తాడాసన్:
స్థితి: తిన్నగా నిలబడి. మడమలు దగ్గరగా ఉంచి, వేళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. గుండెలనిండా గాలిపీల్చి భుజాలు, కిందికి జార్చి విశ్రాంతిగా నిలబడండి. మెడ నిటారుగా ఉండాలి. వేళ్లు నేలను చూస్తూ... అరచేతులు తొడలను తాకుతూ ఉండాలి. ముఖం ప్రశాంతంగా ఉండాలి.క) స్థితి నుండి శ్వాస పీలుస్తూ రెండు చేతులు భుజాలకు సమానంగా ప్రక్కలకు, శ్వాస వదలాలి.
ఖ) శ్వాస పీలుస్తూ, చేతులు తలపైకి తీసుకొని వెళ్ళి అరచేతులు కలపాలి. రెండు చేతులు మొత్తం శరీరాన్ని పైకి లాగాలి. దృష్టి అర చేతులవైపు
గ) శ్వాస వదులుతూ 'క' స్థితిలోకి రావాలి శ్వాస పీల్చాలి.
ఘ) శ్వాస వదులుతూ స్థితి.
ఫలితములు: రెండు కాళ్ళ మడిమలు మరియు పంజాలపైన సమాన భారం ఉంచి నిలబడడంతో అనేక ప్రయోజనాలున్నాయి. అవన్ని ఈ ఆసనంలో లభిస్తాయి. తాడాసన్లో పిరుదులను బిగించి, పొట్టను లోపలికి లాగడం వలన శరీరం తేలిక అవుతుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. శరీరం మొత్తాన్ని పైకి లాగడం వలన వెన్నెముక శక్తివంతం అవుతుంది. ఎత్తు పెరిగే అవకాశం ఉంది.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
International Yoga Day 2025, Yoga Day 2025, World Yoga Day 2025, Yoga Day theme 2025, Yoga Day date 2025, Yoga Day 2025 celebration, Yoga Day 2025 activities, Yoga Day 2025 speech, Yoga Day 2025 essay, Why is June 21 yoga day?, ఎందుకు జూన్ 21 యోగా రోజు?