Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అయోద్య రామ జన్మభూమి ఉద్యమం సమగ్ర విశ్లేషణ - Ayodhya Movement And Analysis - MegaMinds

రామ జన్మభూమి ఆందోళన ఒక అవలోకనం : నేటికి అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి ఈ వార్త వినడం తోనే అనేక అనుమానాలు తెరపైకి వస్త...


రామ జన్మభూమి ఆందోళన ఒక అవలోకనం :
నేటికి అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి ఈ వార్త వినడం తోనే అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి ఈ క్రమంలో కొందరు అనుమానిస్తున్నట్లుగా, గోగోయ్ క్రైస్తవ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కొడుకు అయినంత మాత్రాన, వారుఅత్యంత ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి, సమాజ హితాన్ని విస్మరిస్తున్నారని భావించలేము. కానీ గతంలో అనేక కారణాలను చూపిస్తూ అప్పటి సుప్రీం కోర్టు జడ్జికి వ్యతిరేకంగా మన భారత న్యాయ వ్యవస్థ యొక్క సంప్రదాయానికి విరుద్ధంగా రోడ్డుపైకి వచ్చి కూర్చొని, పత్రికల్లోకెక్కి నానా రభస చేసి అప్పటి తీర్పును కూడా ప్రభావితం చేసిన వ్యక్తుల సమూహంలో ఇతడే నాయకుడు మరి. అనేక వాదనలు కూడా వినిపిస్తున్న తరుణంలో చూద్దాం ఏం జరగబోతుందో, అంటూ దేశ ప్రజలే కాక ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు జరిగితే, లేదా మరొక ప్రత్యేకమైన ఆటంకాలు గానీ ఎదురైతే ఒకవేళ ఏ కారణం వలన అయినా తీర్పు ఆలస్యమైతే, రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్న కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చట్టం చేయాలి.
హిందూ సమాజానికి తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా, గతంలో ప్రభుత్వం తన చేతిలోకి తీసుకున్న 77.7 ఎకరాల భూమిని సొంత దారులైన రామజన్మభూమి న్యాస్ కు తిరిగి ఇవ్వాలి. దీని కొరకు కూడా పార్లమెంటులో చట్టం చేయాలి.
అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం మరికొన్ని తిరకాసులు పెట్టింది అవన్నీ సరిచేయడానికి మరికొంత సమయం పడుతుంది. ఏది ఏమైనా అక్టోబర్ లేదా నవంబర్ లోనే నిర్మాణం ప్రారంభం కాక పోవచ్చు.
ఈ ఊహాగానాలు ఇలా ఉంటే మరొకవైపు: రామ జన్మభూమి ఉద్యమం అంటే, మసీదులను పడగొట్టడం, కేవలం, గుడి కట్టడం, దానికై హిందువులను రెచ్చగొట్టడం, దేశంలో గొడవ పెట్టడం, తమవారు కానివాళ్లను హత్యలు చేయడం, అన్య మతస్థులను దేశం నుండి వెళ్లగొట్టడం, అంటూ దేశ వ్యతిరేక శక్తుల చేతిలో ప్రభావితులైన అనేక మంది ఇటువంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి 'మెకాలే' మానస పుత్రులే రామ జన్మభూమి ఉద్యమ చైతన్యానికి కువ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రామ జన్మభూమి ఉద్యమం ద్వారా దేశానికి జరిగిన మేలు ఏమిటి అని ఒకసారి అవలోకిస్తే అనేక విజయాలు, విషయాలు భారతదేశ యవనికా పటలంపైన దొంతరలు దొంతరలుగా కనిపిస్తాయి. రామ జన్మభూమి ఉద్యమం ద్వారా దేశానికి కీడు జరిగిందా లేకా మేలు జరిగిందా ..? వందల సంవత్సరాలుగా అణగదొక్కబడి, పీడించబడి, దోచుకోబడి , విధ్వంసమైన, చీలికలు పేలికలై విడివడిపోయిన హిందూసమాజం రామజన్మభూమి ఆందోళనతో ఐకమత్యం అయింది. రామజన్మభూమి ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో హిందూ సమాజం యొక్క చైతన్యాన్ని చూసి ఓర్చుకోలేని శత్రు దేశాల దుష్ప్రచారానికి ,కొన్ని మతవర్గాల మరియు రాజకీయ నాయకులు పనిగట్టుకొని దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం వలన సంభవించిన కీడు అపారమైనదే, ఇలా భారత దేశానికి హిందూ సమాజానికి కీడు తలపెట్టడం ఈ వర్గాలకు మొదటిసారి కాదు, 712 వ సంవత్సరం "మీర్ ఖాసీం" ఆక్రమణల నుండి కొనసాగింపుగానే జరిగింది అని గుర్తించాలి.
