ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌కు ప్రతిపక్షాలు పదేపదే అడ్డు తగిలినందుకు నిరసనగా బీజేపీ అధ్...

ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌కు ప్రతిపక్షాలు పదేపదే అడ్డు తగిలినందుకు నిరసనగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి మోదీ ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించడం గమనార్హం.
ఈ నెల 12న (గురువారం) కర్ణాటకలో ఈ ఇద్దరూ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న అందరూ బీజేపీ ఎంపీలు ఈ నిరాహార దీక్షలో పాల్గొననున్నారు.
దళితులపై దాడికి నిరసనగా రాజ్‌ఘాట్ దగ్గర కాంగ్రెస్ చేసిన నిరాహార దీక్షకు కౌంటర్‌గా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.
నిరాహార దీక్ష ఐడియా ప్రధాని మోదీదేనని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగకపోవడం వల్ల ప్రజలకు ఎంత నష్టం జరిగిందో తమకు తెలుసని చెప్పే ప్రయత్నంలో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
అందుకే ఆ 23 రోజుల జీతాలను తీసుకోవడానికి కూడా ఎన్డీయే ఎంపీలంతా నిరాకరించిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.
No comments
Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..