Page Nav

HIDE
GRID_STYLE

Classic Header

{fbt_classic_header}

Popular Posts

Latest Posts

latest

నౌషెరా సింహం బ్రిగేడియర్ ఉస్మాన్

నువ్వు ఇండియాలో ఉండి ఏం చేస్తావు. హిందుస్తాన్ హిందువులది. నువ్వు పాకిస్తాన్ ఆర్మీలోకి వచ్చేయ్. నీకు ఆర్మీ చీఫ్ పదవిని ఇస్తాను. తొలి పాకిస్త...

నువ్వు ఇండియాలో ఉండి ఏం చేస్తావు. హిందుస్తాన్ హిందువులది. నువ్వు పాకిస్తాన్ ఆర్మీలోకి వచ్చేయ్. నీకు ఆర్మీ చీఫ్ పదవిని ఇస్తాను. తొలి పాకిస్తానీ ఆర్మీ చీఫ్గా చరిత్రలో నిలిచిపోతావు' ఇదీ మహ్మదలీ జిన్నా నుంచి ఆ సైనికుడికి వచ్చిన ఆహ్వానం, అంతకు ముందు ఎందరో ముస్లిం ఆర్మీ ఆఫీసర్లు అతడిని కలిశారు. ఒక ముస్లింగా పాకిస్తాన్తో చేతులు కలపమని అడిగారు. అది జరిగే పని కాదు' అని అతని చిరునవ్వు వాళ్లకి చెప్పింది.
బెలూచ్ రెజిమెంట్లో బ్రిగేడియర్గా ఉన్న మహ్మద్ ఉస్మాన్ భారత సైన్యంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుని, పాకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చేశాడు. ఆయనను డోగ్రా రెజిమెంట్! ఎటాచ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బీబీపుర్ కి చెందిన బ్రిగేడియర్ ఉస్మాన్ ద్విజాతి సిద్దాంతాన్ని ఏనాడూ నమ్మలేదు. భారతదేశం కోసం ఆయన పాక్ ఆర్మీ చీఫ్ పదవిని వదులుకుని వచ్చేశారు. బెలూచ్ రెజిమెంట్ ను పాకిస్తాన్ కు కేటాయించగానే ఆయన భారత్ కు వచ్చేశారు.

బ్రిగేడియర్ అవివాహితుడు. ఆయన మద్యం ముట్టుకునేవాడు కూడా కాదు. నియమ నిష్టలతో జీవితాన్ని గడిపేవాడు. ఆయన జీతంలో ఎక్కువ భాగం పేద విద్యార్థులను చదివించేందుకే ఖర్చు చేసేవాడు. 1935లో సైన్యంలో చేరిన బ్రిగేడియర్ ఉస్మాన్ రెండో ప్రపంచ యుద్ధంలో బర్మా (మయన్మార్) లో పనిచేశారు. దేశ విభజన తరువాత ఆయనను ముందు డోగ్రా రెజిమెంట్లోని 77వ పారాచ్యూట్ బ్రిగేడ్ కి నాయకత్వం వహించమన్నారు.
జమ్మూ కశ్మీర్ పై పాక్ రక్కసి కన్ను పడి, కిరాయి మూకల ముసుగులో పాక్ సైన్యం జమ్మూకశ్మీర్ ను కబళించేందుకు వచ్చినప్పుడు ఆయనకు, ఆయన బ్రిగేడ్ కి జమ్మూ ప్రాంతంలోని నౌషెరా, రంగర్ ప్రాంతాలను కాపాడే బాధ్యతను అప్పగించారు. ఆయన పుణ్యహ రచన, యుద్ధ కౌశలం ఎలాంటిదంటే 1948లో నౌషెరా వద్ద జరిగిన పోరాటంలో దాదాపు వెయ్యిమంది పాకిస్తానీలను ఆయన సైన్యం మట్టుపెట్టింది.
మరో వెయ్యి మందికి గాయాలయ్యాయి. పాకిస్తాన్ తోకముడిచింది. సో షేరా, రంగర్లు శత్రువు గుప్పెట నుంచి విముక్తమయ్యాయి. ఈ మొత్తం పోరాటంలో భారతీయ జవాన్లు కేవలం 30 మంది మాత్రమే చనిపోయారు. పాకిస్తాన్ కిరాయి మూకలు పలాయనం చిత్తగించడంతో ఈ ప్రాంతం విముక్తమైంది. దీనితో పట్టరాని కోపంతో పాక్ ప్రభుత్వం నేరుగా సైన్యాన్నే పంపించింది. అది మే 1948. పాక్ సైన్యం అత్యంత కీలకమైన రంగర్, నౌషెరాలను చేజిక్కించుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ బ్రిగేడియర్ ఉస్మాన్ నాయకత్వం, పోరాట పటిమల ముందు వారి పాచికలు పారలేదు.

మే లో మొదలైన దాడి జూలై వరకూ కొనసాగింది. 1948, జూలై మూడో తేదీన పాకిస్తానీలకు, మన సైన్యానికి నౌషెరాలో భీకరమైన యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో ఒక ఫిరంగి గుండు నేరుగా బ్రిగేడియర్ ఉస్మాన్ ను తాకింది. ఆ క్షణంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి నేను చనిపోతున్నాను, కాని ఒక్క అంగుళం నేల కూడా శత్రువుకి వదలకూడదు, ఆఖరి ఊపిరితో ఆయన అన్న ఈ మాటలు బ్రిగేడియర్ ఉస్మాన్ వ్యక్తిత్వానికి, ధీరోదాత్తతకు నిలువెత్తు నిదర్శనాలు. బ్రిగేడియర్ మాటలు ఆయన సైనికులకు మంత్రాలయ్యాయి. వారు ప్రాణాలొడ్డి పోరాడారు. శత్రువును తరిమికొట్టారు. నో షేరా, రంగధలు విముక్తమయ్యాయి. త్రివర పతాకం రెపరెపలు మన విజయాన్ని సూచించాయి. బ్రిగేడియర్ ఉస్మానికు మహా వీరచర్ల ప్రదానం చేశారు. ఆయన అంతిమ సంసారం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగింది. నేటికీ ఆయన సమాధి అక్కడ ఉంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..