పంచదార విషం ఎందుకో తెలుసుకుందాం - Sugar is a slow and white poison


పంచదార వలన ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం
శాస్త్రీయ సాంకేతిక వికాసమునకు పూర్వము ఎచ్చటను పంచదార ఆహారపదార్ధములందు పరిగణింపబడెడిది కాదు. తియ్యని పండ్లు లేక చక్కెర తో గూడియున్న పదార్థాలు యొక్క చక్కెర చాలా తక్కువగా రూపాంతరి తముచే అవసరమైన ప్రమాణము వినియోగింపబడెడిది. ఈ కారణమువలననే ప్రాచీనుడు దీర్ఘాయుష్కులై తుది శ్వాస విడుచువరకును శక్తి శాలురై యుండెడి వారు
నేడు జనులందు తెల్లని పంచదార తినుట సభ్యసమాజ చిహ్నమనియు బెల్లం, బెల్లపు పాకము మొదలగు చవుకబారు తిను పదార్దములు నిరు పేదలు కొరకను భ్రాంతి నిలిచిపోయింది. ఈ కారణము చేతనే ఉన్నత మధ్య తరగతుల వారి యందు అత్యధికులు మధుమేహ రోగమునకు గురియగు చున్నారు. తెల్లని పంచదార శరీరమునకు పోషకపదార్థము నందింపనప్పటికిని అది జీర్ణమగుటకు శరీర శక్తి ఎంతో వ్యయమగుచున్నది. అంతేకాదు అది. శరీర తత్వాలు శుష్కింపజేసి పోషక తత్వాలు నశింపజేయుచున్నది. తెల్లని పంచదార ఇన్సులిన్ నిర్మాణము చేసే గ్రంథి పై కలిగించే ప్రభావం వలన దానియందు ఇన్సులిన్ నిర్మాణ శక్తి కొరవడుచున్నది. తత్ఫలితంగా మధుమేహం వంటి రోగములు వచ్చుచున్నవి.
శరీరమును ప్రాణ శక్తి కి కార్బోహైడ్రేటులు పంచదార పాత్ర ప్రముఖమైనది. అయితే అపరిశుద్ధమైన చక్కెరను ఉపయోగించ వలెనని దాని భావము కాదు (Sugar is a slow and white poison) తెల్లని విషము. బెల్లం త్యజించి పంచదార తినే వారు వారి ఆరోగ్యం నందు క్షీణస్థితి కలుగుచున్నది ఒక పబ్లిక్ రిపోర్ట్ కలదు.
బ్రిటన్ ప్రొఫెసరు జాన్ యుడన్ పంచదారను శ్వేత విష మని అందురు. శారీరక దృష్టితో పంచదార అవసరం లేదని ఆయన నిరూపించిరి, మానవుడు ఉపయోగించే పాలు, పండ్లు, ధాన్యము, కూరల యందే శరీరమునకవసరమగు
చక్కెర లభించును. పంచదార వల్ల త్వరితంగా శక్తి లభించునని కొందరి విశ్వాసం కాని ఇది భ్రాంతిజనితము, వాస్తవికత కు చాలా దూరం.
పంచదార లో తీపి మాత్రమే యున్నది, విటమిన్ దృష్ట్యా ఇది చెత్తయే పంచదార తినుట వలన రక్తం నందు కొలెస్టరాల్ వృద్ధి చెందును. దాని వలన రక్త నాళ ములగోడలు లావగును. ఈకారణము వలన BP మరియు
హృద్రోగాలు ఉత్పన్న మగును. ఒక జపాను డాక్టరు 20 దేశములందు పరిశోధనలు చేసి ఆఫ్రికాలోని హబ్షి జనులయందును, మాసాయి, సుంబిక జాతి జనుల యందును హృద్రోగం నామ రూపాలు లేదని వక్కాణించెను.
వారు పంచదార తినకపోవుటయే దానికి కారణము.
అధికముగా చక్కెర తినుట వలన హెపోగ్లుకేమియా అను రోగం, బలహీనత, మిధ్యాక్షుత్తు కలుగును. వణుకు రోగము పుట్టి మూర్చ పోవును. చక్కెర జీర్ణమగునపుడు ఆమ్ల ముత్పన్నమగును. తత్ఫలితంగా పొట్టలోని, చిన్న పేగులోను ఒక విధమైన మంట పుట్టెను. 20% దంచిన పదార్థము అధికముగా యాసిడిటి కలిగించును. చక్కెర తినే బాలురు దంతములందు యాసీడు, బ్యాక్టీరియా ఉత్పన్నమై దంతములకు హాని కలిగించును చర్మ రోగాలు కూడా పంచదార వలననే వచ్చును. అమెరికావాసుడైన డా. హెనిస్ట్ పరిశోధించి చాక్లెట్స్ లో నున్న టాయర్లక్ అనే పదార్థం తలనొప్పి కలిగించునని కనుగొనెను. చక్కెర, చాక్లేట్లు పార్శ్వపు నొప్పులు కలుగజేయును.
నుక పిల్లలు పిప్పరమెంటు గోళీలు, చాక్లెట్ మున్నగు చక్కెరతో గూడిన పదార్ధములనుండి దూరముగా ఉంచ వలసినదని సలహా యీయబడుచున్నది. అమెరికాలో 98 పిల్లలకు దంత రోగమున్నది. దానికి చక్కెరయు దానితో తయారయిన ఇతర పదార్థాలను కారణమని నమ్ముచున్నారు.
విశ్లేషణమువలన చక్కెర లో ఎట్టి ఖనిజములు, లవణాల, విటమిన్లు లేక ఎంజైములు ఉండవు. దాని వలన, దాని నిరంతర వినియోగం వలన వివిధ వ్యాధులు, వికారములును సంక్రమించుచున్నవి.
అధికమైన చక్కెర లేక తీపి పదార్థాలు తినుట వలన శరీరమునుందు కాల్షియం, భాస్వరం ల నిష్పత్తి చెడిపోవును. అది సాధారణముగా 5:2 అనుపాతములోనుండును. చక్కెర జీర్ణమగుటకు శరీర మందు క్యాల్షియం అవసరమగును. అట్లే దాని లోపమువలన ఆర్థరైటిస్, క్యాన్సర్, వైరస్ సంక్రమణము మున్నగు వ్యాధులు వచ్చునవకాశము వృద్ధియగును. తీపి అధికముగా తినుట వలన శరీరము యొక్క జీర్ణ క్రియ ఎందు విటమిన్ 'బి'
కాంప్లెక్సులోపించ మొదలిడును. అది అజీర్ణము, చర్మరోగములు, హృద్రోగము, లాటిస్, నరాల సంబంధించిన వ్యాధులు పెరుగుటకు సహాయపడును.
చక్కెర అధికముగా తినుట వలన లివర్ లో గ్లైకోజెన్ ప్రమాణం తగ్గును దాని వలన అలసట, ఉద్విగ్నత, వ్యాకులత, తలనొప్పి, ఉబ్బసము, మధు మోహము మున్నగు వివిధ వ్యాధులు ఆవరించి అకాల మృత్యువు కలిగించును.
లండను మెడికల్ కాలేజీలోని ప్రసిద్ధ హృద్రోగ నిపుణుడు డా. లుయికిర్ హృదయ రోగాలు ఎక్కువగా పెరుగుటకు చక్కెరయే కారణమని విశ్వసించుచున్నారు. ఆయన శారీరిక శక్తిని పొందుటకు బెల్లము, కర్పూరము, ద్రాక్ష పండ్లు, తేనె, మామిడి పండ్లు, అరటి పండు, బత్తాయి, పుచ్చకాయ, బొప్పాయిపండ్లు, చెరకు, శకర కందు మున్నగునవి పుచ్చుకొనవలెనని సలహా ఇచ్చినారు.
చక్కెరను గురించి శాస్త్రజ్ఞుల అభిప్రాయాలు:
హృద్రోగమునకు క్రొవ్వువలె చక్కెరయు ముఖ్యకారణమే. కాఫీ త్రాగువానికి కాఫీలో వేయు పంచదార కంటెను కాఫీ హానికారకము కాదు. - ప్రొ. జాన్ యుడకిన్ లండన్
తెల్లని పంచదార ఒకరకమైన మత్తు పదార్ధము, శరీరము పై దాని ప్రభావమధికము ప్రొ. లిడాక్లర్క్.
తెల్ల పంచదారకు మెరుగు పెట్టు క్రియ యందు సున్నము, కార్బన్ డై ఆక్సైడ్, క్యాల్షియమ్, పాస్పెట్, ఫాస్ఫారిక్ యాసిడ్, అట్రామిరిక్ బ్లూ, జంతువుల ఎముకల చూర్ణము ఉపయోగించబడును. పంచదార ను విపరీతముగా వేడి చేయడం వలన దానిలోని ప్రోటీన్లు నశించును. అమృతం నశించి విషంగా మారును. తెల్ల పంచదార ఎండు మిరపకాయ కంటెను హానికరము దాని వలన వీర్యం, నీటివలె పలుచబడి స్వప్న స్ఖలములు, బ్లడ్ ప్రెషరు, మేహవ్యాధులు, మూత్ర వికారములు సంభవించును. వీర్య దోషగ్రస్తులగు పురుషులు, కుసుమ రోగగ్రస్తులైన స్త్రీలు పంచదారను పరిత్యజించి అద్భుత ప్రయోజనాలు పొందుచున్నారు. భోజనము నుండి చక్కెరను మినహాయించకున్న పేగులకి సంబంధించిన రోగాలు ఎన్నటికి నశింపవు.డా. ఫిలిప్, మిషిగన్ విశ్వవిద్యాలయం.
కుమారుని పట్ల చెడుగా వ్యవహరించే తల్లి దండ్రులను శిక్షించుట ఉత్తమమని భావించినచో పిల్లలకు పంచదార యు, పంచదార తో జేసీ నా తీయని పదార్ధమును, ఐస్క్రీమ్ తినిపించు తల్లిదండ్రులను జైలులో వేయవలసినదే.- ఫ్రాంక్ విల్సన్.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


Post a Comment

0 Comments