ఈ దేహపూజ నచ్చక సూరదాసు ఆ స్థలాన్ని విడిచి యమునా తీరాన రనకుతా గ్రామానికి చేరాడు. శ్రీకృష్ణలీలలు కనబరిచిన ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే హృదయ కుహర నుండి నాదము వేలువడింది. భగవంతుణ్ణి కలుసు కోవాలని గట్టిగా ఆర్తనాదం చేశాడు. పరిపూర్ణ భక్తుడుగా మారాడు. కృష్ణ నామ స్మరణ తప్ప మరొకటి లేదు. కృష్ణ భక్తి భావ పూరిత కీర్తనలు రచించి వినిపించసాగాడు. ఒకసారి కర్మ, జ్ఞాన, భక్తి స్వరూపులైన వల్లభాచార్యులవారి ఆశీస్సులు లభించాయి సూరదాసు కి.
సూరదాసు ఒక కీర్తనలో భగవంతుని ముందు తన దీనత్వాన్ని వెళ్ళబోసుకుంటే వల్లభాచార్యుడు భక్తుని పలుకులు దీనత్వం, నిస్సహాయత ఉండకూడదు. ఏదైనా సరే పుత్రునిలా అర్థించాలి అని చెప్పాడు. వల్లభుడు సూరదాసు కి అష్టాక్షరీ మంత్రోపదేశం చేశారు. భాగవతంలో దశమ సంధాన్ని వినిపించారు. దానితో సూరదాసు భక్తి తత్త్వం అమృతమయమైంది.సూరదాసు పాటలు భావ గాంభీర్యం, హృదయా వేదన అనురాగం ఉట్టిపడే ఉంటుంది. సూరదాసు పాడుతుంటే కృష్ణులు నాట్యం చేస్తుంటాడని అంటారు.
సూరదాసు భగవంతుణ్ణి ముందు మనసు లో ప్రత్యక్షం చేసుకుని భజన మొదలు పెట్టేవాడు. వల్లభుడు శిష్యుడు విఠలనాథుడు కృష్ణతత్త్వానికి చెందిన ప్రముఖులైన అష్ట భక్తకవులను నియమించదలచి సూరదాసుని ఎనిమిదవ కవిగా నియమించారు. సూరదాసు తన అంతిమ సమయంలో ఈనర్ ఆపని కరనీకరే నరసీ నారాయణ హోమ్ అంటే తన కర్తవ్యాన్ని నిర్వహించిన మానవుడు మాధవుడవుతాడనే సందేశమిచ్చాడు. క్రీ.శ. 16వ శతాబ్దంలో భక్తి యోగ కాలంలో జీవించిన సూరదాసు శ్రీకృష్ణ బాల్య క్రీడలు, ప్రేమలీలలు, భక్తితత్త్వంతో పరవశించి వర్ణిస్తూ గానం చేసేవాడు.
బృందావనం లో కృష్ణుడు ముందు కూర్చొని ప్రతిరోజూ ఒక నూతన ‘పదాన్ని” (భజనగీతం) గానం చేసి ఆరాధించేవాడు. కృష్ణలీలల మర్మాన్ని మనోవైజ్ఞానికమైన పద్ధతి లో వర్ణించే వాడు. కాబట్టి కొంతమంది విద్వాంసులు ఇతడు పుట్టు గ్రుడ్డి అయిఉండదు. కొన్ని కారణాల వల్ల మధ్యలో సంభవించి ఉంటుంది. శ్రీకృష్ణుడి మూర్తిని చూసి ఉండకపోతే ఇంతటి సజీవవర్ణన చేయలేదని విజ్ఞుల అభిప్రాయం. వ్రజభాషలో ఇతడు గానం చేసిన పదాలు (భజన గీతాలు) సంగీత ప్రధానములై “సూరసాగర్” అనే ప్రసిద్ధ గ్రంథం గా రూపొందింది.