Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ప్రపంచ శాస్త్రవేత్తల సరసన నిలిచిన సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అయ్యర్ - About Chandrasekhar ayyar in Telugu

1933 ఇంగ్లండ్ లోని ఒక ఆడిటోరియమ్ లో 22 సంవత్సరాల యువ శాస్త్రవేత్త తను కనుగొన్న థియరీ గురించి సభికులకు వివరిస్తున్నాడు. దానికి ఆర...


1933 ఇంగ్లండ్ లోని ఒక ఆడిటోరియమ్ లో 22 సంవత్సరాల యువ శాస్త్రవేత్త తను కనుగొన్న థియరీ గురించి సభికులకు వివరిస్తున్నాడు. దానికి ఆర్థర్ ఎడింగ్టన్ అనే పేరున్న శాస్త్రవేత్త పర్యవేక్షణ చేస్తున్నాడు.

ఆ యువకుడు గొంతు సవరించుకొని  "లేడీస్ ఆండ్ జంటెల్మెన్.. ప్రతివ్యక్తి జీవితంలోనూ బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలున్నట్లే నక్షత్రాలలో కూడా పరిణామ దశలుంటాయి. వీటిలో అరుణమహాతార(రెడ్ జెయింట్ ), సూపర్ నోవా, న్యూట్రాన్ తార, కృష్ణబిలాలు ముఖ్యమైనవి. ఒక సూపర్ నోవాలోని పదార్థం ఒక అవధిని మించితే ఆ నక్షత్రం తన గురుత్వ ఆకర్షణ శక్తుల ప్రభావానికి గురై కూలిపోయి మరొక రకం నక్షత్రంగా మారిపోతుంది. అది న్యూట్రాన్ తారగా కావచ్చు,లేదా బ్లాక్ హోల్ (కృష్ణబిలం)గా కావచ్చు అని చెబుతుండగా ఆర్థర్ ఎడింగ్టన్ లేచి ఆ యువకుడిని హేళనచేస్తూ అవన్నీ ఊహాజనితమైనవేనని, ఇలాంటి కాకమ్మ కథలు ఇండియన్స్ బాగా చెబుతారనీ.. అసలు ఇందులో శాస్త్రీయ వాదన లేదనీ సభకులందరి ముందూ మాట్లాడేసరికే తనకంటే చాలా పెద్దవాడైన ఎడింగ్టన్ కు ఎదురుచెప్పలేక తలదించుకున్నాడా యువకుడు. అయితే ఆ యువకుడు వాదన నమ్మదగిన విధంగా వుందని, అతనిని మాట్లాడనివ్వండని సభికులు చెప్పాలని వున్నా ఎడింగ్టన్ ను ఎదిరించలేక మౌనంగా వుండిపోయారు వాళ్ళు. అవమాన భారంతో వేదికదిగి గదికి వెళ్ళిన యువకుడు ఒకరోజంతా అవమానభారంతో మౌనంగా వుండిపోయాడు. ఆర్థర్ ఎడింగ్టన్ తనను ముఖాముఖిగా ప్రశ్నలు సంధించివున్నా సమాధానాలిచ్చేవాడు.. చివరికి జాత్యాహంకారం ప్రదర్శించాడు.. జాతి వివక్షతో కుాడిన వ్యాఖ్యానాలు చేసాడు.. ఇంక ఇంగ్లండ్ లో వుండకూడదు అనుకొని ఇండియా తిరిగివచ్చి మళ్ళీ అమెరికా కు పయనమై ఫిజిక్స్, ఖగోళ ఆచార్యునిగా చికాగో యూనివర్సిటీలో చేరిపోయాడు. ఖగోళబౌతికశాస్త్రాల పరిశోధనలకు స్వస్తి పలికాడు.

ఇది జరిగిన 50 సంవత్సరాలకు ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం చాలా అద్భుతమైనందంటూ ఆయనకు "నోబుల్ బహుమతి ఇస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయినా ఆయన నోబుల్ బహుమతిపట్ల పెద్ద ఆసక్తి చూపలేదు. ఎందుకంటే 1933 లో ప్రతిపాదించిన సిద్ధాంతానికి అన్నారే గానీ, దాని వెనుక తను చేసినకృషినిగానీ, ఇతర శాస్త్రాలలో తను ప్రతిపాదించిన సిద్దాంతాలు, సూత్రాల ప్రస్తావన లేకపోవడం వలన.

ఇంతకీ ఆ ఇండియన్ యువకుడెవరో తెలుసా?? ఆయనే సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ అయ్యర్. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (అక్టోబర్ 19, 1910—ఆగస్టు 21, 1995) .. గొప్పమేధావి. 15 సంవత్సరాల వయసులోనే పరిశోధనా పత్రాన్ని రూపొందించినవాడు. సి.వి రామన్ అన్న గారి కొడుకు. ఈ సిద్దాంతం "చంద్రశేఖర్ అవధి" గా పేరు పొందింది.

"ఒక నక్షత్రం వైట్ డార్ఫ్ దశకు చేరాలంటే ఎలాంటి పరిస్థితులుండాలో చెప్పిన సిద్ధాంతమే "చంద్రశేఖర్ లిమిట్ ". దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశికన్నా 1.44 రెట్లు తక్కువ ద్రవ్యరాశి గల నక్షత్రాలు వైట్ డార్ఫ్ గా మారతాయి.అంతకు మించిన ద్రవ్యరాశివుంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వలన కుచించుకుపోయి సూపర్ నోవాగా, న్యూట్రాన్ స్టార్ గా చివరికి బ్లాక్ హోల్ గా అయిపోతాయి. సూర్యుడు అవధిలోనే వున్నాడు కాబట్టి సూపర్ నోవా గా మారే అవకాశంలేదు. 1966లో అమెరికా శాశ్వత సభ్యత్వం ఇచ్చింది. నాసాలో మంచి పదవులను ఇచ్చింది. 1999లో అంతరిక్షంలోనికి పంపిన X కిరణ వేదశాలకు "చంద్ర" అని ఈయన పేరుపెట్టి గౌరవించింది.

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒక వ్యక్తి దేశంలోనే తొలి నోబెల్‌ పొందిన శాస్త్రవేత్త సర్‌ సీవీ రామన్‌ కాగా, రెండో వ్యక్తి ఆయన అన్న గారి కొడుకు సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌. తారల పరిణామ దశలకు సంబంధించిన పరిశోధనల్లో 'చంద్రశేఖర్‌ లిమిట్‌'గా ఇప్పటికీ ఉపయోగపడుతున్న సిద్ధాంతాలను అందించిన చంద్రశేఖర్‌, ప్రపంచ శాస్త్రవేత్తల సరసన నిలిచారు.

సంగ్రహం:
1929-39 అంతరిక్ష నిర్మాణం. చంద్రశేఖర్ పరిమితి, అంతరిక్ష గతిశాస్త్ర పరిశోధనలు
1939-43 న్యూట్రాన్ రేడియేటివ్ ట్రాన్స్‌ఫర్, ఋణాత్మక హైడ్రోజన్ ల క్వాంటమ్ సిద్ధాంతం
1943-50 హైడ్రో డైనమిక్. హైడ్రో మాగ్నటిక్ స్థిరత్వం
1950-69 ఎలిప్స్ ఆకృతిగల నిర్మాణాల సమతా స్థితి, స్థిరత్వాలు
1955 న్యూటన్ సిద్ధాంతాల ప్రచురణ
1971-83 కృష్ణబిలాల భౌతిక విజ్ఞాన గణిత సిద్ధాంతం
1980 గురుత్వాకర్షణ తరంగాల పరస్పర తాడనాల సిద్ధాంతం

పురస్కారాలు:
1966 అమెరికా జాతీయ విజ్ఞాన శాస్త్ర మెడల్
1968 పద్మ విభూషణ్ పురస్కారం
1983 భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం
1984 కోప్లే మెడల్

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గారిని భారత అమృత మహోత్సవాల సందర్భంగా ఆయన విజ్ఞానశాస్త్రానికి చేసిన కృషిని గుర్తుచేసుకుందాం!!!   -మీ రవీంద్ర.

No comments