Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సమ్మక్క సారక్క ల వాస్తవ చరిత్ర - Real Story Behind Sammakka Sarakka

హిందూ వీర వనితలు సమ్మక్క-సారక్కలు 13వ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్...హిందూ వీర వనితలు సమ్మక్క-సారక్కలు
13వ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం జరిగింది. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. మేడారాన్ని పాలించే కోయరాజు "పగిడిద్దరాజు" కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. అయినప్పటికీ ప్రజలని కన్నబిడ్డల వలె చూసుకొనే కాకతీ ప్రతాప రుద్రుడు మిగతా సామంత రాజుల కప్పంతో మేడారం ప్రజల బాధల్ని తొలగిస్తాడు. అత్యంత రాజభక్తి కల్గిన పడిగిద్ద రాజు ప్రతిఫలంగా రాజ్య సంరక్షణ కొరకు పెట్టని కోటలా గిరిజన వీరుల్ని తయారు చేస్తాడు.
     క్రీ.శ.1309లో మాలిక్ కాఫుర్ ఢిల్లీ సుల్తాను అలావుద్దీన్ ఖిల్జీ (క్రీ. శ. 1296-1316) ఆస్థానములోని నపుంసక బానిస మరియు సేనాధిపతి కాకతీయ సామ్రాజ్యం వైపు పయనిస్తాడు( వింధ్య పర్వతములకు దక్షిణమున గల హిందూ రాజ్యముల వినాశనముకు, ప్రాచీన దేవాలయముల విధ్వంసమునకు, లక్షలాది హిందువుల బలాత్కార మతమార్పిడికి, ఎనలేని సంపద కొల్లగొట్టి ఢిల్లీ చేర్చుటకు కారణభూతుడు) మాలిక్ ఖాపర్ దేవగిరి నుండి ఓరుగల్లు పై దాడికి సన్నాహాలు చేస్తాడు. అప్పటికి 18 ఏండ్ల క్రితము మార్కొ పోలో చైనా నుండి తిరిగి వెళ్ళుతూ దక్షిణ భారతము సందర్శించి భర్తను కోల్పోయిన కాకతీయ రాణి రుద్రమదేవి గురించి, ఆమె సంరక్షణలో పెరుగుతున్న ప్రతాపరుద్రుని గురించి, ఓరుగల్లులోని అమూల్యమైన సంపద గురించి వ్రాశాడు. కాఫుర్ వచ్చు సమయానికి ప్రతాపరుద్రుడు రాజ్యాధికారము చేబడతాడు. కాఫర్ దేవగిరిమీదుగా పయనించి దారిలో సిరిపూరు కోటను స్వాధీనము చేసుకుంటాడు. అక్కడి నుండి సమీప కాకతీయ రాజ్యంలోని మేడారం పైకి దండెత్తాడు.
      మేడారం వస్తూ వస్తూ మాలిక్ ఖాఫిర్    అమాయక ప్రజలను, ఆడువారిని, పిల్లలను, ముసలివారు అని కూడా చూడకుండ నరసంహారం చేసాడు. సైనికులు స్త్రీలపై అత్యాచారాలు చేశారు.
అన్ని గమనించిన పడిగిద్ద రాజు, సమ్మక్క రాక్షస సంహారం జరగాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు.
      సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు,సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని దురాక్రమణ దారులు అయిన ముస్లిం సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.
   ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన మాలిక్ ఖాపర్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి మాలిక్ ఖాపర్ ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది.
         కాకతీయ రాజ్య సంరక్షణ కొరకు, ప్రజల మాన-ప్రాణ-ధన రక్షణలో అసువులు బాసిన సమ్మక్క- సారలక్కలని శక్తిస్వరూపాలుఁగా భావించి ప్రతాప రుద్రుడు గిరిజన కోయ జనులతో కలిసి పూజలు ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి సమ్మక్క జన్మించిన మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
          ఇంతటి ఆత్మగౌరవం కల సమ్మక్క సారక్కల చరిత్రను వక్రీకరిస్తున్నారు.
1260-1323  మధ్యకాలంలో కాకతీయు రాజుల పాలన  తెలంగాణ ప్రాంతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రజలను ఆ రకంగా రక్షించుకున్నారు. సామాజిక, ధార్మిక, విద్య, కళా రంగాలే కాక , వారి ఆర్ధిక అభివృద్ధి కోసం చేసిన పనులు, తవ్వించిన చెరువులు.., ఆ సమయంలో ప్రపంచంలో మరెవరూ చేయలేదు అని అనేకమంది రాసి ఉన్నారు. ఆ కాలాన్ని స్వర్ణాక్షరాలతో  లిఖించదగిన  కాలం అంటూ చెప్పేవారు. ఆ సమయంలో కాకతీయ ప్రభువులు ప్రజలను  కన్న బిడ్డలవలె చూసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యం పైన దాడి చేయడానికి వచ్చిన  ముస్లింలను  అనేకసార్లు తన్ని తరిమి వేసిన  చరిత్ర  కాకతీయులది .
      ముస్లింల దాడులకు ధీటైన సమాదానం చెప్పిన తమకు వెన్నంటి ఉండే... గిరిజన, కోయ సామంత రాజులు.., మరియు వారి ద్వారానే 25,000 విలుగాల్లను సమకూర్చకున్న కాకతీయులకు సామంతులైన గిరిజన రాజులను... అంటే తమ సామంతులను 'తమ ప్రజలను తామే చంపుకునే , మరియు ప్రజల ఇళ్లను తమ సైనికుల తోనే కాల్చి వేసేంత పరిస్థితి నిజంగా ఉన్నదా'? అంటే లేదనే చెప్పవచ్చును.

