Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశం అంటే ఏమిటి? - What is Country - MegaMinds

దేశమంటే సాంస్కృతిక పరమైనది, రాజకీయపరమైనది కాదు. దేశం యొక్క నిర్మాణం భూమి, ప్రజలు మరియు సంస్కృతితో జరుగుతుంది. వేదాలలో ఋషులు ...


దేశమంటే సాంస్కృతిక పరమైనది, రాజకీయపరమైనది కాదు. దేశం యొక్క నిర్మాణం భూమి, ప్రజలు మరియు సంస్కృతితో జరుగుతుంది. వేదాలలో ఋషులు ఇలా చెప్పారు...
భద్ర మిచ్చన్త ఋషయః స్వర్వదస్తపో దీక్షాం ఉపసెదు: అగ్రె!
తతో రాష్ట్రం బలం ఓజశ్చ జాతమ్ తస్మై దేవా ఉపసం నమన్తు!!
- అధర్వవేదం, 19-41-01
దేశం రాజ్యాశ్రితం కాదు: ఇక్కడి సమాజం రాజ్యాశ్రితంగా లేదు. పాఠశాలలు, మఠలు, మందిరాలు, అన్నిచోట్లా వ్యాపించాయి. సన్యాసిపరంపర మరియు ఉమ్మడి కుటుంబం మొదలగునవి అన్నీ సాంస్కృతిక చైతన్య కేంద్రాలుగా స్వతంత్రంగా ఉండేవి. అనేక జాతరలు, ఉత్సవాలు మరియు విభిన్న పరంపరలు సమాజాన్ని కలిపి ఉంచాయి. కుంభమేళా, పుష్కరాలు, చార్ ధామ్ యాత్ర మొ|| ఇంతేకాదు ఇక్కడి ఆర్థిక వ్యవస్థ కూడా స్వావలంబనంతో కూడినది మరియు వికేంద్రీకరణంగా ఉండేది. సాంస్కృతిక దృష్టితో కూడా ఎక్కువ తేడా ఏమీ లేదు.
పైన పేర్కొన్న అన్ని వ్యవస్థల ద్వారా ఇక్కడి సమాజం అన్ని రకాల సంస్కారాలను రూపొందించి, సంఘర్షణ సందర్భంలోనూ మన ధర్మానికి కట్టుబడి ఉండే ప్రేరణను
పొందుతూ వచ్చింది.
ధర్మదండం అన్నింటికీ పైన: ఇక్కడి రాజులు తమపైన ఎల్లప్పుడూ ధర్మదండాన్ని (సమాజ శక్తిని) ఉండేలా చూసుకున్నారు. అంటే సమాజపు నైతిక శక్తి రాజ్యశక్తి కన్నా పైన ఉండేది. రాజ్యశక్తి పైన ప్రజాశక్తి లేదా ధర్మశక్తి అంటే దేశం ప్రభావం కల్గి ఉండేది.
వివిధత్వంలో ఏకత్వం: వేర్వేరు భాషలు, వేషభూషలు, ఆహారపు అలవాట్లు మొదలగునవి దేశ ఏకాత్మతకు బాధాకరంగా పరిణమించలేదు. పైగా వివిధత్వంలోనే ఏకత్వ దృష్టి ఉండి అదే దేశ ఏకాత్మతకు పోషకంగా ఉండాలి.
రాజ్యం అనేది సాధనం మాత్రమే: పాశ్చాత్య దేశాలలో రాజ్యం అనేది సాధ్యం(GOAL). మన దగ్గర సమాజ జీవనాన్ని నడపడానికి రాజ్యం ఒక సాధనం మాత్రమే. ఇక్కడ కేవలం భౌతిక ఆలోచన లేక, శాశ్వత జీవన విలువలను ప్రవేశపెట్టడంలో రాజ్యం సహకరిస్తుంది. శివాజీ రాజ్యం సంపాదించడం కొరకు యుద్ధం చేయలేదు, హైందవి స్వరాజ్యాన్ని స్థాపించడానికి మరియు దాని స్వాభిమానాన్ని తిరిగి తేవడానికి యుద్ధం చేశాడు. అందువల్లే తన రాజ్యంలో జీవన విలువలు ప్రవేశపెట్టగలిగాడు.
పాశ్చాత్య దేశాలలో రాష్ట్రం (దేశం) కల్పన: పాశ్చాత్య దేశాలలో చిన్న చిన్న రాజ్యాలు కలిసి దేశం ఏర్పడింది. అంటే రాజ్యాల ద్వారా దేశం వికసింపబడింది. అందువల చిన్న దేశాలపట్ల వారి అభిప్రాయం రాజకీయపరమైనది. ఉదా|| స్కాట్లండ్, ఐర్లాండ్, వేల్స్ అనే రాజ్యాలు కలగలసి ఇంగ్లండ్ దేశం ఏర్పడింది. అమెరికా కూడా 50 రాజ్యాలతో కూడి దేశంగా ఏర్పడినది. కాబట్టి పశ్చిమాన దేశ కల్పన అనే సమగ్ర ఆలోచన రాజ్యం యొక్క నాలుగు నలుమూలల తిరుగుతుంటుంది.
దేశంపట్ల భారతీయ ఆలోచన: భారత్ లో రాజ్యం మారుతుంది. కానీ దేశం అనేది అవిచ్ఛిన్నంగా ఉంటుంది. విదేశీ దండయాత్రలు అలలు అలలుగా సాగిన, అవి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించాయే తప్ప భారత దేశాన్ని నాశనం చేయలేకపోయాయి. అయితే ప్రపంచంలో అనేక ప్రముఖ దేశాలు దండయాత్రలకు లోనై ఒక దెబ్బకే అంతరించి పోయాయి. యునాన్, రోమ్, మిశ్ర మొ||.
దేశం పట్ల పాశ్చాత్యులు అభిప్రాయం: పశ్చిమ దేశాలకు ఆధారం రాజకీయపరమైనది. ఒకవేళ రాజ్యం నశించిపోతే దేశం కూడా నశించినది. అయితే భారత దేశానికి ఆధారం సాంస్కృతికపరమైనది. అందుకే మన దేశం చిరంతనమైనది. పశ్చిమాన రాజ్యమే దేశం.
నేడు దేశంపట్ల భారతీయ అభిప్రాయానికి ప్రపంచమంతటా మన్నన లభిస్తోంది. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా కొరొనా వైరస్ మహమ్మారి దాటికి అతలాకుతలం అయిన సందర్భంలో భారత సంస్కృతి విశ్వవ్యాప్తం అవుతుంది.. మనల్ని మూఢనమ్మకాల దేశం అన్నవారు నేడు మన ఆచారాలు అమలు చేస్తున్నారు... ఉదా: నమస్తే, మామిడి తోరణాలు కట్టడం, చెట్లను, పుట్లను పూజించడం, బొడ్డుతాడు మొదలగునవి...
ఈ కఠిన పరిస్తితులలో దేశం లో అందరూ ఒకటే అనే విషయం పై అందరము ఒకరికి ఒకరు అనే భావన కలిగివుంది అనడానికి దేశ ప్రధాని పిలుపు మేరకు... రక్షణ, వైద్య, పారిశుధ్య కార్మికులకు సంఘీభావంగా కరతాళ ద్వనులు, అలేగే దేశం అంతా దీపం వెలిగించడం ఇలాంటి వి అన్నీ దేశం అంతా ఒకటే ఇది నా దేశం అనే భావను కలిగి ఉంచాయి అని తెలుస్తుంది... మొత్తం గా కలిపి దేశం అంటే తల్లి... భారతమాత.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments