Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూ సమాజం పై సాంస్కృతిక దాడి.. ఇదిగో ఇలా చేస్తున్నారు? MegaMinds

హిందూ సమాజం పై సాంస్కృతిక దాడి: (రెండవ భాగం):  ఎవరో కవి చెప్పినట్టు మన దేశాన్ని కులాల కుట్రలు, మతాల మంటలు, పగల పగుళ్లు, తెగల తెగ...


హిందూ సమాజం పై సాంస్కృతిక దాడి: (రెండవ భాగం): ఎవరో కవి చెప్పినట్టు మన దేశాన్ని కులాల కుట్రలు, మతాల మంటలు, పగల పగుళ్లు, తెగల తెగుళ్లు, తాటి చెట్టుకు కొండ చిలువ మెలికలు వేసిన భారతి వేదన. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతీయత్త్వం పేరుతో, తెగల పేరుతో ఈ దేశం యొక్క అఖండత్వాన్ని  విచిన్నం  చేసే ప్రయత్నం చేస్తున్నారు. కులం పేరుతో మన సంస్కృతి లో లేని అంటరానితనం ను ఈ దేశం లోకి చొప్పించారు  అగ్రవర్ణాలు, నిమ్నవర్గాలు దళితులు అనే పేరుతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారు. మన సంస్కృతి లో కులం కన్నా గుణాన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చారు భగవద్గీత లో చెప్పిన చాతుర్వర్ణ మయ సృష్టి ..... అనే శ్లోకాని కి తప్పుడు వకృభాష్యం చెపుతూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వేదాలు రాసిన వ్యాసుని ది ఏకులం భగవద్గీత ను బోధించిన కృష్ణుడి ది ఏకులం రామాయణాన్ని రాసిన వాల్మీకీది ఏ కులం నేటికి ఈ మహనీయులు రాసిన, చెప్పిన విషయాలు మానవ జాతికి ప్రామాణికం మరియు అనుసరణీయం కదా.

దళిత్  అనే పదం ఏదైతే ఉన్నదో ఆ పదం అసలు ఇక్కడిది కానే కాదు విదేశాలలో అణిచివేయబడ్డ సమాజానికి    అర్ధంగా దళిత్ అనే పదాన్ని వాడుతారు. ఈ పదాన్ని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ సమాజం లో చొప్పించి ఆ పదాన్ని విభజన వాదానికి కేంద్ర బిందువుగా మార్చడం జరిగింది.  CLADVEL అనే బిషప్ అనే అతను ఆర్యన్ థియరీ ని బహుజన వాదాన్ని లేవనెత్తారు సమాజం లో విభజన వాదాన్ని రేకెత్తించారు. ఇతిహాస పరంగా  సమాజములో అందరూ అనాదిగా పూజించే రాముడు, కృష్ణుడి లను సమాజంలో ని  కొందరు వ్యక్తులు గా మాత్రమే చిత్రీకరిస్తూ రాక్షస గుణాలు కలిగిన వ్యక్తులను ఒక వర్గ ప్రజలకు చెందిన వారీగా చిత్రీకరిస్తూ ఇతిహాసాల్లో పేర్కొనబ డ్డ విషయాలను తప్పుడు గా అర్ధం చేసుకునే విధమైన సాహిత్యాన్ని, సంస్థలను నిర్మాణం చేసి సమాజాన్ని విడదీసేప్రయత్నం జరుగుతున్నది.

జ్ఞానార్జనకు నిలయంగా ఉండవలసిన కాలేజీలలో cultural studies పేరుతో అనాగరికమైన పండుగలు నిర్వహించి కాలేజీలలో విద్యార్థుల మధ్య  ఉద్రిక్తలు నెలకొనేవిదంగా చేస్తూ రాబోయే తరం యొక్క మెదళ్ల లో విష సంస్కృతి నింపుతున్నారు.

హిందూ ఆచార వ్యవహారాల్లో పవిత్రమైన పదాలను, పుణ్య స్థలాలను మీడియాలో  అసభ్య పదాలకు పర్యాయ పదాలుగా వాడుతూ హిందూ సంస్కృతి యొక్క పవిత్రతను దిగజార్చేపని ప్రధానంగా కొనసాగిస్తున్నారు ఉదాహారణకు ఏదైనా వ్యవస్థ లో ఆర్థికపరమైన మోసం జరిగితే "కుంభకోణం" జరిగింది అని అంటారు వాస్తవానికి కుంభకోణం అనే పేరుతో తమిళనాడు లో పెద్ద దేవాలయం ఉన్నది.. సమాజంలో ఎక్కడైనా ఎవరైనా వ్యక్తులు కానీ వ్యవస్థలో కానీ  నిధులను తింటే "స్వాహా "అనే పదాన్ని ఉపయోగిస్తారు "స్వాహా" అనే పదం హిందువులు పవిత్రంగా భావించే యజ్ఞ కార్యక్రమమము లో వాడుతాము, గుడి లో పూజారి పెట్టె "శఠగోపం" ను కూడా తప్పుడు అర్ధం వచ్చే విధంగా పవిత్రమైన పదాలను సాహిత్య, సమాచార రంగలలోకి అపవిత్ర పదాలుగా అర్ధం వచ్చే విధంగా ఉద్దేశ్య పూర్వకంగా  చొప్పించారు.