ఇక రామజన్మభూమి ఆందోళన కారణంగా జరిగిన మేలు ఏమిటి?  ఆ కోణంలో ఒక పరిశీలన భారతదేశంలో సామాజిక సద్భావనకు గొప్ప తార్కాణంగా భావించబడిన మార్పు సంభవించింది.. ఈ ఆందోళన ద్వారానే అని చెప్పవచ్చు.
ఉదాహరణకు : రామజన్మభూమి మందిర నిర్మాణానికి శంకుస్థాపన ఎవరో శంకరాచార్యులు లేదా వైష్ణవ స్వాములు లేదా రాజకీయ నేతలు మరియు ఆర్ఎస్ఎస్ నాయకులు జరపలేదు, తరతరాలుగా అణచివేతకు గురి కాబడిన అనుసూచిత సమూహానికి చెందిన అంటరాని వారిగా అనేక సంవత్సరాల నుంచి పిలువబడిన వర్గాలకు ప్రతినిధిగా బీహార్ కు చెందిన శ్రీకామేశ్వర్ చౌపాల్ అనే ఒక సాధారణ వ్యక్తి శంకుస్థాపన చేశాడు మరి. ఇది నా భారత దేశము మారుతున్నది అని చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. తరతరాల బానిసత్వపు సంకెళ్లు ఛేదించుకొని నా హిందూ జాతి మేల్కొన్నది. స్వదేశీ భావనతో స్వాభిమానపు ఆలోచనతో పురోగ మిస్తున్నదని సగర్వంగా ప్రపంచానికి తెలియజేసినదీ. రామ జన్మభూమి ఉద్యమంలో స్వాతంత్ర్య ఉద్యమం నాటి కన్న ఎన్నో రేట్లు ప్రజల భాగస్వామ్యం ఉండింది. కోట్లాది మంది ప్రజలు పాల్గొన్న ఇలాంటి కనివిని ఎరుగనంతటి శాంతియుత ఉద్యమం ప్రపంచంలో ఏ దేశంలోనూ రాలేదు. ఉద్యమంలో పాల్గొన్న వారే కాక ఉద్యమపు ప్రభావానికి లోనైన వారి సంఖ్య అనేకానేక రెట్లుగా ఉండింది. దశాబ్దాలుగా జరిగిన రామజన్మభూమి విముక్తి ఆందోళన, ధార్మిక, సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక రాజకీయ రంగాలను కూడా ప్రభావితం చేసింది. గతంలో హిందూ జాతి ప్రపంచానికి మార్గదర్శనం చేసింది మనిషి మనిషిగా బతకడం ఎలాగో నేర్పించింది, మానవత్వపు పరిమళాలను వెదజల్లింది, విశ్వ గురువుగా వెలుగొందింది.
ఇప్పుడు మళ్లీ రామజన్మభూమి ఆందోళన పుణ్యమా అని వచ్చిన చైతన్యం ద్వారా మళ్లీ అదే పనిలో నిమగ్నమైది .
వైజ్ఞానిక రంగం: గతంలో ఒక్క ఉపగ్రహాన్ని ప్రయోగించాలన్నా విదేశాలకు వెళ్లి పంపిస్తూ ఉండే భారతదేశం రామజన్మభూమి ఆందోళనతో సంభవించిన స్వాభిమానపు తరంగాల ప్రభావపు స్పర్శ వైజ్ఞానిక రంగానికి కూడా తగిలింది. ఎంతగానంటే, ఒక్క రాకెట్టుతో వందలకొలది ఉపగ్రహాలను ఆకాశంలో పంపగలిగేంతగా, చంద్రమండలంపైకి వెళ్ళగలిగే అంతగా పట్టుదలను రేకెత్తించింది.
సామాజిక రంగంలో మార్పు: గతంలో సామాజికంగా అణచి వేయబడిన వర్గాల ప్రతినిధులే రాష్ట్రపతి , ప్రధానులై... సామాజిక న్యాయం అందిపుచ్చుకుని దేశానికి నాయకత్వం వహిస్తూ, సామాజిక అంతరాలను దూరం చేసుకుని మనమంతా హిందువులం బంధువులం భారత మాత బిడ్డలం అనే సందేశానికి బద్దులై, దేశ ప్రజలు కలిసిమెలిసి జీవించడానికి దారి చూపింది. సామాజిక జీవనాన్ని మలుపు తిప్పి సామాజిక ఐక్యత ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాల అధిరోహణంవైపు ప్రయాణం కొనసాగింప చేస్తున్నది అనడంలో సందేహం లేదు.
రాజకీయ క్షేత్రం: రోజూ మనం చూస్తున్నదే అద్భుత విజయాలతో హైందవ భావ పరంపరా పథగాములే నాయకత్వం వహించడం, దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళాలనే సంకల్పంతో రాత్రింబవళ్లు పని చేస్తున్న దేశభక్తుల సమూహం, వారందిస్తున్న విజయాలను దేశం అనుభవిస్తున్నది సత్యమే కదా. ఇటువంటి స్వాభిమాన పూరితుల నేతృత్వంలోనే ఆర్థిక రంగం కూడా స్వాభిమానంతో కూడిన దేశీయ ఉత్పత్తుల కారణంగా దేశ సంపత్తి పెరిగింది ఎంతగానంటే బంగారం కుదువ పెట్టిన దగ్గరనుండి అగ్ర రాజ్యాలైన అమెరికా మరియు రష్యా దేశాలకు అప్పులు ఇచ్చేంత వరకు, మరో విధంగా చెప్పాలంటే.' గతంలో మిస్సుడు కాల్ ఇచ్చిన వ్యక్తే నేడు వీడియో కాల్ చేయడం వరకు' , ఇలా సాధారణ పౌరుడి ఆర్థిక ప్రగతిని కూడా చూస్తున్నాం.
