడ ఎక్కిన వివేకానందుడు, డబ్బులు, పరిచయ పత్రం పోగొట్టుకుని చికాగో లో దిగినా, ప్రపంచ మత సభల్లో మాట్లాడి ప్రపంచానికంతా మార్గ దర్శనం చేసే స్థాయికి ఎదిగాదంటే, వారి ఆత్మా బలం, వారి పవిత్ర జీవనం కారణం.
ఆ బలం మంచి పనులు చేయడం ద్వారా వస్తుంది. మంచిగా ఆలోచించడం ద్వారా వస్తుంది. మంచి వారి స్నేహం వాళ్ళ వస్తుంది. చెడు సహవాసాలు, వ్యసనాలు, చెడ్డపానుల ద్వారా వచ్చిన ఆనందం మనలో ఆత్మా బలం పెంచదు సరికదా నిరంతరం మనల్ని గమనిస్తున్నారేమో అనే భయాన్ని , తద్వారా నిరంతర అశాంతిని కలిగిస్తుంది
అందుకే యివకుల్లో ఆత్మహత్యలు, మానసిక అశాంతులు పెరుగుతున్నాయి.
వీటిని అధిగమించాలనుకుంటే, వ్యాసుడు చెప్పిన సూత్రం గుర్తుకు వస్తుంది. వ్యాసుడిని ఇన్ని గ్రంధాలు కాదు, పుణ్యం, పాపం అంటే ఒక శ్లోకంలో చెప్పమంటే, వారు పూర్తి శ్లోకం అవసరం లేదు, సగం శ్లోకం లొనే చెబుతానని ఇత్రులకు సహాయం చేయడం పుణ్యం, ఇతరులకు అపకారం చేయడం పాపం అని చెప్పారు. వివరణ మరో వ్యాసం లో...
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top