హిందూ సంస్కృతి యొక్క గొప్పదనంను సూచించే  మన పవిత్రమైన  పురాణాలను ఇతిహాసాలను కేవలము ఆయా రచయితల యొక్క  ఊహాజనిత, కల్పిత  గాథలుగా పుక్కిటి పురాణాలు  మాత్రమే అని  అవి జరగలేదని ప్రచారం చేశారు. నేడు సమాజం లో  వాడుక బాష ల లో  "బూతు పురాణం" అనే  పదం వాడుతుంటారు అంటే ఇక్కడ "పురాణం" ఒక బూతు అనే అర్ధం వచ్చే విధంగా, "సొల్లుబాగవతం", "సొల్లు రామాయణం" అంటే రామాయణ బాగవతాలు పనికిరానివనే అర్ధం ఇచ్చే విధంగా కావాలనే వాడుక పదాలుగా సమాజంలోకి చొప్పించారు, కమ్యూనిజం మరియు క్రైస్తవ మతం ను అనుసరించే వ్యక్తులు కళా రంగాలలోకి ప్రేవేశించి అక్కడ మన సంస్కృతికి మూలమైన వాటిని తొలగించి ఆయా కళా రంగాలలో క్రైస్తవానికి అనుకూలమైన పద్దతి లో మార్పులు చేసే ప్రయత్నం జరిగింది.

మన సంస్కృతిలో వారసత్వంగా వస్తున్న  నాట్య శాస్త్రం లో   మల్లికా సరాభాయి అనే క్రైస్తవ అనుకూల వ్యక్తి    భారత నాట్యం లో ఉన్న హిందు సంస్కృతి విలువల స్థానం లో క్రైస్తవ ముద్ర వేసే విధంగా ప్రయత్నం జరిగింది T కృష్ణ కన్నడ యొక్క ఓకల్ సింగర్ (రామన్ మెగాన్స్ అవార్డు గ్రహీత) ద్వారా  భరత నాట్యం లో CHRISTIANITY చొప్పించే ప్రయత్నం జరిగింది.

1960 సంవత్సరం తరువాత క్రమంగా సినిమాల ఆధారంగా కూడా మన సంస్కృతిపై దాడి చెయ్యడం జరిగింది, అప్పటి వరకు కుటుంభం పౌరాణిక  సినిమాలు ఉండేవి అటు తరువాత కమ్యూనిస్ట్ లు ప్రవేశించిన తరువాత, వాస్తవ విషయాలు మరుగునపడే విధంగా సినిమాలు తీయడం జరిగింది ఈస్టమన్ కలర్ సినిమా లు ప్రారంభం ఆయిన తరువాత మహాభారతం లో ని  కర్ణుడిని మాత్రమే ఎక్కువగా చేసి చూపించడం మిగతా వాళ్ళను విలన్ లు గా, లేదా తక్కువ ప్రాధాన్యత కల వారిగా చేసి చూపించారు, కర్ణుడు కేవలం దానం విషయం లొనే గొప్పవాడు కానీ మిగతా అన్ని విషయాలల్లో కూడా అధర్మం వైపు లేదా వ్యక్తిగత స్వార్ధం వైపే నిలుచున్నవాడు.

1980 తరువాత వచ్చిన సినిమాలు అన్ని కూడా కమ్యూనిస్ట్ ల చేత ప్రభావితం చెయ్యబడినవే, అంటే ప్రతి సినిమా లో పెట్టుబడిదారుడు, దోపిడిదారుడు అనే అంశం 1985,1987  తరువాత నక్సలిజం సిద్ధాంతంతో, నక్సలైట్లు హీరోలుగా సమాజోద్దారుకులుగా, మిగతా సమాజం లో అందరూ చెడిపోయిన వాళ్ళ లాగా  చూపించబడ్డారు, అంటే సమాజం లోని మంచి విషయాలను చూపిస్తూ ఒక సందేశాత్మకంగా ఉండాల్సిన సినిమాలలో దానికి బదులుగా సమాజాన్ని విభజించి చూపించే ప్రయత్నం చేస్తూ విదేశీ బావ ప్రేరేపిత సిద్దాంతానికి అనుకూలమైన సమాజాన్ని తయారుచేయడం కోసం సినిమా రంగాన్ని వేదిక గా ఎంచుకున్నారు..

ఇలా అనేక రకాలుగా అనేక పద్దతులలో కుట్రపూరితంగా వ్యవహరిస్తూ మన సంస్కృతిని అనేక పద్దతులలో నాశనం చెయ్యడం కొరకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మన సంస్కృతిని రక్షించుకోవడం కొరకు మనం అందరం నడుంబిగించాల్సిన అవసరం ఉన్నది.


స్వామి ఆరబిందో మహర్షి చెప్పినట్టు
I say no longer that nationalism is a creed, a religion, a faith; I say that it is the Sanatan Dharma which for us is nationalism. This Hindu nation was born with the Sanatan Dharma, with it it moves and with it it grows. When the Sanatan Dharma declines, then the nation declines, and if the Sanatan Dharma were capable of perishing, with the Sanatan Dharma it would perish.The Sanatan Dharma, that is nationalism. రాజగోపాల్ కట్ట, 9490791726


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. I feel proud to say that, megamindsindia are doing very valuable work, people must read about history, to know who is what.

    ReplyDelete