పోరాట యోధుడు భీమా నాయక్ - about bheema nayak

0
అవి స్వాతంత్ర్యపు పోరాటపు రోజులు మధ్యప్రదేశ్ దేశానికి నడిబొడ్డున ఉండడంతో అన్ని వైపుల నుంచి స్వాతంత్ర్య ఉద్యమ జ్వాలలు రగులుతునే ఉండేవి. అదే ప్రాంతంలో నివసిస్తూ ఉండేది భలు జనజాతి, జన జాతిలో 1840కి ముందు భీమా నాయక్ జన్మించాడు. మొహలీ గ్రామంలో చిన్ననాటి నుంచి దేశభక్తి అతడి ప్రతి కదలికల్లో కన్పించేది.
1857 పోరాటంలో భీమా నాయక్ ఆంగ్లేయులతో తలబడ్డాడు. అతడికి ఆనాటికే తా0త్యా తోపే తో పరిచయం ఏర్పడింది. తన పరాక్రమంతో ఆంగ్లేయుల దృష్టిలో ఉన్నాడు భీమా నాయక్. కారణం భీమా నాయక్ దగ్గర పదివేల వరకూ సైనికుల్లాంటి యోధులు ఉండేవారు. వారితో కలిసి ఆంగ్లేయుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తూ తమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండేవాడు. ఆంగ్లేయుల ఏజంట్లను, హుకార్లను, జాగీర్దార్లను ముప్పుతిప్పలు పెట్టేవాడు.
1857లో భీమానాయక్ ఇండోర్ కి చెందిన ఒక వ్యాపారి నుంచి 7 లక్షలు విలువ చేసే వస్తువులు బలవంతాన తీసుకున్నాడు. ఇతడి కార్యకలాపాలను చూసిన ఒక ఆంగ్ల అధికారి ఇతడిని బంధించే బాధ్యత తీసుకున్నాడు. ఇతడి సైన్యం భీమానాయక్ సైన్యం ఒక కొండ ప్రాంతంలో హెూరాహెూరీగా తలపడ్డారు. అయితే వారి భారీ సైన్యం ముందు జనజాతి సైన్యం తక్కువైఅప్పటికి వీరిని వెంటాడడం వదల్లేదు. దాడుల్లోనే 13 ఫిబ్రవరి దగ్గరున్న అడవుల్లో దాక్కున్నారు. అయితే ఆంగ్లేయులు 1859 నాడు మరో యుద్ధం వీరిరువురికి మధ్య జరిగింది.దీన్లో 10 మంది గిరిజనులు చనిపోయారు, మరో ముగ్గురు బందీ అయ్యారు. వీరిని మండలేశ్వర్ దుని చెందిన జైల్లో పెట్టారు. అందులోనుంచి భీమా నాయక్ తప్పించుకున్నాడు.
అతడి ఆచూకీ తెలపమని ఆంగ్లేయులు వృద్ధురాలు అయిన అతడి తల్లిని బంధించి చాలా యాతనలు పెట్టారు. యాతనలకి తట్టుకోలేక 15 రోజుల్లోనే వృద్దురాలు మరణించింది. సమాచారం అందగానే జైల్లో ఉన్న భీమా నాయక్ అనుచరులు మండిపడి అక్కడ్నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేసారు. 22 ఆగస్ట్ 1859లో ఇంకొందరు విప్లవ కారులు జైలును చుట్టుముట్టగా వీరు వెనుక ద్వారం నుంచి తప్పించుకున్నారు. ప్రయత్నంలో ఆంగ్లేయుల ఉద్యోగి కెప్టెన్ హేమ్స్ని వారు హతమార్చారు.
తర్వాత దురదృష్టవశాత్తూ వీరు దొరికిపోయారు. వీరిని బహిరంగంగా ఉరితీసారుతరువాత ఏప్రిల్ 2, 1868 నాడు సాత్పురా అడవుల్లో ఒక గుడిశలో నిద్రపోతున్న భీమానాయక్ మీద ఆంగ్లేయులు హఠాత్తుగా దాడి చేసి బంధించారుబయటకు పొక్కనివ్వలేదు.తరువాత అతని విశేషాలను పిరికి పందలైన ఆంగ్లేయులు వనవాసులంతా ఆంగ్లేయుల ముందు రోదించారు. మా ప్రాణాలు తీసుకోండి కాని భీమానాయకిని ఏమీ చేయవద్దని ప్రార్థించారు. కాని అతడి ఆచూకి మాత్రం దొరకలేదు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top