మరి ముస్లింలు: ఈ దేశంలో పుట్టిన ప్రజలు ఎప్పుడు ఇతరుల ఆరాధనా పద్ధతి చూసి అసహ్యించు కోలేదు, అది వివిధత్వము లేదా వైవిధ్యము అని మాత్రమే భావిస్తారు. దేశ సరిహద్దులకు సార్వభౌమత్వానికి హిందూ ధర్మానికి హాని కలగనంత వరకు, వందలాది దేవతలను పూజిస్తున్న హిందువులు మరో ఇద్దరు దేవతలు అధికంగా వచ్చారని మా రైలులో సీటు లేదని అనుకునేంత సంకుచితులు కానేకారు. ఎవరి పూజా విధానాన్ని కూడా అగౌరవపరచరు , అణచి వేయరు. ఈ భావన మన దేశం యొక్క గొప్పతనం, ఎంతగానంటే జన్మతః ముస్లిమ్ అయినప్పటికీ దేశ భక్తుడైన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా భుజాలపై ఎక్కించుకొనేంతగా, అది కూడా రామ జన్మభూమి ఆందోళనకు నాయకత్వం వహించిన వారే అనే విషయాన్ని మరువ వద్దు.
( శత్రుదేశాలు భారతదేశం పట్ల చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. విదేశీ ఆక్రమణ కారుడైన బాబర్ ను, మన పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ దేశద్రోహి అఫ్జల్ గురు , భారత సైనికులను హత్య చేసిన బుర్హాన్ వని, "మావాడు" మా మతం వాడు అనేంత దూరం వెళ్ళిన దేశ వ్యతిరేక శక్తుల విద్రోహ పూరిత ప్రచారాలను అస్సలు నమ్మవద్దు.)
ప్రపంచ ప్రజల ఆలోచనల్లో మార్పు: ఇప్పటివరకు ఎడారి మతాల ప్రభావానికి లోనైన ప్రజా సమూహాలు కూడా హిందుత్వం మతం కాదు హిందుత్వం ఒక జీవన విధానం అని గుర్తించిన వీళ్లు, భారతీయ ప్రసాదిత ఆనందపు వైభవాన్ని రుచి చూస్తున్నారు. ఆయా దేశాల్లో జగన్నాథ రథయాత్ర వంటి భక్తి, ధార్మిక యాత్రలే కాకుండా, తమ సుఖమయమైన ఆనందకర జీవితానికి భారతీయ దార్మిక, ఆధ్యాత్మిక ప్రపంచంలో దారులు వెతుక్కుంటున్నారు.
పర మతాలంటేనే గిట్టని వ్యక్తులుగా 'మార్చబడిన' దుబాయ్ షేకులు , బురకాలు ధరించిన బూబమ్మలు కూడా భేషజాలకు పోకుండా తమ ఆరోగ్యాలను కాపాడే భారతీయ ప్రసాదితమైన ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, యోగా, ప్రాణాయామం వంటి వాటిని సాదరంగా స్వీకరిస్తూ, అష్టాంగ యోగ భారతీయుల పేటెంట్ అయినా ప్రపంచమంతా 'యోగా డే' ను జరుపుకుంటూ, ఏ రుసుము చెల్లించ కుండానే ఆరోగ్యాన్ని అంది పుచ్చుకుంటున్నారు.
ఇంకా ఇంకా అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తులందరూ రామజన్మభూమి ఆందోళనతో ప్రభావితులై స్వాభిమానంతో పనిచేస్తున్న వారే. రామజన్మభూమి ఆందోళన భారతదేశంలోని సాధారణ ప్రజాజీవితంలో ఒక మైలురాయి, భారత ప్రజలకే కాదు, ప్రపంచంలోని హిందువులంధరిలో శ్రీరాముని పట్ల శ్రీరామజన్మభూమి పట్ల ఉన్న అచంచలమైన భక్తి అనేక విజయాలను సాధించి పెడుతుంది. ప్రపంచ ప్రజలంధరి యొక్క ఆలోచనలను ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. తమ వాళ్లకు, తమ మతం వాళ్లకు మాత్రమే సుఖం లభించాలని కోరుకోకుండా.

సర్వే జనఃసుఖినో భవంతు అని కోరుకునే భారతీయ హిందూ జీవన మూలాల భావాలన్నీ సాకారమవుతాయి. అట్టి అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణం తథ్యం ,అయినప్పటికీ మరికొంత సమయం పట్టవచ్చు. అట్లని అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మించబోయే మందిరాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు

- ఆకారపు కేశవరాజు, విశ్వహిందూ పరిషత్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia1

No comments