Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గోవధశాలలు ఆంగ్లేయుల కుట్ర - Cow Slaughters Behind Britishers

ఆంగ్లేయుల కుట్ర: 17వ శతాబ్దంలో తూర్పు వర్తక సంఘం భారతదేశం వచ్చేనాటికి మనదేశంలోని జనాభాకంటే గోసంపద, పశుసంపద అధికంగా ఉండేది. అ...

ఆంగ్లేయుల కుట్ర:17వ శతాబ్దంలో తూర్పు వర్తక సంఘం భారతదేశం వచ్చేనాటికి మనదేశంలోని జనాభాకంటే గోసంపద, పశుసంపద అధికంగా ఉండేది. అనాదిగా భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. ఆవు భారతీయ వ్యవసాయానికి కేంద్ర బిందువు. మనది గోఆధారిత వ్యవసాయం. ఆంగ్లేయులకు ఈ స్థితి ఆశ్చర్యం అసూయ కల్గించాయి. వారి దృష్టిలో ఆవు అంటే మాంసాన్నిచ్చే జంతువు. స్వతహాగా వారు గోమాంస భక్షకులు. తమ ఆంగ్లేయ పరిపాలన సుదీర్ఘకాలం కొనసాగాలంటే భారతదేశంలో ప్రాచీన కాలం నుండి వస్తున్న గురుకుల విద్యావ్యవస్థను ధ్వంసం చేయాలని నిర్ణయించారు. మెకాలే విద్యా వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. నల్ల చర్మంతో ఆంగ్లేయుల ఆలోచనలతో ఆంగ్లేయ ప్రభుత్వంలో ఉద్యోగులుగా పనిచేస్తూ, విదేశీ ఆంగ్ల పాలనను సమర్థించేవారి ని తయారు చేయడమే మెకాలే విద్యావిధానపు లక్ష్యం.

వ్యవసాయ ప్రధానమైన భారతదేశాన్ని ఆర్థికంగా బలహీనం చేయడం కోసం:
రాబర్ట్ క్లైవ్ క్రీ.శ. 1760 లో కలకత్తాలో రోజుకు 70వేల పశువులను సంహరించే మొట్టమొదటి గోవధశాలను ప్రారంభించాడు. దేశంలో పెరిగిన వివిధ గోవధశాలల వలన గోసంపద త్వరగా క్రమంగా తగ్గుతూవచ్చింది. సేంద్రీయ వ్యవసాయం, గోమూత్రం, గోపేడలతో కూడిన వ్యవసాయ విధానం నుండి రసాయనిక ఎరువులు వాడే వ్యవసాయ విధానం వైపు మన విధానాలను మార్చారు.

క్రైస్తవ మత ప్రచారకుల సహకారంతో విదేశీ పండితులు - వేదాలు, ప్రాచీన సాహిత్యానికి తప్పుడు వ్యాఖ్యానాలనిస్తూ భారతదేశంలో ప్రాచీన కాలంలో గోమాంస భక్షణ జరిగిందని ప్రచారం చేసి, పుస్తకాలను ముద్రించారు. వేదాలపై భాష్యం చెప్పిన మాక్స్ ముల్లర్ ఈ కోవకు చెందినవాడే. ఇంగ్లీషు చదివే భారతీయులు సైతం స్వామి దయానందుడు తదితర భారతీయ పండితులు వ్రాసిన వేదార్థాన్ని కాక మాక్స్ ముల్లర్ వ్రాసిన వేదార్థాలనే నేటికీ ప్రమాణంగా తీసుకుంటున్నారు. గోమాంస భక్షణ తప్పు కాదని భావాలను ఇంగ్లీషులో ప్రచారం చేశారు.

గోవంశ నిర్మూలన లక్ష్యంగా వివిధ ఆంగ్లేయ అధికారుల మధ్య జరిగిన వ్రాత కోతలను వివరిస్తూ శ్రీధర్మపాల్ వ్రాసిన 'బ్రిటిష్ ఇండియాలో గోహత్యా చరిత్ర (History of Cow Slaughter in British India)' అనే పుస్తకం ఆంగ్లేయుల కుట్రను సహేతుకంగా వివరించింది. ఈ విధంగా ఆంగ్లేయులు మన గోసంపదపై కుట్ర చేసి, మన చేతనే గోవధశాలలు స్థాపించి వ్యాపార రంగం వైపు గోవును గో మాంసాన్ని తీసుకెళ్ళారు పెద్ద కుట్ర చేశారు... యువకులారా సమయం మించిపోలేదు ఇప్పటికైనా గుర్తెరిగి‌ మన గోసంపదను కాపాడుకుందాం. జై గోమాత.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments