సంస్కృతం మృతభాష కాదు దేవభాష About Sanskrit Language

megaminds
0


సంస్కృతం మృతభాష కాదు దేవభాష, ప్రస్తుత యువభాష: సామాజిక మాధ్యమాల యుగంలో యువత యొక్క అద్భుత ప్రయత్నాలు.


సంస్కృతం అంటే కేవలం ఒక భాష మాత్రమే కాదు. సంస్కృతం భారత నాగరికత యొక్క హృదయస్పందన. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ-మహాభారతాలు, కాళిదాసు నాటకాలు, ఆర్యభట్టీయం వంటి విజ్ఞాన గ్రంథాలు – ఇవన్నీ సంస్కృతంలోనే పుట్టాయి. ఒకప్పుడు ఇది రాజసభల్లోనూ, గురుకులాల్లోనూ, సామాన్యుల మధ్యనూ సజీవ సంభాషణ భాషగా విలసిల్లింది. భోజరాజు సభలో కవులు సంస్కృతంలోనే కవితారచన చేసేవారు; కాళిదాసు నాటకాలు సంస్కృతంలోనే ప్రదర్శితమయ్యేవి.


కానీ గత రెండు శతాబ్దాలుగా ముఖ్యంగా బ్రిటిష్ బానిసత్వ కాలంలో మెకాలే విద్యా విధానం తర్వాత సంస్కృతాన్ని క్రమంగా “మృతభాష”గా ముద్రవేసి, పాఠశాలల నుంచి తొలగించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆ ధోరణి పూర్తిగా మారలేదు. ఫలితంగా యువతకు సంస్కృతం “పండితుల భాష”గా, “పూజారుల భాష”గా మాత్రమే కనిపించసాగింది.


ఇప్పుడు కాలం మారుతోంది. ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, రీల్స్ వంటి సామాజిక మాధ్యమాలు సంస్కృతానికి కొత్త ఊపిరి పోస్తున్నాయి. ఈ రోజు లక్షలాది మంది యువకులు సంస్కృతాన్ని ఆరాదిస్తున్నారు. ఆధునిక ప్రపంచంతో ముడిపెడుతూ అద్భుతమైన కంటెంట్‌ను సృష్టిస్తున్నారు. వారు నిరూపిస్తున్నారు – సంస్కృతం మృతభాష కాదు, అది ఇప్పటికీ సజీవంగా ఉన్న యువ హృదయాల భాషయని.


యష్ సాలుండ్కే క్రికెట్ మైదానంలో సంస్కృత వ్యాఖ్యానం: ముంబైకి చెందిన యష్ సాలుండ్కే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్. కానీ ఆయన గొంతు ఇప్పుడు స్టేడియంలోనే కాదు ఇన్‌స్టాగ్రామ్ రీళ్లలో మారుమోగుతోంది. ఒక రీల్‌లో యష్ క్రికెట్ ఆడుతూ, బంతిని కొడుతూ, పరుగులు పరుగెత్తుతూ… పూర్తిగా సంస్కృతంలోనే వ్యాఖ్యానం చేశాడు: “అద్భుతం! షట్కం! షట్కారః!” అని. ఆ వీడియో వైరల్ అయ్యింది. లక్ష్ళాది మంది యువకులు “అరె, సంస్కృతంలో క్రికెట్ కామెంటరీ అన్నీ!” అంటూ ఆశ్చర్యపోయారు. యష్ ద్వారా ఒక తరం యువకులు మొదటిసారి సంస్కృతాన్ని “పలుకుతూ & స్పోర్టీ”గా” చూశారు.


కమల్ & జాహ్నవి – ఆధునిక ఆధ్యాత్మికతకు సంస్కృత రూపం: ఈ ఇద్దరు సోదరీమణులు ఇన్‌స్టాగ్రామ్‌లో “Sanskrit Sisters”గా పాపులర్. వారు భగవద్గీత, ఉపనిషత్తులు, యోగసూత్రాలను ఆధునిక యువత భాషలో, అందమైన గ్రాఫిక్స్‌తో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో వివరిస్తారు. అదే సమయంలో సంస్కృత శ్లోకాలను సంగీతంతో కలిపి కీర్తనలు పాడతారు. వారి రీళ్లు చూస్తే “ఆధ్యాత్మికత అంటే బోరింగ్ కాదు, అది ట్రెండీ!” అనిపిస్తుంది.


సంస్కృత ఛాత్రోహం – హాస్యంతో సంస్కృతం: ఈ ఛానెల్ నడిపే యువకులు సంస్కృతంలోనే మీమ్స్, స్కిట్స్, రోజువారీ సంభాషణలు చేస్తారు నవ్విస్తారు. “అరే భ్రాతః! కఫే పిపాసతి మే” (బ్రో, కాఫీ తాగాలని ఉంది) అంటూ ఒక స్కిట్; “కిం కరోషి రే మూర్ఖ!” (ఏం చేస్తున్నావ్‌రా మూర్ఖుడా!) అంటూ మరొకటి. ఈ హాస్యం ద్వారా వేలాది మంది టీనేజర్లు సంస్కృత పదాలను నేర్చుకుంటున్నారు.


సమష్టి – సంస్కృతంలో హిప్-హాప్, ర్యాప్, పాప్: సమష్టి అనే యువతీయువకుల బృందం ఆధునిక బీట్స్‌పై సంస్కృత శ్లోకాలను రాప్ చేస్తూ, డాన్స్ చేస్తూ వీడియోలు చేస్తోంది. “నాస్తి బుద్ధిః అయుక్తస్య” (ఏకాగ్రత లేని వాడికి బుద్ధి ఉండదు) అనే గీతా శ్లోకాన్ని హిప్-హాప్ బీట్‌పై పాడితే… యువత డాన్స్ చేస్తూ నేర్చుకుంటోంది.


భావేష్ భీమనాథని – లోతైన తత్వశాస్త్రం: యువత భాషలో

భావేష్ తన ఛానెల్‌లో అద్వైత వేదాంతం, న్యాయశాస్త్రం, సాంఖ్యం వంటి లోతైన విషయాలను చాలా సరళంగా, రోజువారీ ఉదాహరణలతో వివరిస్తాడు. ఒక వీడియోలో “మాయా అంటే ఏమిటి?” అని అడిగి, దాన్ని హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్‌తో పోల్చి చెప్పాడు. ఫలితం – వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు అద్వైతాన్ని చర్చిస్తున్నారు.


శుక్ల యజుర్వేదంలోని మధ్యందిని శాఖలోని 2000 మంత్రాలతో కూడిన దండక్రమ పారాయణాన్ని 50 రోజుల్లో ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి చేశారు, 19 ఏళ్ల దేవవ్రత్ మహేష్ రేఖే. ఈ దండక్రమ పారాయణం Vallabharam Shaligram Sangved Vidyalaya, Varanasi (Kashi) లో జరిగింది. 2025 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 30 వరకు అంటే మొత్తం 50 రోజులు. చూడండి ఎంత పట్టుదల, సంకల్పం యువతలో ఉంటే నేర్చుకోగలరు. దేశంలోని యువతకు ఇదొక అద్బుతమైన ప్రేరణగా నిలిచింది.


ఈ యువకులందరూ ఒకే సందేశం ఇస్తున్నారు: సంస్కృతం పాతకాలపు భాష కాదు, అది భవిష్యత్తు భాష. అది మన జ్ఞానభాండాగారం మాత్రమే కాదు మన గుర్తింపు, మన మన మనస్తత్వం. ఈ రోజు ఒక యువకుడు క్రికెట్ ఆడుతూ సంస్కృతంలో వ్యాఖ్యానం చేస్తే, మరో యువతి ర్యాప్ పాడుతూ ఉపనిషత్తులు బోధిస్తోంది. ఇది కేవలం భాష పునరుజ్జీవనం కాదు ఇది మన నాగరికత యొక్క యువ రక్తప్రసరణ.


మనం ఎవరం? మన పూర్వీకులు ఏమి మనకు అప్పగించారు? ఈ ప్రశ్నలకు జవాబు సంస్కృతంలోనే ఉంది. ఈ యువత ఆ జవాబును ఇన్‌స్టాగ్రామ్ రీళ్లలో, యూట్యూబ్ షార్ట్స్‌లో అందిస్తోంది. వారికి జోహార్! వారితో పాటు మనమూ ఈ ఉద్యమంలో భాగమవుదాం. ఒక్కసారి ప్రయత్నంగా మీ స్టేటస్‌లో సంస్కృతంలో ఏదైనా రాసి పెట్టండి – “సుప్రభాతం మిత్రాణి!” అంటే. చూడండి ఎంత మంది లైక్ చేస్తారో, ఎంతమంది “అర్థం చెప్పండి బ్రో!” అని అడుగుతారో. సంస్కృతం మళ్లీ సజీవమవుతోంది ఈసారి యువ గొంతుల ద్వారా. जयतु संस्कृतम् ! జయ హో సంస్కృతం! -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds

Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

MegaMinds

MegaMinds Raja



At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top