Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సాధనమున పనులు సమకూరుదరలోన - raka sudhakar

శిష్యుడిలో నిరాశ పెరిగిపోయింది. ఎన్నాళ్లీ సాధన... సిద్ధ శక్తులు ఎంతకీ పట్టుబడటం లేదు... ఏంతకాలమిలా? గురువు దగ్గర అదే మొరబెట్టుకు...


శిష్యుడిలో నిరాశ పెరిగిపోయింది.
ఎన్నాళ్లీ సాధన... సిద్ధ శక్తులు ఎంతకీ పట్టుబడటం లేదు...
ఏంతకాలమిలా?
గురువు దగ్గర అదే మొరబెట్టుకున్నాడు....
గురువు అతడిని తన వెంటబెట్టుకుని ఆశ్రమంలోని చైనా వెదురు పొద దగ్గరకు తీసుకెళ్లాడు.... 90 అడుగుల పొడవున్న వెదురు అది...
గురువు ఆ వెదురు పొదను చూపించాడు.
"నేను దీని చిన్న దుంపను తెచ్చి నేలలో నాటి, నీళ్లు పోశాను. ఏడాది పాటు పోశాను. చిన్న మొలక కూడా ఎత్తలేదు. చెట్టు మొలవదేమో అనుకున్నాను. అయినా నీరుపోస్తూనే వచ్చాను. నేలను శుభ్రం చేస్తూనే వచ్చాను. రెండో ఏడు గడిచిపోయింది. చిన్న పిలక వచ్చింది. రెండాకులు... అంతే ... నాకు విసుగు వచ్చింది. చెట్టు ఎదగదేమో అనుకున్నాను. మూడో ఏడు, నాలుగో ఏడు కూడా అలాగే గడిచిపోయింది. మొక్కలో ఎలాంటి ఎదుగుదలా కనిపించలేదు.
అయిదో ఏడాది కూడా పూర్తి కావస్తోంది. అప్పుడు హఠాత్తుగా మొక్క ఎదగడం మొదలైంది. మారాకులు తొడిగింది... పొడవు అమాంతం పెరిగింది. నాలుగంటే నాలుగు వారాల్లో 90 అడుగుల పొడవు ఎదిగింది. "
గురువు చెప్పడం ఆపి శిష్యుడి వైపు చూశాడు.

మళ్లీ కొనసాగించాడు.
"ఇప్పుడు చెప్పు... మొక్క పెరగడానికి ఎంత సమయం పట్టింది?"
"నాలుగు వారాలు."
"తప్పు.... అయిదేళ్లు... నాలుగేళ్ల పదకొండు నెలల పాటు ఆ మొక్క ఈ 90 అడుగుల ఎత్తున్న చెట్టు బరువును తట్టుకునే బలాన్ని పెంచుకునేందుకు నేల లోతున వేళ్ల జాలాన్ని విస్తరించింది. ప్రతి మట్టిరేణువును పట్టుకుని బలంగా తయారైంది. ప్రతి నీటి చుక్కను పీల్చుకుని సత్తువ పెంచుకుంది. కనిపించే నాలుగు వారాల ఎదుగుదల వెనుక కనిపించని నాలుగేళ్ల పదకొండు నెలల కృషి ఉంది."
శిష్యుడికి ఆకాశంలోకి దూసుకుపోయిన వెదురు ఎత్తులో నేలలోకి పాతుకుపోయిన వేళ్ల లోతు కనిపించింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments