Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఏడుచేపల కథ-చదివితే మీకే తెలుస్తుంది

అమిరపు నాగేశ్వర రావు గారి టపా అనగనగా  ఒక రాజుగారు, ఆయనకి ఏడుగురు కొడుకులు, అందరు వేటకి వెళ్ళారు, ఏడు చేపలు తెచ్చారు, ఎండబెట్టారు, ఆరు ఎండాయ...

అమిరపు నాగేశ్వర రావు గారి టపా

అనగనగా  ఒక రాజుగారు, ఆయనకి ఏడుగురు కొడుకులు, అందరు వేటకి వెళ్ళారు, ఏడు చేపలు తెచ్చారు, ఎండబెట్టారు, ఆరు ఎండాయి, ఏడోది ఎండలేదు. ఎండని చేపకి ఎన్నో కారణాలు, గడ్డిమోపు అడ్డం వొచ్చింది, ఆవు మెయ్యలేదు, పోలిగాడు కట్లు విప్పలేదు, అవ్వ బువ్వ పెట్టలేదు, ఉయ్యాల తొట్లో ఉన్న పాపాయి ఏడిచింది, పాపాయి వేలిని చీమ కుట్టింది. ఇది మన అందరికి తెలిసిన కధే. కానీ ఎంతమందికి ఈ కథ  వంట బట్టింది. ముఖ్యం గా ఎంతమంది రాజకీయ నాయకులు, ప్రజలు ఈ కధని అవగాహన చేసుకుని ప్రజా జీవితం సాగిస్తున్నారు. రాజకీయ నాయకుల వరకు ఎందుకు సామాన్య ప్రజలు అసలు ఆలోచిస్తున్నారు.

ఇంత కథ  లోనూ  ఎండని చేప గురించి ఇంత చర్చ జరిగిందే కానీ ఎండిన ఆరు చేపలని ఎవరైనా పట్టించుకున్నారా. లేదు, మరి ఎందుకు పట్టించుకోలేదు. ఇది ఎవరైనా గమనించారా. సమాజం కుడా అంతే  కదా జరగని విషయాన్ని తలుచుకుని మరీ విశ్లేషిస్తుంది కానీ జరిగిన దాని పట్ల అందువల్ల సమాజం బాగు పడిన దాని పట్ల ఎవరైనా మాట్లాడుతున్నారా, ఆసలు కాస్తైనా విశ్వాసం చూపి కృతజ్ఞతగా  మెలగడం మన బాధ్యత  కదా . అలా ఎందుకు జరగడం లేదు. ఆరు చేపలు ఎండి ఒక పూట కూరగానో పులుసుగానో మారి పది మంది కడుపు నింపాయి అన్న కనీస విషయాన్ని సమాజం ఎందుకు మర్చిపోయింది. తిన్న అన్నాన్ని కూడా  మర్చిపోయి పెట్టిన వాడి చేతిమీద ఉమ్మేయడం ఎంతటి విశ్వాస ఘాతుకత్వం.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఉంది, దేశ ప్రజలకు ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశ పెడుతూనే అన్ని బాధ్యతలను సలక్షణంగా నిర్వర్తిస్తోంది కానీ కొన్ని వర్గాలకి ఎందుకు నచ్చడం లేదు. ఈ  కథ కోణం లోనే ఆలోచించండి.

అనగనగా రాజుగారు శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆయన కొడుకులు అరుణ్ జైట్లీ, స్మ్రితీ ఇరానీ, నిర్మలా సీతారామన్, రాజ్ నాద్, గడ్కరీ మొదలైన ఇతర మంత్రి వర్గ సభ్యులు, పార్టీ నేతలు, నియామక సంఘాల సభ్యులు, ఎన్నికైన శాసన సభ మరియు పార్లిమెంటు సభ్యులు అనుకుందాము . వీరందరూ రాజు గారు ఎలా చెప్తే అలా చేస్తూ వీరి ఆలోచనలను కుడా వ్యక్త పరుస్తూ పాలనలో సహకరిస్తూ దేశ పాలన చేస్తున్నారు. వీరు తెచ్చిన ఏడు చేపలలో ఆరు ఎండాయి ఒకటి ఎండ లేదు. అవి ఏంటో చూద్దాం.

1 వ చేప: దేశ రక్షణ: నాలుగున్నరేళ్ళ పాలనలో దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏనాడైనా రాజీ పడిందా. ఒక్క చోటైనా ఉగ్రవాద దాడి జరిగిందా. ఏనాడైనా ఉగ్రవాద దాడిలో ఒక్కరైనా అసువులు బాసిన దాఖలాలు ఉన్నాయా. భారత భూభాగం లోనుంచి సూది మోపినంత స్తలమైనా వేరే వారు ఆక్రమించుకునే అవకాశం ఇచ్చారా.  మరి ఈ చేప పూర్తిగా ఎండినట్లే కదా.

2వ చేప:ఆర్థిక పటిష్టత: నోట్ల రద్దు చేయడం అనేది దేశానికేమి కొత్త కాదే. ఎన్నో సార్లు జరిగింది ఇక ముందు కుడా జరుగుతుంది. అంత మాత్రాన ఆర్ధికంగా దేశం ఏం నష్ట పోయింది. పైగా ఏనాడు లేని విధంగా నల్లదనం బయటపడింది. అయినా కుడా ఇది జనానికి రుచించ లేదా. మరి ఎన్ని కోట్లు దిగమింగి మీ కంటి ముందే తిరుగుతున్న అవినీతి పరులు ఈ దెబ్బ వల్ల వారి నల్ల ధనాన్ని బైట పెట్టి చెంపలు వేసుకున్న దాఖలు లేవా. ప్రత్యక్షంగా జరగక పోయినా పరోక్షంగా దేశానికి ఎంత మంచి జరిగిందో అంచనా ఉందా ఎవరికైనా. కొన్ని వేల కోట్ల నల్లదనం ప్రభుత్వ ఖాతాల్లో జమ అయ్యి  పన్నులు ప్రభుత్వ స్వాధీనం అయ్యింది. మరి ఆ పన్నులన్నీ  దేశ ప్రగతి కోసం వెచ్చిస్తారే తప్ప మరేదైనా చేసే అవకాశం లేదు కదా. మరి ఈ చేప కుడా ఎండినట్లే కదా.

3వ చేప: అంతర్జాతీయ సంబంధాలు: మోడీ గారు ప్రధాని అయిన  తరువాత ఎన్నో విదేశీ పర్యటనలు జరిగాయి. అందరు అవి వ్యర్థమని  వాదించారు. కానీ ఇక్కడ అందరు ఒక్క విషయం గుర్తుకు తెచ్చుకోండి. ఈనాడు భారత దేశం అంటే ఒక శక్తిగా మారడానికి ఆయన ప్రమేయం ఆయన పర్యటనలు ఎంత దోహద పడ్డాయి. ఎన్నాళ్ళయింది భారత ప్రధాని గళం అంతర్జాతీయ వేదికల్లో వినబడి. ఎన్నేళ్ళయింది ఒక భారత నేతని నాయకుడు, ఒక దిశా నిర్దేశకుడు అనే స్థాయిలో  చూసి. ఇప్పుడు ఉన్న పరిస్తితి ఏంటి. ప్రపంచ దేశాలన్నీ మోడీ మాట్లాడిన మాటని ఎర్ర సిరాతో రాసుకునే  స్థాయికి వచ్చాయి. ఇందులో కుడా రక్షణ వ్యవహారాలను కలగలుపుగా అంతర్లీనం చేసుకుని విజయం సాధించడం లేదా. నిరుడు సార్క్ దేశాలన్నీ కలిసి భారత్ పట్ల పాకిస్తాన్ వ్యవహారం మారక పోతే  సమావేశాలన్నీ  రద్దు చేసుకుంటామని బహిరంగంగా ప్రకటించడం అందుకు ఉదాహరణ కదా. మరి ఇది ఎలా సాధ్య పడింది. మనం నలుగురితోను బాగుంటేనే కదా నలుగురు మనకోసం నిల్చునేది. ఇది అంతర్జాతీయ వేదికల పైన భారత విజయం కాదా. మరి ఈ చేప కుడా బాగా ఎండినట్లే కదా.

4 వ చేప: సాంకేతిక అభివృద్ధి: నాలుగున్నర సంవత్సరాల కాలంలో భారత దేశం ప్రయోగించినన్ని ఉపగ్రహాలను మరే దేశమైనా ప్రయోగించిందా. ఇది ప్రభుత్వ విజయం కాదా. ప్రభుత్వ సహకారం లేకుండానే ఇన్ని ప్రయోగాలు సాధ్య పడతాయా. ఇది కేవలం అణుకేంద్రాల గొప్పతనమే అనుకోవడం ఎంత మూర్ఖత్వం. అందులో ప్రభుత్వ ప్రమేయం ఎంత ఉంటుందో అవగాహన చేసుకోవాలి కదా. వీటిని స్వయంగా ప్రధాని గారే వారి పరిశోధనలకు  కావాల్సిన నిధులన్నీ మునుపెన్నడూ లేని విధంగా  సమకూరుస్తారని ఎందరికి తెలుసు . మరి ఈ చేప కూడా  ఎండినట్లే కదా.

5 వ చేప: అవినీతి రహిత పాలన: ఈ నాలుగున్నరేళ్ళలో ఒక్క అవినీతి కుంభకోణం గాని ఆర్దిక కుంభకోణం గాని రక్షణ వ్యవహారాల బహిర్గతం చేసిన ఉదంతం గానీ ఉన్నాయా. సగర్వంగా చెప్పొచ్చు లేవు అని. పైగా గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్ధిక నేరగాళ్ళను వెనక్కు రప్పించడంలో సడలని పట్టుదలతో ప్రయత్నాలు సాగించి విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. రాఫెల్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని తప్పుబడుతున్న ప్రతిపక్షాలు ఒక కనీస  బాధ్యతను ఎందుకు మరచి పోతున్నారో అర్ధం కావడంలేదు. శాసన సభ లేక పార్లమెంటుకు ఎన్నికైన ఏ పక్ష నేతలైనా ఇట్టి గోప్యత పాటించవలసిన వ్యవహారాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి బహిరంగ వ్యాఖ్యలు చేయడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన కాదా. ఒక శాసన సభ లేదా పార్లిమెంటుకు ఎన్నికయిన ప్రతి సభ్యుడు ప్రాధమికంగా ప్రమాణం చసేది అదే కదా. ప్రభుత్వ లేక నియామక సంఘ పరిశీలనలో ఉన్న ఏ విషయాన్ని దేశ భద్రతని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ పరచను అనే కదా ప్రమాణం చేస్తారు. మరి అది ఎలా మర్చిపోతున్నారు. ఈ విధంగా బహిరంగ పరిస్తే వారి ప్రమాణ ఉల్లంఘన చేసిన నేపధ్యంలో వారి సభ్యత్వం రద్దు చేస్తే వారేం చేయగలరు. ఈ విధంగా చూస్తే  ఈ చేప కుడా ఎండినట్టే కదా.

6 వ చేప: సంక్షేమ పధకాలు: వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడే పుట్టిన చిన్న పిల్లల దగ్గరనుంచి 18 ఏళ్ళ వయసొచ్చిన ఆడ పిల్లల వరకు వారికి ఎటువంటి లోటు లేకుండా అండగా నిలిచే సుకన్య సమృద్ధి పధకాలు, వృద్ధాప్య పించనులు, దివ్యాంగుల  పించనులు, అవసరమైన వారికి అదనపు ఆర్ధిక సాయాలు, ప్రమాద భీమాలు, ఇలా ఎన్నో. ఆఖరుకి ఇవాళే  ప్రకటించిన అగ్రవర్ణాల్లో వెనుకబడిన తరగతి వారికి రిజర్వేషన్ విధానంతో సహ. వీటితో పాటు అనుకోకుండా సంభవించే ప్రకృతి విపత్తులలో ఆదుకోవడంలో ఏనాడు వెనుకంజ వేయలేదు. ఇంతే గాక అనుకోకుండా జరుగుతున్నా ప్రమాదాలు వాటి సమయంలో స్వయంగా ప్రధాన మంత్రే ముందు నిలిచి సహాయక చర్యలను పరిశీలించడం అనేది జరిగింది, ఇదే కాక అటువంటి సమయంలో పార్టీలకి అతీతంగా విపక్ష సభ్యులే అభినందించిన సందర్భాలు ఉన్నాయ్. మరి ఈ చేప కూడా ఎండింది కదా.

ఇన్ని చేపలు ఎండి కడుపు నింపితే ఎండని ఒక్క చేప మీద పది మంది పదిరకాలుగా పడి ఏడుస్తున్నారు. అదీ ఏంటో చూద్దాం.

7 వ చేప: పాపం ఇది ఎండ లేదు: ఎండనివ్వని కారణాలు:

1. మీడియా(అడ్డొచ్చిన పెద్ద గడ్డి మోపు). ఇన్ని ప్రయోజన కారకాలైన పనులు చేస్తున్నా కూడా  ఇంకా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఎప్పుడు లోపాలే చూపిస్తోందే తప్ప చేసిన పని ఒక్కటి కుడా సరైన రీతిలో జనానికి చూపించడం లేదు.  పైగా లేని  వైఫల్యాలను కల్పించి చెప్తోంది. చేసిన పనులు చెయ్యనట్టుగా  సృష్టించి చూపిస్తోంది. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న వ్యవహారం. ఇచ్చిన నిధుల గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖర్చు చేసిందో ఈనాటికి ఎవరికీ లెక్కలు తెలీదు. కానీ ఇవ్వలేదు అని ప్రచారం చేసింది ఇంకా కావాలని అడుగుతోంది. మత పరమైన అంశాలలో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రభుత్వం మీద బురద జల్లుతోంది. ఇంకా ఏంతో విష పూరితంగా ప్రవర్తితోంది.

2. దేశంలో BJP ప్రభుత్వేతర రాష్ట్రాల  ప్రజలు (గడ్డి మోపు దగ్గర మేతకు రాని ఆవు). వీరు కేంద్రం అందిస్తున్న పథకాలు  ఆ రాష్ట్ర ప్రజలు అనుభవించ లేక పోతున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్ర నాయకులు వారి కళ్లుగప్పి వారిని కేంద్ర ఫలాలు అందనివ్వకుండా చేస్తున్నారు. వారికి మీడియా కుడా కొమ్ము కాస్తోంది. ప్రత్యక్ష ఉదాహరణ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలే.

3. దేశంలో BJP యేతర రాష్ట్రాల ప్రభుత్వాలు, మరియు వాటి నాయకులు(ఆవు కట్లు విప్పని పోలిగాడు) వారి కింది నాయకులు, అధికారులు(పోలిగాడికి అన్నం పెట్టని అవ్వ) : ఈ నాయకులకి కనీస జ్ఞానం  లేదు. ఎంతసేపు వారి స్వార్ధమే గానీ వారికి ప్రజల బాధ అక్కర్లేదు. పోలిగాడు ఎలా ఆకలికి అన్నం పెట్టలేదని పనికి పోలేదో వీళ్ళు అలాగే వారి స్వార్ధం తీరలేదని ప్రజలను పట్టించుకోరు. వారి సంక్షేమం పట్టదు. వీరికి సరైన information ఇవ్వని వారి క్రింది స్థాయి నాయకులు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. వీరు అప్పటికి ఉన్న కారణాలు చూపి తప్పించుకుంటారు తప్ప కార్య సిద్ధి  లేని వారు.

4. అవగాహనా రాహిత్యం గల వ్యాపార వేత్తలు(ఉయ్యాలలో ఏడుస్తున్న పాపాయి).  వీరికి వీరి వాణిజ్య ప్రయోజనాలు సిద్ధించాలనే మొండి పట్టుదలే తప్ప ఇతరుల సంక్షేమం పట్టదు. వారు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. లేకపోతే  ప్రభుత్వాలను నిందించి ఇష్టం వొచ్చినట్లు ప్రవర్తిస్తారు. వీరికి కేవలం వ్యాపార దృష్టే తప్ప దేశ ప్రయోజనాలు పట్టవు. వారి ఏడుపే వారిది. ఇంకొకరి బాధ పట్టదు.

5. సామాన్య ప్రజలు (పాపాయిని కుట్టిన చీమ). వీరికి పథకాలు  అందలేదని వాపోవడం ఆవేశం ఒచ్చినపుడు అరవడం తప్ప ఆలోచించరు. ఈ విషయంలో నన్ను అందరూ క్షమించాలి నేను మీలో ఒకడినే. కానీ ఇది నిజం, ఇదే నిజం. అరగంట సేపు అడ్డమైన ఆఫర్ల కోసం ఇంటర్నెట్లో వెదికే ప్రజలు వారికి ప్రయోజనం సిద్ధించే ప్రభుత్వ పధకాల మీద అవగాహన పెంచుకోడానికి కనీసం ఐదు నిమిషాలు ఖర్చుపెట్టరు. పైగా ఎదురుదాడి చేసి ఆయాస పడతారు. ఇక్కడ పైన చెప్పిన కథలో  లేని ఒక ప్రమాదం పొంచి ఉంది. కుట్టిన చీమల కలుగుకి నిప్పు పెడతారు. అలాగే ఎన్నికల్లో డబ్బు కక్కుర్తి పడి ఓటు అమ్ముకున్న ప్రజలు అసమర్ధులను అందలం ఎక్కించి వారి భవిష్యత్తుని దేశాన్ని నాశనం చేస్తున్నారని గ్రహించడం లేదు.

ఎండని చేపకి ఎన్ని అడ్డు పడ్డాయో చూసాం కదా. అదే ఒక వ్యవస్థలో సంయమనం సహకారం పాటిస్తే మంచి అనేది అందరికి ఎంత చేరువలో ఉంటుందో అదే కొరవడితే ఎంతమందికి అపకారం చేసి ఎంతమందిని పస్తు పెట్టి దేశాన్ని యెంత రొష్టు పెడుతుందో ఆలోచించండి.

చూస్తున్నారు కదా ఎంత వ్యవహారం దాగుందో. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏది మంచో ఏది చెడో తెలుసుకుని తేరుకుంటే  మనకే లాభం. పైగా భవిష్యత్ తరాలు మన పిల్లలు ఆనందాలను అనుభవిస్తారు.  అర్ధం చేసుకోండి.

No comments