       అందులో బయటి వారితో, రాక్షసులైన ముస్లిం రాజులు దండయాత్ర  చేస్తున్న సమయంలో ,చాలా ముఖ్యమైన యుద్ధాలు చేస్తున్నటువంటి ఆ సమయంలో తమ సొంత రాజ్యంలో ఇలా సమస్యలు సృష్టించుకోరు అనేది చరిత్రను అధ్యయనం చేసిన వారికి తెలిసే విషయం.
     కానీ అర్బన్ నక్సలైట్లు , కమ్యూనిస్టు అద్దాల నుండి చూస్తున్న రచయితలకు అప్పటి విషయాలు గురించి వక్రీకరిస్తూ తమకు తోచినట్లుగా ఈ భూమి బిడ్డలకు మరియు బ్రాహ్మణ వాదానికి మధ్య జరిగిన పోరాటంగా చిత్రిస్తున్నారు... (కాకతీయ పాలకులు ఎక్కడినుంచో వచ్చి నట్లు) మరియు సమ్మక్క సారక్క  పగిడిద్దరాజును  జంపన్నని కాకతీయులు భయంకరంగా వెన్నుపోటు పొడిచారు,"గిరిజనులను చంపారు" అంటూ చిత్రీకరిస్తున్నారు,
విషం కక్కుతున్నారు.( పాటల రూపంలో , రాతల రూపంలో , వీడియోలు తీస్తూ)
          కాకతీయుల అసలు చరిత్రను మరింత వెలికి తీయాలి సమాజానికి అందించాలీ.అప్పటి విషయాలనువక్రీకరించి  చెబుతూ ప్రస్తుత  సమాజంలో సంఘర్షణ పెంచడం కోసం ప్రయత్నిస్తున్న అర్బన్ నక్సలైట్ల నోళ్లకు తాళాలు పడాలీ.సమరసతా సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం రచయితలు, చరిత్రకారులు  పూనుకోవలసిన ఉన్నది.
-సామల కిరణ్(ప్రముఖ చరిత్రకారులు పద్య కవులు)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. వీడొక్కడే అసలైన కళ్లజోళ్లు పెట్టుకుని రాశావా

    ReplyDelete