Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అంబేద్కర్ మరియు బ్రాహ్మణిజం - About Ambedkar and Brahmanism - megaminds

అంబేద్కర్ బ్రాహ్మణవాద వ్యతిరేకి కావచ్చేమో,కానీ బ్రాహ్మణ వ్యతిరేకి కాదు. ఎందుకంటే ఆయన వెంట అన్ని ఉద్యమాలకు మద్దతు తెల్పిన ప్రముఖుడు శ్రీధర్ ప...


అంబేద్కర్ బ్రాహ్మణవాద వ్యతిరేకి కావచ్చేమో,కానీ బ్రాహ్మణ వ్యతిరేకి కాదు. ఎందుకంటే ఆయన వెంట అన్ని ఉద్యమాలకు మద్దతు తెల్పిన ప్రముఖుడు శ్రీధర్ పంత్(లోకమాన్య బాల గంగాధర తిలక్ కొడుకు) బ్రాహ్మణుడు. తనను చక్కగా ఆదరించిన అంబేద్కర్ ఓ బ్రాహ్మణ ఉపాధ్యాయుడే. విద్యాభివృద్ధి కోసం అన్ని విధాల సహకరించిన కేెలుస్కర్ బ్రాహ్మణుడే. మహద్ చెరువు పోరాటానికి మహద్ బ్రాహ్మణులు దాపు రావు జోషి, టిప్పనీశ్ కుటుంబాలు మద్ధతునిచ్చాయి. జి.కె. ప్రధాన్, డా, ఎస్.నాయక్, నావలె భతేన, పి. కె.భానే వంటి ప్రముఖ బ్రాహ్మణులంతా అంబేద్కర్ మిత్రులే. అంతేకాదు అంబేద్కర్ ముఖ్య అనుచరుడు సహస్రబుధే బ్రాహ్మణుడే అని అంబేద్కర్ జీవితచరిత్రని బట్టి తెలుస్తుంది.


స్వయంగా అంబేద్కర్ "నా ఉద్యమం బ్రాహ్మణులకు వ్యతిరేకంగా చేస్తున్నది కాదు;బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా చేస్తున్నది"అని అనేక సందర్భాల్లో చెప్పారు. హిందూతత్వం ప్రకారం భగవంతుడు అంతటా ఉన్నాడు కదా!మరి ఈ అంటరానితనం, అస్పృశ్య భావనలు, తక్కువెక్కువలు ఎందుకు వచ్చినవి" అని అంబేద్కర్ ప్రశ్నించేవాడు. సృష్టి అంతా భగవత్ స్వరూపమే అనే తత్వం- వ్యవహారంలో అంటే ఆచరణలో లేకపోవటాన్ని అంబేద్కర్ గట్టిగ నిలదీశారు. అహంకారంతో కూడిన కొందరి ఛాందస విధానాల పట్ల మాత్రమే అంబేద్కర్ కి వ్యతిరేకత ఉండేది. సామల కిరణ్, ప్రముఖ జాతీయవాది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments