Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన తల్లికి భావోద్వేగంతో రాసిన ఉత్తరం - Subhash Chandra Bose Letter to His Mother

నేతాజీ తన తల్లి ప్రభావతీ కి రాసిన ఒక ఉత్తరం ఇది దేనిపైన కూడా తేదీ వేయలేదు. కానీ ఇది 1912-13 మధ్యలో రాసినవని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాంచీ ...

నేతాజీ తన తల్లి ప్రభావతీకి రాసిన ఒక ఉత్తరం ఇది దేనిపైన కూడా తేదీ వేయలేదు. కానీ ఇది 1912-13 మధ్యలో రాసినవని ఖచ్చితంగా చెప్పవచ్చు.
రాంచీ
ఆదివారం
గౌరవనీయురాలైన అమ్మకు,
చాలా రోజులుగా నాకు కలకత్తా సమాచారం తెలియలేదు. మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తాను. బహుశా తీరికలేకనే మీరు ఉత్తరం రాయలేదనుకుంటాను.
నడిపి అన్న పరీక్షలు ఎలా రాసాడు? మీరు నా ఉత్తరం అంతా చదివారా? చదవకుండా ఉంటే నాకు నిజంగానే బాధ కలుగుతుంది. అమ్మా, ఇప్పుడు భరతమాత పుత్రుల్లో స్వార్ధం లేని వారు ఒక్కరూ లేరా అని నేను ఆలోచిస్తూ ఉంటాను. మన మాతృభూమికి ఇంత దురదృష్టం పట్టిందా? సువర్ణమయమైన మన గతకాలం ఎలా ఉండేది! ఈ వర్తమాన కాలమెలాఉంది! భారత మాత సేవలకు తమ అమూల్య జీవితాన్ని సంతోషంగా ఆర్పిస్తూ ఉండిన ఆ ఆర్యవీరులు నేడు ఎక్కడున్నారు?
నీవు ఒక తల్లివి. కానీ నీవు కేవలం మాకేనా తల్లివి? కాదు, నీవు భారతీయులందరికీ తల్లివే. భారతీయులందరూ నీకు పుత్రులైనప్పుడు నీ పుత్రుల దుఃఖం నిన్ను వ్యధతో చలింపజేయదా? ఏ తల్లి అయినా నిర్దయగా ఉండగలదా? అలాంటప్పుడు ఆమె పిల్లలు ఇలాంటి దురవస్థలో ఉన్నా తల్లి చలించకుండా ఉండడానికి కారణమేమి? మరి తల్లి కూడా స్వార్థపరురాలు కాగలదా? కాదు, కాదు, అలా ఎన్నటికీ జరగదు. తల్లి ఎప్పటికీ స్వార్థపరురాలు కాలేదు.
అమ్మా, కేవలం దేశానికే దుర్దశ పట్టలేదు. మన మతానికి ఏ గతి పట్టిందో చూడు! మన హిందూ మతం ఎంత పవిత్రంగా ఉండేదో! అలాంటిది ఇప్పుడు ఏ విధంగా పతనావస్థలోకి జారిపోతోందో చూడు. నీవు ఈ భూమి
వైభవాన్ని పెంచిన ఆఆర్యుల గురించి ఆలోచించు. నేడు అధోగతి పాలై మన ఎదుట కనపడుతున్న వారి వంశస్తులను చూడు. మరి మన సనాతన మతం క్షీణించి పోతోందా? నాస్తిక వాదం, శ్రద్ధా రాహిత్యం, అంధ విశ్వాసాల ప్రాబల్యం ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడు. దీని పరిణామమే ఇంత పాపం. ప్రతి మనిషికీ దుఃఖము, కష్టాలు, ఆర్య జాతి ఎంత ధర్మచింతనగల జాతో నీకు తెలుసు. వాళ్ళ వంశీకులే నేడు ఎంతటి ఆధార్మికులు, నాస్తికులు అయిపోయారు! గత కాలంలో ధ్యానం, ప్రార్ధన, ఉపాసన ఇవే మనిషి విధులుగా ఉండేవి. కానీ, ఈ రోజు తమ జీవితంలో ఒక్కసారైనా దేవుని తలచుకునేవారు ఎంతమంది ఉంటారు? చెప్పమ్మా, ఇదంతా చూసి, ఈ విషయాలన్నీ విని, నీ హృదయం ఆక్రోశించదా? నీ కళ్ళల్లో నీళ్ళు నిండావా? ని మనసు కలవరపడదా? అలా జరగదంటే నేను ఒప్పుకోను. తల్లి ఎన్నడూ మమకారం లేకుండా ఉండలేదు.
అమ్మా, నీవు నీ పిల్లల దురవస్తను పరిశీలించి చూడు. పాపం, దుఃఖం,ఆకలి, తపన, ఈర్ష్య, స్వార్ధ పరత్వం, వీటన్నింటినీ మించి అధర్మం, ఇవన్నీ కలిసి వాళ్ళ మనుగడని నరకప్రాయంగా చేసాయి. ఆపైన మన
పవిత్ర సనాతన ధర్మం ఎలాంటి దుర్దశలో ఉందో అది కూడా చూడు. అది ఎలా లోపించి పోతోందో చూడు. భక్తి గౌరవాలు లేకపోవడం, నాస్తికత్వం గుడ్డి నమ్మకాలు ఇవన్నీ కలిసి దాన్ని పతనంవైపు లాక్కెళ్తున్నాయి. దాన్ని
వికృతంగా మారుస్తున్నాయి. అంతేకాక ఈ రోజుల్లో ధర్మం పేరుతో ఎన్ని పాపపు పనులు జరుగుతున్నాయి, పవిత్ర స్థానాల్లో ఎంత అధర్మం వ్యాపించింది అంటే మాటల్లో దాన్ని వర్ణించలేము. నీవు జగన్నాథపురిలో పండాల దుర్దశని
తీసుకో. వాళ్ళది ఎంత లజ్జాకరమైన స్థితో చూడు. మన ప్రాచీనకాలంలోని పవిత్ర బ్రాహ్మణులెక్కడ? ఎక్కడైనా కొద్దిగా ధర్మాచరణ ఉంటే, అక్కడ మత ఛాందసం, పాపం రాజ్యమేలుతున్న ఈ కాలమెక్కడ?
మనం ఆస్థితి నుండి ఈ స్థితికి దిగజారి పోవడం ఎంత శోచనీయం! మన ధర్మం ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారింది! అమ్మా, ఇవన్నీ ఆలోచిస్తే నీకు అశాంతి కలుగదా! నీ హృదయం వేదనతో ఆక్రోశించదా!
మనదేశం రోజు రోజుకూ ఇంకా పతనమైపోతూ ఉండవలసిందేనా? దుఃఖించే భరతమాత పుత్రుల్లో స్వార్ధాన్ని పూర్తిగా త్యజించి తన జీవితాన్నంతా తల్లి సేవకు అర్పించగలవారు ఒక్కరూ లేరా?
చెప్పమ్మా, ఎంతకాలం మనం ఇలా నిద్రపోతూ ఉంటాం? ఎంత కాలం నిరర్థకమైన విషయాలతో కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటాం? దేశ ఆక్రందన వినపడకుండా చెవులు మూసుకొని ఉండగలమా? మన పురాతన మతం మృత్యుశయ్యపైన ఉంది. మన హృదయం ఇప్పటికీ కరగదా? తమ దేశం, ధర్మం దుర్దశ పాలవుతూ ఉంటే ఎవరైనా చేతులు కట్టుకొని ఎంత కాలమని చూస్తూ ఉంటారు? ఇక పైన వేచి ఉండడం వీలుపడదు. ఇంకా నిదురిస్తూ ఉండేందుకు అవకాశం లేదు. మనం జడత్వం నుండి మేల్కోకో తప్పదు. సోమరితనాన్ని త్యజించక తప్పదు. కార్యదీక్షలో లీనంకాక తప్పదు. కానీ స్వార్ధమయమైపోయిన నేటి యుగంలో తమ సొంత లాభాలను పూర్తిగా కట్టి పెట్టి మాతృ సేవకు తమను తాము అర్పించుకోగలిగే వాళ్ళు భరతమాత కన్న బిడ్డలు చాలా తక్కువగా ఉండటం ఎంత దౌర్భాగ్యకరం! అమ్మా, నీ ఈ కుమారుడు అందుకు తయారు కాగలిగాడంటావా?
ఎనభై నాలుగు లక్షల యోనులలో సంచరించిన తర్వాత మనకు ఈ మానవ జన్మ లభ్యమయింది. బుద్ధి, చైతన్యం, ఆత్మలాంటి శక్తులు మనకు లభించాయి. కానీ ఇవన్నీ ఉండి కూడా పశువుల్లాగా తినడం, నిద్ర పోవడంతోనే తృప్తి పడి ఉంటే, ఇంద్రియాలకు దాసులమై ఉంటే, కేవలం మన గురించే ఆలోచించుకుంటూ నీతి లేని జీవితం జీవిస్తే మనం మానవ జన్మ ఎత్తినందుకు సార్ధకత ఏమిటి? నిజానికి సమాజ సేవకు అర్పితమైన జీవితమే జీవితం. అమ్మా, నేనిదంతా నీకు ఎందుకు రాస్తున్నానో తెలుసా? ఈ మాటలను, ఎవరితో చెప్పాలో నీవే చెప్పు. నా మాటలు ఎవరు వింటారు? ఎవరు వీటిని లెక్క చేస్తారు? ఎవరి జీవితాలు స్వార్థానికి వశమైపోయి ఉంటాయో వాళ్ళు ఎప్పుడూ ఈ విధంగా ఆలోచించలేరు. ఎందుకంటే అలా ఆలోచించినప్పుడు వారి స్వార్ధం దెబ్బతింటుంది. కానీ ఒక్క తల్లి జీవితం మాత్రం నిస్వార్ధంగా ఉంటుంది. ఆమె జీవితం తన పిల్లలకు, తన దేశానికి అర్పితమై ఉంటుంది. భారతదేశ చరిత్ర చదివితే ఎందరు తల్లులు భరతమాత కోసం జీవించారో, సమయం వచ్చినప్పుడు భరతమాత కోసం తమ ప్రాణాలు ఎలా బలి ఇచ్చారో నీకు తెలుస్తుంది. అహల్యాబాయి, మీరాబాయి, దుర్గావతి ఇలాంటి వారే. ఇలాంటి వారు ఇంకా ఎందరో ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకిప్పుడు గుర్తుకు రావడం లేదు. మన లాలన-పాలన తల్లి పాలతో జరుగుతుంది. అందువల్ల తల్లినుంచి లభించే విద్యాబుద్ధులకు, మార్గదర్శిత్వానికి మించి నేర్చుకోవలసిందీ, ఉదాత్తమైందీ ఏదీ ఉండదు.
ఏ తల్లి అయినా తన పుత్రునితో నీవు ఏ పరిస్థితిలో ఉన్నవో పరిస్థితిలోనే సంతృప్తిగా ఉండు అని అంటే దీనికి ఎవరేమనగలరు? అలాంటి పుత్రుడు నిజంగా చాలా దురదృష్టవంతుడు అలా జరిగినప్పుడు నేటి పాపమయ యుగంలో మంచి మనుషులు పూర్తి కరువు ఏర్పడడం ఖాయం. ఇక భవిష్యత్తు గురించి కూడా ఆశించడానికి ఏమీ ఉండదు. అప్పుడు పశ్చాత్తాప పడడానికి మించి ఏమీ చేతికందదు. ఇదే నిజమైనప్పుడు, పునరుద్ధరణకు సంబంధించిన అన్ని ఆశలూ అడుగంటి పోయినప్పుడు, చేతులు కట్టుకొని కూర్చోవడం మనకు శరణ్య మయినప్పుడు ఈ అధఃపతనాన్ని, కష్టాన్ని కేవలం చూస్తూనే ఉండవలసి వచ్చినప్పుడు ఈబాధ అంతా ఎందుకు? జీవితంలో ఇంతకు మించి పొందేది ఏదీ లేనప్పుడు నేను జీవించైనా ఎందుకు ఉండాలి? ఇలాంటి ప్రశ్నలు నాలో తల ఎత్తుతూంటాయి.
నేను జీవితమంతా ఇతరులకు సహాయం చేస్తూ గడిపినట్లు చేయమని దేవుని ప్రార్థిస్తున్నాను. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తాను. ఇక్కడ మేము ఆనందంగా ఉన్నాం. దయచేసి నా నమస్కారాలు స్వీకరించు. ఈ ఉత్తరానికి తప్పకుండా బదులు రాయి.
ఎల్లప్పటికీ నీ ప్రియమైన పుత్రుడు
సుభాష్

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

3 comments

  1. At this junctor this kind of things are very badly required in my boyhood we used to inspired by Hearing Harikathalu,Puranalu & in after noon elders teaching Stories etc are Leded our path towords worthfull & Spiritulisam Life but now a days with concept schools the pupils lost this kind of Leading life & nation Sprit.

    ReplyDelete
  2. The above published comment was by me.I am a journalist & managerVijayawada for Mahita Telugu Daily published from Vijayawada.cell 9499337013.with added whats app.Sorry for not given in the above coloum

    ReplyDelete