Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

ఆవుపాల శ్రేష్ఠత - megamindsinda

ఆవుపాల శ్రేష్ఠత 1. కొంచెము పలుచగా ఉంటాయి. 2. త్వరగా అరుగుతాయి. 3. చిన్న పిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానము 4. మనిషిలో చలాకీని పె...

ఆవుపాల శ్రేష్ఠత
1. కొంచెము పలుచగా ఉంటాయి.
2. త్వరగా అరుగుతాయి.
3. చిన్న పిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానము
4. మనిషిలో చలాకీని పెంచుతుంది.
5. ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి . ప్రేగులలో క్రిములు నశిస్తాయి .
6. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
7. చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి.
8. మనస్సును, బుద్ధిని చైతన్య వంతం చేస్తాయి.
9. సాత్విక గుణమును పెంచుతాయి.
10. సాధువులు ఋషులు మునులు ఆవుపాలనే సేవిస్తారు.
11. యజ్ఞమునకు, హోమమునకు ఆవుపాలను వాడుతారు.
12. దేవాలయములలో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడతారు.
13. కార్తీక పురాణములో- ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని చెప్పారు.
14. గోవు దేవతా స్వరూపము. కైలాసం దగ్గరలోని గోలోకము నుండి వచ్చినది. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుంది.
15. ఆవుపాలలో – బంగారము ఉన్నది. ఆవు మూపురములో స్వర్ణనాడి సూర్య కిరణాలతో ఉత్తేజితమై బంగారు (చరక సంహిత) తత్వంగల ఒక పచ్చని పదార్ధాన్ని ఒదులుతుంది. అందువల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయి, ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉన్నది.
16. తెల్లఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవుపాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
17. ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి.
18. ఘృతేన వర్దేతే బుద్ధిః క్షీరేణాయుష్య వర్ధనం, ఆవు నెయ్యి బుద్ధి బలమును పెంచును. ఆవుపాలు ఆయుష్షును పెంచును, ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండములో చెప్పారు. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.
19. చందోగ్య ఉపనిషత్ (6-6-3) మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరాలులోని స్థూల భాగం శరీరంలోని ఎముకలుగా మారుతుంది. మధ్యభాగం మజ్జ (మూలుగ)గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ (మూలుగ) మంచి సాత్విక, శ్రావ్యమైన హక్కు కోసం ఆవు నేయ్యి, వెన్న తప్పక తినవలెను.
20.భారతీయ గోవులకు మూపురము వుండును. ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉన్నది, అందువలన ఈ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణములున్నవి.

పాశ్యాత్య గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. యివి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వీటి పాలు మంచివి కావు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు మూపురము ఉన్న ఆవుపై ఆధారపడి ఉంది. ఈ ఆవుపాలు చలాకిని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వగుణమును, బుద్ధిబలమును, ఒజస్సును పెంచును, ఓజస్సు మనిషి యొక్క తెలివికి, ఆకర్షణశక్తి, వ్యాధి నిరోధక శక్తిని ప్రధాన కారణము, నెయ్యి – ఆరోగ్యమైన మంచి ఎముకలను మంచి రక్తమును ఉత్పత్తి చేయు మూలుగను, మంచి వాక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్దిబలమును పెంచుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్టిరాల్ అయిన యల్.డి.యల్ cholesterol ను పెరగనివ్వదు. ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తము ఉత్పత్తి అయి, వ్యాధికారక క్రిములను (Aids ను కలుగచేయు Virus క్రిములతో సహా) చంపి వేసి, ఆరోగ్యమును కలుగజేయును. స్త్రీలలో ఎముకలు బలహీనమై Osteoporosis, Arthritis అనే వ్యాధి రాకుండా ఉండటానికి , వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణి స్త్రీలు మంచి calcium పొందడానికి – Calcium మాటల కన్నా ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. స్త్రీ గర్భములోని బిడ్డకు ఎముక పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది. ఈ జన్మలో నిత్యమూ తీసుకొనే ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి యొక్క సూక్ష్మ అంశతో 
ఏర్పడే ‘మనస్సు, బుద్ధి’ రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలము ప్రసాదిస్తుంది. మన ఋషులు తపశ్శక్తితో చెప్పిన సూక్ష్మ విషయములు Scientists కొంతవరకే నిర్ధారించగలరు. ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యము గురించిన వివరములు Science ఇంకనూ కనుగొనలేదు. వాటి గురించిన వివరములు తెలుసుకో గలిగినప్పుడే Scientists పై విషయములు చెప్పగలుగుతారు...
అందుకే కొంచం కష్టమైనా, నాటు ఆవుపాలు,అంటే దేశీ ఆవుపాలు,ఇప్పుడు కొత్తగా A2 milk అని అంటున్నారు కదా ఆ ఆవుపాలు ఆరగించండి..
గమనిక,:ఇప్పటికి చాలా మంది  జర్సీ,హోలిస్టిన్,లాంటి విదేశీ జంతువులు కూడా ఆవులే అనే భావనలో వున్నారు కాబట్టి మళ్ళీ గుర్తుచెయ్యాలిసి వస్తుంది.. మెడ మీద మోపురం,మెడ క్రింద గంగడోలు ఉన్నవి మాత్రమే గోవులు అని గుర్తించాలి...

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..