మాననీయ దత్తోపంత్ థేంగ్డే గారితో కాసేపు

నేను భారతీయ మాజ్దూర్ సంఘ్ పనిలో ఉన్నప్పుడు మాననీయ దత్తోపంత్ థేంగ్డే గారితో కాసేపు మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను సంభ్రమాశ్చర్యాలలో ముంఛిన విషయం మీతో పంచుకుంటాను. వారి ఋషి తుల్య జీవనం లో అఖిల భారతీయ స్థాయి లో ABVP, B M S, B K S, swadeshee jaagaran manch, ఇన్ని సంస్థలకు మార్గదర్శనం చేసే వారు. వారితో కూర్చుని చాయ్ పె చర్చా.
మాజ్దూర్ సంఘ్ రాక ముందు నీవేమి చేసేవాడివి ?
నేను సంఘ ప్రచారక్ గా గుంటూరు, విజయనగరం పనిచేశాను అన్నాను.
గుంటూరు లో ఎన్నాళ్ళున్నావు?
నాలుగు సంవత్సరాలు .
ఆ వూర్లో వీరగాని సూర్యనారాయణ అని మన కార్యకర్థ, తోపుడు బండ్ల యూనియన్ చూసేవారు. నీకు తెలుసా?
నేను వారిని చూడలేదు. నేనెళ్లేవరకే వారు మరణించారు.
వారు పోయిన సంగతి నాకు తెలుసు. వారింటికి నీవు వెళ్ళేవాడివా?
వెళ్ళేవాడినండీ.
వాళ్ళబ్బాయి పేరు ఏదో కృష్ణ..!
వాడి పేరు లీలా కృష్ణ , అన్నాను.
ఆ ఆ లీలాకృష్ణ, నిజమే బాగున్నాడా?
బాగున్నాడు. సాయం శాఖకు వెళ్తున్నాడు 9 వ తరగతి చదువు.
సంతోషం. వాడికి ఒక అక్క ఉండేది. అవునండి తనకు పెళ్లి అయ్యింది. బాగున్నారు.
ఇంకో చిన్న చెల్లలు ఉండేది ..
అవును తెలుసును, నేను వాళ్ళింట్లో భోజనం కూడా చేసాను. మంచి సంబంధం ఉంది, నా సమాధానం.
సూర్యనారాయణ మనకు మంచి కార్యకర్త. కుటుంబం తో సంఘానికి సంబంధం ఉంది. శుభ వార్త చెప్పావు సంతోషం. వారి చేయి నా భుజం పై.
Image result for dattopant thengadi
నాకాశ్చర్యం వేసింది. అంత పెద్ద మనిషి గుంటూరు ఎన్ని సార్లు వెళ్లి ఉంటారు? ఈ సంభాషణ 1992 లో జరిగింది. నేను గుంటూరు వెళ్ళింది 1984 లో. అప్పటికే ఆ కార్యకర్త లేరు. వీరేమో అఖిల భారత మార్గ నిర్దేశకులు. అతను తోపుడు బళ్లు నాయకుడు. అయినా వారికి గుర్తున్నారు. కార్యకర్త మాత్రమె కాదు, వారి అబ్బాయి పేరు గుర్తుంది. వారు చూసే నాటికి ఆ అబ్బాయి 4 వ తరగతి. వాళ్ళ అక్కయ్య, చెల్లెలు ఎన్ని వివరాలు అడిగారు.
సంఘానికి కార్యకర్త తో సంబంధం ఎంత ఘనిష్టం ఉంటె అంతగా కార్యకర్త సమర్పితం
అవుతాడన్నది నేను ఆ సైద్ధాంతిక ద్రష్ట నుండి నేర్చు కున్నాను. సంభాషణ నే శిక్షణ.
దయచేసి షేర్ చేసి అందరికీ చేర్చండి.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments