రాజ్‌కుమారి దేవి జీవితం -raj kumari devi lifeభారతదేశం లో వ్యవసాయం ప్రముఖ జీవనాధారం, ఇల్లాలు ఇంటి కి మాత్రమే పరిమితం అనే ఒక ప్రచారం భారతదేశం లో ఎప్పటినుండో వుంది కాని అది అబద్దం. ఎందుకంటే వ్యవసాయ ఆదారమైన మన దేశం లో మహిళ పూర్తి గా అర్దభాగాన్ని పోషిస్తుంది. ప్రతి రైతు భార్య తన భర్తకు చేదోడుగా వుంటూ వ్యవసాయంలో సహయపడేవారు.
మన తెలుగు రాష్ట్రాలలో అయితే ప్రతి మహిళా వ్యవసాయ కుటుంబం అయితే ఖచ్చితంగా ఎదో ఒక సందర్భంలో వ్యవసాయ పనుల్లో భాగస్వామి అయి వుండేది. భీహార్ కి చెందిన అలాంటి ఒక మహిళ రాజ్ కుమారీ దేవి తనకు 2019 లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రధానం చేసింది అమె గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

బిహార్‌కు చెందిన రాజ్‌కుమారి దేవి వయసు అరవై ఏళ్లు. అందరూ ఆమెను కిసాన్‌ చాచి అంటారు. వ్యవసాయంలో పురోగతి సాధించడమే కాకుండా మరెందరో మహిళలకు మార్గదర్శి ఆమె. రాజ్‌కుమారికి వ్యవసాయం చేయాలనే తపన ఎనభై దశకంలోనే మొదలైంది. పెళ్లయిన కొన్నాళ్లకు ఏదయినా చేయాలనుకుని వ్యవసాయాన్ని ఎంచుకున్నారు.
ఇది కుటుంబ సభ్యులకు, ఊరివాళ్లకు నచ్చకపోయినా భర్త సహకారంతో అరటి, మామిడి, బొప్పాయి, లిచి పండ్ల మొక్కలను పెంచడం మొదలుపెట్టారు. తోటి రైతులు హేళన చేసినా... క్రమంగా ఫలసాయం వస్తుండటంతో వాళ్లు విమర్శించడం మానేశారు. ఆ తరువాత కూరగాయల మొక్కల సాగు మొదలుపెట్టారు. క్రమంగా గ్రామ మహిళలకు ఈ పంటల సాగు నేర్పించి, వారందరిని కలిపి స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేశారు.
రోజూ సైకిల్‌పై దాదాపు నలభై, యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తూ తోటి మహిళలకు మార్గదర్శిగా మారారు. ప్రభుత్వం రైతులు, మహిళల కోసం రూపొందించిన పథకాలు అందరికీ అందేలా కృషిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని వివిధ గ్రామాల మహిళలు వ్యవసాయంతోపాటు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు.
వ్యవసాయంతోపాటు పచ్చళ్లు, బొమ్మలు చేయడం, తేనెటీగలు, చేపల పెంపకంతో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఆమె స్థానికంగా జరిగే బాల్య వివాహాలను ఆపడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడంలోనూ ముందుంటారు. దాన్ని గుర్తించిన కేంద్రం ఆమెపై ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఇప్పుడు పద్మశ్రీతో గౌరవించింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments